Breaking News

ఘనంగా ఆర్థికశాఖమంత్రి జన్మదినోత్సవ వేడుకలు

 

మోర్తాడ్‌, మార్చి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దొన్కల్‌ గ్రామ ముదిరాజ్‌ సంఘం ఆద్వర్యంలో సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఈటెల రాజేందర్‌ జన్మదినోత్సవ వేడుకలు మండల ముదిరాజ్‌ సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్‌ కట్‌ చేసి, మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరిపారు. అనంతరం మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మండల ప్రదాన కార్యదర్శి చిన్నమల్లయ్య, మాజీ ఉపసర్పంచ్‌ కిషన్‌లు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ముదిరాజ్‌ల సంక్షేమం కోసం బిసి-ఎలో చేర్చి అన్ని రంగాల్లో అభివృద్ది కోసం కృషి చేస్తున్నారని అన్నారు. ముదిరాజ్‌ల అభివృద్దికి మంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ సభ్యులు సాయన్న, చిన్న వెంకన్న, గడ్డం ప్రవీణ్‌, శ్రీకాంత్‌, వెంకన్న, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఉపాధి హామీ పనులు పరిశీలించిన ఎంపీడీవో

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలోని ముసల‌మ్మ చెరువులో బుధవారం ఉపాధిహామీ ...

Comment on the article