Breaking News

Daily Archives: March 18, 2017

నేడు మిషన్‌ భగీరథపై సమావేశం

  గాంధారి, మార్చి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మిషన్‌ భగీరథ పనులపై ప్రజాప్రతినిధులకు ఆదివారం సమావేశం నిర్వహిస్తున్నట్టు డిపిఓ రాములు తెలిపారు. కార్యక్రమానికి గాంధారి మండలానికి చెందిన జడ్పిటిసి, ఎంపిపి, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు హాజరు కావాలన్నారు. స్థానిక పార్శిరాములు కళ్యాణ మండపంలో మధ్యాహ్నం రెండు గంటలకు జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన సమావేశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో మిషన్‌ భగీరథ గ్రామీణ ప్రాంతాల పనులపై స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించనున్నట్టు తెలిపారు.

Read More »

హనుమాన్‌ మండల పూజ పోస్టర్ల ఆవిష్కరణ

  గాంధారి, మార్చి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంజనేయస్వామి సామూహిక మండల పూజ ఈనెల 30,31 తేదీల్లో బాన్సువాడలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో హనుమాన్‌ మండల పూజకు సంబంధించిన గోడప్రతులను స్వాములు ఆవిష్కరించారు. బాన్సువాడలో పెద్ద ఎత్తున నిర్వహించే సామూహిక మండల పూజతో పాటు 24 గంటల అఖండ హనుమాన్‌ చాలీసా పారాయణ మహోత్సవ కార్యక్రమానికి స్వాములు పెద్ద ఎత్తున హాజరు కావాలని నియోజకవర్గ గురుస్వామి శ్రీనివాస్‌ తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో వ్యవసాయశాఖ ...

Read More »

డీలర్లు సకాలంలో డిడిలు కట్టాలి

  గాంధారి, మార్చి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రేషన్‌ డీలర్లు సకాలంలో డిడిలు కట్టాలని గాంధారి తహసీల్దార్‌ ఎస్‌.వి.లక్ష్మణ్‌ అన్నారు. శనివారం ఆయన చాంబర్‌లో మండలానికి చెందిన రేషన్‌ డీలర్లతో సమావేశమయ్యారు. డీలర్లు రేషన్‌ సరుకులను లబ్దిదారులకు సకాలంలో అందించాలన్నారు. సరుకులు పక్కదారి పట్టకుండా జాగ్రత్త వహించాలన్నారు. ప్రతినెలలో డిడిలను సరైన సమయానికి చెల్లించి సరుకులు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో గిర్దావర్‌ శ్రీనివాస్‌రావు, రేషన్‌ డీలర్ల సంఘం కోశాధికారి జువ్వాడి శంకర్‌, డీలర్లు పోతంగల్‌ కిషన్‌, పత్తి లింగం, తదితరులు ...

Read More »

పది పరీక్షలు ప్రశాంతం

  బీర్కూర్‌, మార్చి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో శనివారం నిర్వహించిన పదవ తరగతి తెలుగు పేపర్‌-2 ప్రశాంతంగా జరిగాయని మండల విద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. ఎటువంటి మాల్‌ప్రాక్టీస్‌ జరగకుండా గట్టి చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీరు, మెడికల్‌సిబ్బంది అందుబాటులో ఉంచామని, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.

Read More »

విశ్వబ్రాహ్మణ నసురుల్లాబాద్‌ కమిటీ ఎన్నిక

  బీర్కూర్‌, మార్చి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలో విశ్వబ్రాహ్మణ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్‌, కార్యదర్శి రామాచారి ఆధ్వర్యంలో శనివారం నసురుల్లాబాద్‌ మండల కమిటీని ఆలయంలో ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షులుగా పడిగి గంగాధర్‌చారి, కోశాధికారి కాశీనాథ్‌చారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. తమపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా విశ్వబ్రాహ్మణ సంఘం కోసం కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు.

Read More »

పంట నష్టం అందించాలని రాజధానికి రైతుల మహాపాదయాత్ర

  బీర్కూర్‌, మార్చి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం రాత్రి కురిసిన వడగండ్ల వానకు పంటనష్టపోయిన రైతులు ప్రభుత్వం పరిహారం అందించాలని కోరుతూ బీర్కూర్‌, చించొల్లి, దామరంచ, అన్నారం రైతులు శనివారం రాజధానికి మహాపాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వడగండ్ల వాన వల్ల ఆయా గ్రామాల్లో రైతులు వందశాతం పంట నష్టపోయారని, సుమారు 4 వేల ఎకరాల పంట నష్టం జరిగిందని వాపోయారు. గత రెండు సంవత్సరాల కాలం నీరులేక కరువు వల్ల పంట పండించలేకపోయామని, ఈయేడు ...

Read More »

ప్రతి ఒక్క రైతుకు న్యాయంచేస్తాం

  – జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ బీర్కూర్‌, మార్చి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వడగండ్ల వానవల్ల నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ప్రబుత్వం ఆదుకుంటుందని, ఎలాంటి అపోహలకు పోవద్దని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ స్పష్టం చేశారు. మండలంలోని దామరంచ, అన్నారం, చించొల్లి, కిష్టాపూర్‌, బీర్కూర్‌ గ్రామాల్లో వడగండ్ల వానవల్ల పంట నష్టం జరిగిన ప్రాంతాలకు నడుచుకుంటూ వెళ్లి పొలాలను పరిశీలించారు. భార్యల పుస్తెలు అమ్మి యాసంగి నాట్లు వేశామని, ప్రకృతి వైపరీత్యం వల్ల ఉన్నదంతా పోగొట్టుకున్నామని, ఇక తమకు పురుగు ...

Read More »

బీమాతో కూడిన పార్టీ సభ్యత్వం

  గాంధారి, మార్చి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జీవితబీమాతో కూడిన తెరాస పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేస్తున్నట్టు తెరాస మండల అధ్యక్షుడు శివాజీరావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో సింగిల్‌విండో కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు మండలంలో 1625 క్రియాశీల సభ్యత్వాలు నమోదుకాగా 6750 సాధారణ సభ్యత్వాలు నమోదైనట్టు ఆయన తెలిపారు. క్రియాశీల సభ్యత్వం రుసుము వంద రూపాయలు కాగా సభ్యులకు రెండు లక్షల రూపాయల జీవితబీమా వర్తిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ చేస్తున్న అభివృద్ది పనులనుచూసి ...

Read More »

తుపాకీ స్వాధీనం

  – వ్యక్తిపై కేసు నమోదు గాంధారి, మార్చి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో పోలీసులు ఓ వ్యక్తి వద్ద నుంచి తుపాకీతో పాటు మరో ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. స్థానిక ఎస్‌ఐ రాజేశ్‌ కథనం ప్రకారం… మండలంలోని చందానాయక్‌ తాండాకు చెందిన కేతావత్‌ సంగ్రామ్‌ ఇంట్లో తుపాకీ ఉందన్న పక్కా సమాచారం మేరకు శనివారం ఉదయం ఐదు గంటల సమయంలో దాడులు జరిపినట్టు తెలిపారు. ఈ సంఘటనలో సంగ్రామ్‌ ఇంట్లోఉన్న కంట్రిమేడ్‌ తుపాకీతోపాటు ...

Read More »

నిబంధనలు లేని జీవనభృతి అందించాలి

  మోర్తాడ్‌, మార్చి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలు లేని జీవనభృతి సౌకర్యాన్ని బీడీ కార్మికులకు అందజేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు సత్తక్క, సారా లక్ష్మి, జమునలు అన్నారు. శనివారం ఏర్గట్ల తహసీల్‌ కార్యాలయం ముందు యూనియన్‌ ఆధ్వర్యంలో ఏడు గ్రామాల బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఎఎస్‌వో రవిందర్‌కు అందజేశారు. యూనియన్‌ ఆధ్వర్యంలో పోరాటాలు చేసి బీడీ కార్మికులకు జీవన భృతి కల్పించాలని డిమాండ్‌ ...

Read More »

ఉత్తమ పంచాయతీలకు ప్రోత్సాహకాలు

  – డిపివో రాములు గాంధారి, మార్చి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీలకు నగదు ప్రోత్సాహకాలు అందజేయనున్నట్టు కామారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి రాములు అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఎండివో కార్యాలయంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వందశాతం ఇంటి పన్ను వసూలే లక్ష్యంగా పనిచేయాలన్నారు. జిల్లాలో మొత్తం 14 కోట్ల 93 లక్షల రూపాయల ఇంటిపన్ను వసూలే లక్ష్యంగా ఉండగా ఇప్పటివరకు 9 ...

Read More »

విఎల్‌ఇల దరఖాస్తులు అందజేత

  మోర్తాడ్‌, మార్చి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేస్తున్న విఎల్‌ఇల దరఖాస్తులను జిల్లా కలెక్టర్‌కు అందజేసినట్టు ఐకెపి ఎపిఎం ప్రమీల అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ మండలంలోని సుంకెట్‌, షెట్పల్లి, దొన్కల్‌, దోంచంద, ఏర్గట్ల, పాలెం, తిమ్మాపూర్‌, బట్టాపూర్‌, గాండ్లపేట్‌ గ్రామ పంచయతీల్లో ఏర్పాటుచేయనున్న పౌరసేవల అభ్యర్థుల దరఖాస్తులను జిల్లా కలెక్టర్‌ ఆదేశానుసారం అందజేసినట్టు ఆమె తెలిపారు. కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌ల అభిప్రాయం మేరకు ఇంటర్‌ అర్హత గలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం ...

Read More »

మూడోవిడత హరితహారం కోసం సిద్దం

  మోర్తాడ్‌, మార్చి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు తెరాస ప్రబుత్వం అమలు చేస్తున్న మూడోవిడత హరితహారం పథకం అమలు చేసేవిధానంపై ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని ప్రోగ్రాం అధికారి నర్సయ్య అన్నారు. శనివారం మోర్తాడ్‌లోని ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ భవనంలో మండలాల పీల్డ్‌ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ముందస్తుగా ప్రణాళికలు రూపొందించి మండలానికి కేటాయించిన 7 లక్షల 20 వేల మొక్కలు లక్ష్యంగా నాటాలన్నారు. మూడో విడతలో రోడ్లు, గుట్టలు, రైతుపొలాల గట్లపై, ఇళ్లముందు, చెరువుకట్టలపై, శ్మశాన వాటికల్లో, ...

Read More »

ఉపాధ్యాయులు ఐక్యతతో ఉద్యమించాలి

  మోర్తాడ్‌, మార్చి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయులు ఐక్యతతో తమ హక్కులు సాధించుకోవాలని ఎంఇవో రాజేశ్వర్‌ అన్నారు. శనివారం మోర్తాడ్‌ మండల విద్యావనరుల కేంద్రంలో సిపిఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం జిల్లా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంఇవో ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. సిపిఎస్‌ విధానం రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్నే పునరుద్దరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సిపిఎస్‌ విధానం రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు ...

Read More »

రెండోరోజు ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు

  మోర్తాడ్‌, మార్చి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పాలెం, ఏర్గట్ల, మోర్తాడ్‌లోని ఉన్నత పాఠశాల, రామాన్నపేట్‌ పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి విద్యార్థులు శనివారం ప్రశాంతంగా పరీక్షలు రాశారు. ఎంఇవో రాజేశ్వర్‌తోపాటు మోర్తాడ్‌ తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌ శనివారం పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. పోలీసులు, గ్రామ సేవకులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రశాంతంగా పరీక్షలు జరుగుతున్నట్టు తెలిపారు.

Read More »

బీట్ రూట్ జ్యూస్ తో పీరియడ్స్ సమస్యలకు చెక్..

మహిళలను వేధించే సమస్య పిరియడ్‌ ప్రాబ్లమ్‌… ప్రతినెల నెలసరి సమయంలో తప్పకుండా వచ్చే కడుపు నొప్పి తట్టుకోలేక విలవిలాడుతారు. మహిళలో వచ్చే పిరియడ్ నొప్పులను బహిష్టు నొప్పి అని కూడా అంటారు. ఈ రకమైన నొప్పి మీకు లేకుంటే కనుక మీరు అదృష్టవంతులైన యువతులే. చాలామంది యువతులకు ఈ నొప్పి ప్రతినెలా నెలసరి సమయంలో వస్తుంది. పీరియడ్స్ అయ్యే ముందు, అయిన తర్వాత కూడా యువతులు ఈ నొప్పితో ఎక్కువగా బాధ పడతారు. కొంత మందికి నెలసరికీ నెలసరికీ మధ్యలోనూ రక్తస్రావం అవుతుంది. నెలసరి ...

Read More »