Breaking News

ఆర్యవైశ్యులను ప్రభుత్వం ఆదుకోవాలి

 

నిజాంసాగర్‌, మార్చి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆర్యవైశ్య ప్రజాప్రతినిదులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఆర్యవైశ్యుల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా రామ్మోహన్‌, ఉపాధ్యక్షునిగా లక్ష్మినారాయణ, రవిందర్‌, ప్రధాన కార్యదర్శిగా భానుప్రసాద్‌, సహయ కార్యదర్శులు ప్రభాకర్‌, శ్రీనివాస్‌, కోశాదికారిగా శేఖర్‌లను ఎన్నుకున్నట్టు సంఘం ప్రజాప్రతినిదులు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం తరపున పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి వినయ్‌కుమార్‌, మండల అధ్యక్షుడు గైని విఠల్‌, సిడిసి ఛైర్మన్‌ దుర్గారెడ్డి, తదితరులు ఉన్నారు.

Check Also

పరీక్ష కేంద్రం తనిఖీ

భీమ్‌గల్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని డిగ్రీ కళాశాలల్లో ...

Comment on the article