Breaking News

ప్రజావాణిలో 78 ఫిర్యాదులు

 

కామారెడ్డి, మార్చి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టరేట్‌ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించి 78 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, జేసి సత్తయ్య, అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను ఆయా శాఖాధికారులకు పంపినట్టు చెప్పారు. ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సమస్యలు పరిష్కారమయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Check Also

రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆసుపత్రి సిబ్బంది, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *