Breaking News

ఆటో ఢీకొని నలుగురికి తీవ్ర గాయాలు

 

బీర్కూర్‌, మార్చి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తప్పతాగిన మైకంలో ఆటో నడుపుతూ ఎదురుగా వస్తున్న వాహనాలను, వ్యక్తులను ఢీకొంటూ గాయపరిచిన ఆటోడ్రైవర్‌ ఉదంతం మండలంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం హైదరాబాద్‌కు చెందిన ఆటో టిఎస్‌ 34 టి/ఆర్‌ 0597 బీర్కూర్‌ మండలంలోని బరంగెడ్గి గ్రామానికి బంధువులఇంటికి వచ్చారు. మద్యంసేవించి ఉన్న డ్రైవర్‌ తిరుగుప్రయాణంలో అలాగే డ్రైవింగ్‌ చేయడంతో అన్నారం గ్రామం వద్ద బాన్సువాడ గ్రామానికి చెందిన మామిడి విఠల్‌, గీత దంపతులకు ఢీకొని బాన్సువాడ వైపు వెళుతుండగా అక్కడ పట్టుకుందామని కొందరు ప్రయత్నించగా, తిరిగి బరంగెడ్గి వైపు వస్తుండగా కిష్టాపూర్‌లో భరత్‌ అనే వ్యక్తి ఆపే ప్రయత్నం చేయగా అతన్ని ఢీకొన్నాడు. బీర్కూర్‌లో హైదర్‌ అనే వ్యక్తిని సైతం ఢీకొన్నాడు. క్షతగాత్రులను బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article