Breaking News

కిష్టాపూర్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ విదుల నుంచి తొలగింపు

 

బీర్కూర్‌, మార్చి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపి బిబి పాటిల్‌తో కలిసి వడగండ్ల వాన వల్ల పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులకు ఉపాధి పనులు కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఎవరు, ఎక్కడ అని ప్రశ్నించడంతో అక్కడ పీల్డ్‌ అసిస్టెంట్‌ లేకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పీల్డ్‌ అసిస్టెంట్‌ మారుతిని విధుల నుంచి తొలగించాలని ఆర్డీవోను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. విషయం తెలుసుకున్న పీల్డ్‌ అసిస్టెంట్‌ మారుతి హుటాహుటిన మంత్రి పర్యటిస్తున్న స్థలానికి చేరుకున్నారు. అక్కడి చించొల్లి, కిష్టాపూర్‌ గ్రామస్తులు సైతం ఫీల్డ్‌ అసిస్టెంట్‌పై ఫిర్యాదు చేయడం గమనార్హం.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article