Breaking News

పోలీసుల పల్లెనిద్ర

 

బీర్కూర్‌, మార్చి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని బైరాపూర్‌ గ్రామంలో బాన్సువాడ రూరల్‌ సిఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రజలు మూఢనమ్మకాలు విశ్వసించవద్దని, బాణామతి, చేతబడి పేరుతో ఇతరులనుహింసించడం తగదని సూచించారు. గ్రామంలో బెల్టుషాపులు, క్రికెట్‌ బెట్టింగ్‌లపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని, వీటిని నిరోధించేవిధంగా గ్రామస్తులు సహకరించాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా మండలంలోని ఆయా గ్రామాల్లో పల్లె నిద్ర ద్వారా ప్రజలను చైతన్యం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రాజ్‌భరత్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article