Breaking News

Daily Archives: March 21, 2017

తాండాల్లో ఎక్సైజ్‌ దాడులు

  గాంధారి, మార్చి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం పేతుసంగం గ్రామ పంచాయతీ పరిధిలోని గుడివెనక తాండాలో మంగళవారం ఎక్సైజ్‌ శాఖాధికారులు దాడులు చేపట్టారు. ఈసందర్భంగా తాండాలో నాటుసారా తయారుచేస్తున్న నోనావత్‌ అంబిని అరెస్టు చేసినట్టు ఎల్లారెడ్డి ఎక్సైజ్‌ సిఐఎ.ఎల్‌.ఎన్‌.స్వామి తెలిపారు. ఈ సంగటనలో 5 లీటర్ల నాటుసారా స్వాధీనంచేసుకోవడమే గాకుండా పది లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్టు తెలిపారు. దాడుల్లో ఎక్సైజ్‌ఎస్‌ఐలు సుజనా కుమారి, బానోత్‌ పటేల్‌, సిబ్బంది ఉన్నారు.

Read More »

వ్యక్తిగత మరుగుదొడ్లపై అవగాహన

  గాంధారి, మార్చి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పలు గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంగళవారం మండలంలోని మాతు సంగం, నర్సాపూర్‌ గ్రామాల్లో పర్యటించిన అధికారులు మరుగుదొడ్ల నిర్మాణం, వాటి ఆవశ్యకతపై ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరు ఇంటింటికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. దీనికి గాను ప్రభుత్వమే డబ్బు చెల్లిస్తుందని వారు తెలిపారు. కార్యక్రమంలో ఎండివో సాయాగౌడ్‌, ఏపివో నరేందర్‌, సింగిల్‌ విండో ఛైర్మన్‌ ముకుంద్‌రావు, గ్రామస్తులు ఉన్నారు.

Read More »

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌

  గాంధారి, మార్చి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని కామారెడ్డిజిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎ.బి.సెంటర్లను తనికీలు చేపట్టారు. పరీక్షలు నిర్వహించే ప్రతి గదిలోకి వెళ్లి నిర్వహణ విధానాన్ని పరిశీలించారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఆయన వెంట డిటిడివో గంగాధర్‌, తహసీల్దార్‌ లక్ష్మణ్‌, సిబ్బంది ఉన్నారు.

Read More »

బస్సులో తరలిస్తున్న గంజాయి స్వాధీనం?

  గాంధారి, మార్చి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం తిమ్మాపూర్‌ గ్రామ శివారువద్ద బస్సులో తరలిస్తున్న గంజాయిని గాంధారి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మంగళవారం సాయంత్రం ఆర్టీసి బస్సులో ఓ వ్యక్తి గంజాయిని తరలిస్తున్నాడన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సంఘటనలో బస్సులో తరలిస్తున్న గంజాయితోపాటు నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.

Read More »

ఆస్తుల పరిరక్షణకు ఆమరణ దీక్ష ప్రారంభం

  – విద్యార్థి ఆందోళనకు అన్నివర్గాల మద్దతు కామారెడ్డి, మార్చి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రబుత్వ డిగ్రీ కళాశాల ఆస్తులను కళాశాల పెరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని, ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని విద్యార్థి జేఏసి ఆద్వర్యంలో మంగళవారం నుంచిఆమరణ దీక్షకు శ్రీకారం చుట్టారు. కళాశాల వద్ద విద్యార్తి సంఘాల ప్రతినిధులు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. దీనికి ఆయా ప్రజాసంఘాలు, పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి. శాసన మండలి విపక్షనేత షబ్బీర్‌ అలీతోపాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు, పార్టీల ...

Read More »

విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన

  కామారెడ్డి, మార్చి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగులపై కాంట్రాక్టర్‌ దాడి చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం తెలంగాణ విద్యుత్‌ కాంట్రాక్టు ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆద్వర్యంలో ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్‌ శాఖ డిఇకి ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి ఎస్‌ఎస్‌-1 సబ్‌స్టేషన్‌లో సంతోష్‌రెడ్డి అనే కార్మికుడు పనిచేస్తుండగా కాంట్రాక్టర్‌ భూపాల్‌రెడ్డి అక్కడికి వచ్చి అకారణంగా సంతోష్‌రెడ్డిపై దాడిచేసి దూషించాడని పేర్కొన్నారు. సంబంధిత కాంట్రాక్టర్‌పై విచారణ జరిపి ...

Read More »

మతపర రిజర్వేషన్‌లపై బిజెవైఎం ఆధ్వర్యంలో ఆందోళన

  – నాయకుల అరెస్టు కామారెడ్డి, మార్చి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 12 శాతం మతపరమైన రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌ను వ్యతిరేకిస్తు మంగళవారం కామారెడ్డిలో బిజెవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. బిజెవైఎం ఆద్వర్యంలో పార్టీ శ్రేణులు పట్టణంలోభారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. దాంతో వారిని అరెస్టు చేసి పోలీసు స్టేసన్‌కు తరలించారు. అనంతరం వారినిసొంత ...

Read More »

కొనసాగుతున్న తెరాస సభ్యత్వ నమోదు

  కామారెడ్డి, మార్చి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. ఆయా వార్డుల కౌన్సిలర్లు పార్టీ శ్రేణులు పట్టణంలోని 33 వార్డుల్లో కలియ తిరుగుతూ పార్టీ సభ్యత్వం చేయిస్తున్నారు. మంగళవారం పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్‌తోపాటు కౌన్సిలర్లు ముప్పారపు ఆనంద్‌, దినేష్‌ యాదవ్‌, అంజద్‌, కుంబాల రవి, కాళ్ల గణేష్‌, ఇతర నాయకులు సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. సాద్యమైనన్ని క్రియాశీలక సభ్యులను పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రతి కార్యకర్తకు ...

Read More »

రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తప్పకుండా పాటించాలి

  కామారెడ్డి, మార్చి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ నియామకాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ నియామకాల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో నిర్వహించిన రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ జిల్లా స్థాయి కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. నియామకాల్లో ఎస్సీ, ఎస్టీలకు సంబందించి ఎలాంటి అవకతవకలు జరగకుండా ఖచ్చితంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నూతన జిల్లా ఏర్పడిన నేపథ్యంలో రూల్‌ ఆఫ్‌రిజర్వేసన్‌పై ...

Read More »

ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై అవగాహన

  నిజాంసాగర్‌, మార్చి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు, ఆసుపత్రికి వచ్చే రోగులకు చికిత్స అందించే విదానం, ప్రసవాలు పెరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య ఉపకేంద్రాల పనితీరు, మందులు అందుబాటులో ఉంచే పద్దతి తదితర అంశాలపై డిప్యూటి డిఎం అండ్‌ హెచ్‌వో జ్యోతి, శోభ అవగాహన కల్పించారు. పిట్లం మండలానికి చెందిన ఏఎన్‌ఎంలు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా వైద్యులు చర్యలు తీసుకోవాలన్నారు. రోగులు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ...

Read More »

దెబ్బతిన్న పంటల పరిశీలన

  నిజాంసాగర్‌, మార్చి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 16న వడగండ్ల వాన బీబత్సం వల్ల దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖాధికారులు మంగళవారం పరిశీలించారు. మండలంలోని హసన్‌పల్లి, నార్వ గ్రామాల్లో భారీవర్షానికి దెబ్బతిన్న పంటలను రెవెన్యూ అధికారి పండరి, ఎఇవో రవిందర్‌లు పరిశీలించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో పర్యటిస్తు పంట దెబ్బతిన్న రైతులకు పరిహారం ప్రభుత్వం అందిస్తుందని, పంట దెబ్బతిన్న వివరాలు ఉన్నతాదికారులకు నివేదించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆగమయ్య, గుండయ్య, తదితరులున్నారు.

Read More »

మహిళా సంఘాల అభివృద్దికి రుణాలు

  నిజాంసాగర్‌, మార్చి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులందరు అభివృద్ది చెందేందుకు ప్రభుత్వం స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేస్తుందని ఎపిఎం రాంనారాయణగౌడ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీనిధి కింద కోటి రూపాయల రుణాలు మహిళా సమాఖ్య సంఘాల సభ్యులకు అందించేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. మార్చి నెలాఖరులోగా అర్హులైన సంఘాల సభ్యులకు రుణాలు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. సంఘాల సభ్యులకు సంబందించిన వివరాలు అందజేసి రుణాలు పొందవచ్చని ...

Read More »

మండలానికి చేరిన పాఠ్యపుస్తకాలు

  నిజాంసాగర్‌, మార్చి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని స్థానిక ఎంఆర్‌సి భవనానికి విద్యార్తులకు పంపినీ చేసేందుకు పాఠ్య పుస్తకాలు పంపిణీకి సిద్దంగా ఉన్నాయని ఎంఇవో బలిరాం రాథోడ్‌ అన్నారు. మండలంలోని 1 నుంచి 10వ తరగతి వరకు 26 వేల 400 పాఠ్యపుస్తకాలు అవసరమున్నాయని, ఉన్నతాధికారులకు నివేదికలు పంపించినట్టు ఎంఇవో తెలిపారు. మొదటి విడతగా 15,800 పాఠ్య పుస్తకాలు ఎంఆర్‌సి భవనానికి చేరుకున్నాయని తెలిపారు. పుస్తకాలు త్వరలోనే విద్యార్తులకు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు.

Read More »

ఇంటి పన్ను వసూలు

  నిజాంసాగర్‌, మార్చి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మక్దుమ్‌పూర్‌ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి క్యాసప్ప స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ ప్రజలందరు ఇంటి పన్ను వసూలుకు సహకరించాలని ఆయనకోరారు. గ్రామంలో ఇంటింటా తిరుగుతూ రూ. 10,800 వసూలు జరిగిందని అన్నారు.

Read More »

వికలాంగులకు ఫిజియోథెరఫి

  నిజాంసాగర్‌, మార్చి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఎంఇవో కార్యాలయంలో ఫిజియోథెరఫి శిబిరాన్ని వైద్యురాలు ప్రణీత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికలాంగ విద్యార్థులకు ఫిజియో థెరఫి ద్వారా వ్యాయామం ఎంతో అవసరమని, ప్రతిరోజు ఉదయం గంట సమయం కేటాయించి యోగా, వ్యాయామం తప్పకుండా చేయాలని సూచించారు. తద్వారా మానసిక ఉల్లాసం, అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఇవో బలిరాం రాథోడ్‌, సునీల్‌, సాయిలు ఉన్నారు.

Read More »

తెరాస పార్టీ సభ్యత్వానికి అపూర్వ స్పందన

  బీర్కూర్‌, మార్చి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో చేపడుతున్న తెరాస పార్టీ సబ్యత్వ నమోదు కార్యక్రమంలో అపూర్వ స్పందన లభిస్తుందని బీర్కూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పెరిక శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం బీర్కూర్‌ మండలంలోని మల్లాపూర్‌, బైరాపూర్‌, బరంగెడ్గి గ్రామాల్లో తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పెరిక శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం కల్పించిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చొచ్చుకుపోయాయని, ఇటీవల ప్రకటించిన వార్షిక బడ్జెట్‌ అన్ని సంక్షేమ ...

Read More »

కొనసాగుతున్న పంట నష్టం సర్వే

  బీర్కూర్‌, మార్చి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత గురువారం బీర్కూర్‌ మండలంలో వడగండ్ల వానవల్ల పంట నష్టం జరిగిన బాధితుల పంట విస్తీర్ణాన్ని మంగళవారం తహసీల్దార్‌ కృష్ణానాయక్‌, వ్యవసాయాధికారి కమల ఆద్వర్యంలో కిష్టాపూర్‌,చించొల్లి గ్రామాల్లో చేపట్టారు. వడగండ్ల వాన వల్ల పంట పండించే రైతులు కిష్టాపూర్‌, చించొల్లి, అన్నారం, బీర్కూర్‌, దామరంచ గ్రామాల్లో పూర్తిగా నష్టపోయారని, పంట విస్తీర్ణం ఎంత ఉందనే అంచనాలను రెవెన్యూ, వ్యవసాయ సిబ్బందితో తయారుచేయిస్తున్నామని అన్నారు. త్వరలోనే పంట నష్టం విస్తీర్ణాన్ని అధికారులకు నివేదిస్తామని ...

Read More »

మద్యంసేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు

  బీర్కూర్‌, మార్చి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని బీర్కూర్‌ ఎస్‌ఐ రాజ్‌భరత్‌అన్నారు. మండల కేంద్రంలో సోమవారంరాత్రి నసురుల్లాబాద్‌ మండలంలో మంగళవారం వాహనాలు తనిఖీ చేశారు. ఇందులో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. బీర్కూర్‌ గ్రామంలో రెండు, నసురుల్లాబాద్‌లో ఐదు కేసులు నమోదైనట్టు ఎస్‌ఐ వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాహన చోదకుడికి, ప్రయాణీకులకు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ...

Read More »

బీర్కూర్‌ తైబజార్‌ వేలం

  బీర్కూర్‌, మార్చి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ తైబజార్‌వేలం పాటను సర్పంచ్‌ దూలిగె నర్సయ్య, కార్యదర్శి యాదగిరి ఆద్వర్యంలో మంగళవారం నిర్వహించారు. వేలం పాటలో ఆరుగురు అబ్యర్థులు పాల్గొనగా బీర్కూర్‌ గ్రమానికి చెందిన దొమ్మటి సురేశ్‌ లక్ష 60 వేల రూపాయలకు దక్కించుకున్నారు. 2017 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 2018 మార్చి 31 వరకు బీర్కూర్‌ గ్రామంలో జరిగే అంగడి తదితర పంచాయతీ కార్యస్థలంలో నిర్వహించే దుకాణ సముదాయాల్లో పన్ను వసూలు చేసుకోవాల్సిందిగా సూచించారు. ...

Read More »

సుంకెట్‌లో దొంగల భీభత్సం

  – నాలుగు తులాల బంగారం, 25 వేల నగదు చోరీ మోర్తాడ్‌, మార్చి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సుంకెట్‌ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి దొంగల బీభత్సం జరిగింది. గ్రామానికి చెందిన తీగల లింగారెడ్డి ఇంట్లో దొంగలు చొరబడి బీరువా పగులగొట్టి నాలుగు తులాల బంగారం చోరీకి గురైనట్టు స్తానికులు తెలిపారు. అంతేగాకుండా ఓనెపల్లి కిరాణ దుకాణంలో దొంగలు 20 వేల నగదు, నూనె డబ్బా దొంగిలించినట్టు స్థానికులు తెలిపారు. మరో రెండు ఇళ్లల్లో దొంగతనానికి ప్రయత్నించినప్పటికి ప్రజలుతేరుకోవడంతో ...

Read More »