Breaking News

అభివృద్ది పనులు అడ్డుకుంటున్నారని ఫిర్యాదు

 

బీర్కూర్‌, మార్చి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని ఎంపిటిసి -2 పరిధిలో అభివృద్ది పనులను గతంలో ఎంపిటిసి ఎన్నికల్లో ఓడిపోయిన అధికార పార్టీ అభ్యర్థి అడ్డుకుంటున్నారని ఎంపిటిసి -2 సుధాకర్‌ యాదవ్‌ ప్రజావాణిలో సోమవారం తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో 8వ వార్డు నుంచి 14వ వార్డు వరకు తమ పరిధిలోకి వస్తాయని, ఇప్పటివరకు ఆయా వార్డుల్లో ఒక్క సిమెంటు పనికాని, డ్రైనేజీ పనులు కానీ చేపట్టలేదని, లబ్దిదారులు జూన్‌లో వ్యక్తిగత మరుగుదొడ్ల కొరకు డిడిలు కడితే ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎంపిటిసి నిదులు తనకు అందలేదని అధికార పార్టీ నాయకుడి ప్రభావం వల్ల పనులు కావడం లేదని పేర్కొన్నారు. ఏప్రిల్‌ వరకల్లా నిధులు మంజూరు కాకపోతే మండల అభివృద్ది కార్యాలయం వద్ద దీక్ష చేపడతానని స్పష్టం చేశారు.

Check Also

దేశ ప్రజల‌ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు

బీర్కూర్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివంగత మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్‌ గాంధీ 76వ ...

Comment on the article