Breaking News

Daily Archives: March 19, 2017

ఆటో ఢీకొని నలుగురికి తీవ్ర గాయాలు

  బీర్కూర్‌, మార్చి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తప్పతాగిన మైకంలో ఆటో నడుపుతూ ఎదురుగా వస్తున్న వాహనాలను, వ్యక్తులను ఢీకొంటూ గాయపరిచిన ఆటోడ్రైవర్‌ ఉదంతం మండలంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం హైదరాబాద్‌కు చెందిన ఆటో టిఎస్‌ 34 టి/ఆర్‌ 0597 బీర్కూర్‌ మండలంలోని బరంగెడ్గి గ్రామానికి బంధువులఇంటికి వచ్చారు. మద్యంసేవించి ఉన్న డ్రైవర్‌ తిరుగుప్రయాణంలో అలాగే డ్రైవింగ్‌ చేయడంతో అన్నారం గ్రామం వద్ద బాన్సువాడ గ్రామానికి చెందిన మామిడి విఠల్‌, గీత దంపతులకు ఢీకొని బాన్సువాడ వైపు ...

Read More »

కొనసాగుతున్న ఆలయ నిర్మాణ పనులు

  నిజాంసాగర్‌, మార్చి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని బ్రాహ్మణ్‌పల్లి గేటువద్ద సంగారెడ్డి-నాందేడ్‌ అకోలా రహదారిపై మనకోసం మనం అనే స్వచ్చంద సంస్థ తరఫున గ్రామానికి చెందిన కిషోర్‌ కుమార్‌ అభయ ఆంజనేయస్వామి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించి నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. బ్రాహ్మణ్‌పల్లి గేటు వద్ద ఆంజనేయస్వామి విగ్రహం తోపాటు రహదారి వెంట ప్రయాణించే ప్రయాణీకుల విశ్రాంతి కోసంరెండు గదులు, బోరుబావి, మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్టు కిషోర్‌ కుమార్‌ తెలిపారు. రానున్నరోజుల్లో ఈ ప్రాంతం పుణ్యక్షేత్రంగా ...

Read More »

గాంధారిలో ఎన్‌ఐఓఎస్‌ పరీక్ష

  గాంధారి, మార్చి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో సాక్షరాభారతి ఆధ్వర్యంలో నిరక్షరాస్యులకు ఆదివారం ఎన్‌ఐఓఎస్‌ రాత పరీక్ష నిర్వహించినట్టు మండల కో ఆర్డినేటర్‌ మోతిసింగ్‌ అన్నారు. 12 గ్రామ పంచాయతీలకుగాను 520 మంది నిరక్షరాస్యులు హాజరైనారని తెలిపారు. వజ్జేపల్లి గ్రామంలో 40 మంది, పేట్‌సంగం – 67 మంది, చద్మల్‌లో 43 మంది ఆయా గ్రామాల్లో పరీక్షలు రాశారని తెలిపారు. మొత్తంగా స్త్రీలు 305 మంది పురుషులు 215 మంది పర్షీలు రాయడం జరిగిందని వివరించారు.

Read More »

కొనసాగుతున్న నీటి విడుదల

  నిజాంసాగర్‌, మార్చి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాలువద్వారా నీటి విడుదల కొనసాగుతుందని డిప్యూటి ఇఇ దత్తాత్రి తెలిపారు. ఆయకట్టు రైతులు నీటిని పొదుపుగా వాడుకొని వృధా చేయకుండా చూడాలని అన్నారు. యాసంగి పంటల కోసం కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లోని లక్ష ఎకరాల్లో సాగు చేపట్టారని, ఐదువిడతలుగా నీటి విడుదల కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఐదోవిడత నీటి విడుదల 10 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. నీటి పారుదల శాఖ సిబ్బంది ఎల్లవేళలా ...

Read More »

కొనసాగుతున్న మిషన్‌ భగీరథ పనులు

  నిజాంసాగర్‌, మార్చి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మిషన్‌ భగీరథ పనుల్లో భాగంగా సుంకిపల్లి తండా సమీపంలో బోధన్‌-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై 15 లక్షల లీటర్ల పరిమాణంతో నిర్మిస్తున్న ట్యాంకు నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ ట్యాంకు జుక్కల్‌, బాన్సువాడ, బోధన్‌ నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు నిర్మిస్తున్నారు. ఓ వైపు పైప్‌లైను పనులు కొనసాగుతుండగా, మరో వైపు వాటర్‌ ట్యాంకు నిర్మాణ పనులు ఊపందుకుంటున్నాయి.

Read More »

పోలీసుల పల్లెనిద్ర

  బీర్కూర్‌, మార్చి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని బైరాపూర్‌ గ్రామంలో బాన్సువాడ రూరల్‌ సిఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రజలు మూఢనమ్మకాలు విశ్వసించవద్దని, బాణామతి, చేతబడి పేరుతో ఇతరులనుహింసించడం తగదని సూచించారు. గ్రామంలో బెల్టుషాపులు, క్రికెట్‌ బెట్టింగ్‌లపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని, వీటిని నిరోధించేవిధంగా గ్రామస్తులు సహకరించాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా మండలంలోని ఆయా గ్రామాల్లో పల్లె నిద్ర ద్వారా ప్రజలను చైతన్యం ...

Read More »

వంతెన పిల్లర్లు పగిలిపోతున్నాయి

  – భయాందోళనలో ప్రజలు – పట్టించుకోని అధికారులు నిజాంసాగర్‌, మార్చి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని అచ్చంపేట మధ్య మంజీర నదిపై నిజాం హయాంలో నిర్మించిన వంతెన పునాదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ వంతెనపై నుంచి వెళ్లే వాహనదారులు, ప్రజలు భయాందోలనకు గురవుతున్నారు. అధికార యంత్రాంగం చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ముందే అప్పటి నిజాం ప్రభుత్వం లక్షలు వెచ్చించి నదిపై వంతెన నిర్మాణం చేపట్టారు. సుమారు వందేళ్ళు పూర్తి కావడంతో ...

Read More »

రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటాం

  బీర్కూర్‌, మార్చి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో దామరంచ, అన్నారం, చించొల్లి, కిష్టాపూర్‌, బీర్కూర్‌ గ్రామాల్లో గురువారం కురిసిన వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం జహీరాబాద్‌ ఎంపి బి.బి.పాటిల్‌తో కలిసి పంట నష్టం జరిగిన ఆయకట్టు ప్రాంతాలను ఆయా గ్రామాల్లో పర్యటించి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు వేసిన పంట రకాలను అడిగి తెలుసుకున్నారు. 15 రోజుల్లో పంటచేతికందుతున్న సమయంలో ప్రకృతి ...

Read More »

కిష్టాపూర్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ విదుల నుంచి తొలగింపు

  బీర్కూర్‌, మార్చి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపి బిబి పాటిల్‌తో కలిసి వడగండ్ల వాన వల్ల పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులకు ఉపాధి పనులు కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఎవరు, ఎక్కడ అని ప్రశ్నించడంతో అక్కడ పీల్డ్‌ అసిస్టెంట్‌ లేకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పీల్డ్‌ అసిస్టెంట్‌ మారుతిని విధుల నుంచి తొలగించాలని ...

Read More »

సీనియర్‌ జర్నలిస్టు శివన్న మృతి

  బీర్కూర్‌, మార్చి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నమస్తేతెలంగాణ స్టాఫ్‌ రిపోర్టర్‌ శివన్న ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. గత 30 సంవత్సరాలుగా ఆయా పత్రికల్లో పనిచేశారు. సమాజంలో నెలకొన్న సమస్యలను వెలికితీసి ప్రజలకు పరిష్కారమార్గం చూపారు. అంతేగాకుండా సామాజిక రంగంలో ముందుండి ఆయా వర్గాల ప్రజలకు పలురకాల సేవా కార్యక్రమాలు అందించడంలో చురుకుగా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జహీరాబాద్‌ ఎంపి బి.బి.పాటిల్‌ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శివన్న మరణం ...

Read More »

సభ్యత్వ నమోదు చేపట్టాలి

  మోర్తాడ్‌, మార్చి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీ సభ్యత్వ నమోదు సక్రమంగా చేపట్టాలని జిల్లా తెరాస ఉపాధ్యక్షుడు రాజాపూర్ణానందం, మండల తెరాస అధ్యక్షుడు కల్లడ చిన్నయ్యలు అన్నారు. మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో ఆదివారం తెరాస పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తు సభ్యత్వ నమోదు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఎమ్మెల్యే కృషి

  మోర్తాడ్‌, మార్చి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అన్ని గ్రామాలకు మిషన్‌ భగీరథ పథకం కింద స్వచ్చమైన తాగునీరు అందించేందుకు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని ఎంపిపి కల్లడ చిన్నయ్య, సర్పంచ్‌లు సత్తమ్మ, హనుమాగౌడ్‌, ఉగ్గెర భూమేశ్వర్‌, జిల్లా తెరాస ఉపాధ్యక్షుడు రాజాపూర్ణానందం, మండల తెరాస అధ్యక్షుడు కల్లడ ఏలియాలు అన్నారు. ఆదివారం మండలంలోని దొన్కల్‌, తిమ్మాపూర్‌ గ్రామాల్లో మిషన్‌ భగీరథ పథకం కింద 90 వేల లీటర్ల మంచినీటి పథకానికి భూమిపూజ చేసి పనులు ...

Read More »

పారిశుద్య కార్మికులకు ప్రభుత్వమే వేతనాలు అందించాలి

  మోర్తాడ్‌, మార్చి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో ప్రజల ఆరోగ్య సంక్షేమమే ధ్యేయంగా నిత్యం మురికి కాలువలు, చెత్త చెదారం శుభ్రం చేస్తున్న పారిశుద్య కార్మికుల వేతనాలు పెంచి ప్రభుత్వమే నేరుగా అందించాలని ఏర్గట్ల సర్పంచ్‌ శ్రీవైష్ణవి అన్నారు. ఏర్గట్లలో గత ఐదురోజులుగా కొనసాగుతున్న మురికి కాలువల, పారిశుద్య పనులను, బస్‌షెల్టర్‌ నిర్మాణ పనులను సర్పంచ్‌ ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామంలో ఐదురోజులుగా పెర్కిట్‌ నుంచి అద్దె కూలీలను తీసుకొచ్చి గ్రామంలోని అన్ని వీధుల్లో మురికి ...

Read More »

సోమవారం మోర్తాడ్‌కు ఎమ్మెల్యే రాక

  మోర్తాడ్‌, మార్చి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పాలెం, ఒడ్యాట్‌, సుంకెట్‌ గ్రామాల్లో సోమవారం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ఆయా గ్రామాల్లో అభివృద్ది పనులు ప్రారంభిస్తారని తెరాస మండల అధ్యక్షుడు కల్లడ ఏలియా తెలిపారు. పాలెంలో 44 లక్షలతో, సుంకెట్‌లో 33 లక్షలతో, ఒడ్యాట్‌లో 16 లక్షల నిధులతో నిర్మించనున్న సిసి రోడ్ల పనులను ఎమ్మెల్యే ప్రారంభిస్తారని తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే కార్యక్రమాన్ని కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు.

Read More »