Breaking News

తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఎమ్మెల్యే కృషి

 

మోర్తాడ్‌, మార్చి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అన్ని గ్రామాలకు మిషన్‌ భగీరథ పథకం కింద స్వచ్చమైన తాగునీరు అందించేందుకు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని ఎంపిపి కల్లడ చిన్నయ్య, సర్పంచ్‌లు సత్తమ్మ, హనుమాగౌడ్‌, ఉగ్గెర భూమేశ్వర్‌, జిల్లా తెరాస ఉపాధ్యక్షుడు రాజాపూర్ణానందం, మండల తెరాస అధ్యక్షుడు కల్లడ ఏలియాలు అన్నారు. ఆదివారం మండలంలోని దొన్కల్‌, తిమ్మాపూర్‌ గ్రామాల్లో మిషన్‌ భగీరథ పథకం కింద 90 వేల లీటర్ల మంచినీటి పథకానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్కో మంచి నీటి పథకానికి 22 లక్షల 39 వేల చొప్పున నిదులు ఎమ్మెల్యే మంజూరు చేయించారని తెలిపారు. నాణ్యతతో పనులు చేపట్టాలని వారు అన్నారు. నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌లు గడ్డం గంగారెడ్డి, పడాల హనుమాగౌడ్‌, ఎంపిటిసిలు లత, రాజేశ్వర్‌, రామన్నపేట్‌ సర్పంచ్‌ ఈర్ల లక్ష్మి, శ్రీనివాస్‌, మల్లయ్య, అజారుద్దీన్‌, మాజీ సర్పంచ్‌ మామిడి చిన్నారెడ్డి, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article