Breaking News

Daily Archives: March 22, 2017

అంగరంగవైభవంగా హనుమాన్‌ మండల పూజ

  గాంధారి, మార్చి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ముదెల్లి గ్రామంలో బుధవారం హనుమాన్‌ మహా మండల పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో స్థానిక సర్పంచ్‌ పద్మా మోహన్‌ యాదవ్‌ హనుమాన్‌ యజ్ఞాన్ని నిర్వహించారు.ఉదయం నుంచే గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. యజ్ఞ మండపం ఆవరణను ప్రత్యేక పూలతో అలంకరించారు. ఉదయం హనుమాన్‌ యజ్ఞం నిర్వహించిన అనంతరం ఆంజనేయ స్వామికి ప్రత్యేకపూజలు చేపట్టారు. స్థానిక హనుమాన్‌ ఆలయంలో స్వామివారి విగ్రహానికి చంద్రం పూసి పూజలు చేపట్టారు. మహా ...

Read More »

శ్రీరామ్‌నగర్‌ కాలనీ కమిటీ ఎంపిక

  గాంధారి, మార్చి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలోని శ్రీరామ్‌నగర్‌ కాలనీ కమిటీనిబుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాలనీ కమిటీ గౌరవాధ్యక్షులుగా తూరుపు రాజులు, అధ్యక్షుడుగా రామారావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లుగా మదార్‌, గాండ్ల లక్ష్మణ్‌, కార్యదర్శిగా ఎంపిటిసి మోతిలాల్‌, కోశాధికారిగా శ్రీనివాస్‌గౌడ్‌, సలహాదారులుగా తూరుపు శేఖర్‌, కటికె విజయ్‌, తాడ్వాయి శివయ్య, లక్ష్మినారాయణ, మమ్మాయి నారాయణ, సంఘని రాములు, మోచె రవి, దోండురావ్‌లను కాలనీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Read More »

గాంధారి పద్మశాలి సంఘం ఎంపిక

  గాంధారి, మార్చి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి గ్రామ పద్మశాలి సంఘం కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షునిగా బండి రాజులు, ఉపాధ్యక్షులుగా కొమ్ముల రమేశ్‌, కార్యదర్శిగా తాటిపాముల సత్యం, సహాయ కార్యదర్శిగా సామల ప్రభు, కోశాధికారిగా క్యాథం ఆనంద్‌, సలహాదారులుగా చిట్టాల శ్రీహరి, కొమ్ముల సత్యం, కోరండ్ల నాగభూషనంలను పద్మశాలి సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Read More »

కొనసాగుతున్న హరినామ సప్తాహ

  నిజాంసాగర్‌, మార్చి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బూర్గుల్‌ గ్రామంలో ఆలయం వద్ద హరినామ సప్తాహ నిర్వహిస్తున్నారు. 135 సంవత్సరాల నుంచి విఠలేశ్వర ఆలయంలో సప్తాహ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతిరోజు మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో పండరినాథ్‌ కీర్తనలు, రాత్రిపూట విఠలేశ్వరస్వామి చర్తిత్ర, హనుమాన్‌ సంకీర్తనలు, భజనలు చేపడుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

Read More »

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన

  నిజాంసాగర్‌, మార్చి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైనవిద్యాబోధన సాగుతుందని ఒడ్డేపల్లి సర్పంచ్‌ రేఖ అన్నారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో బుధవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై సర్పంచ్‌ మాట్లాడారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. గ్రామానికి చెందిన పండరిని పాఠశాల ఉపాధ్యాయుల బృందాన్ని సన్మానించారు. ఉపాధ్యాయుల పాత్ర గొప్పదని అన్నారు. కార్యక్రమంలో ఎంఇవో బలిరాం రాథోడ్‌, ఉపాధ్యాయులు విఠల్‌, లక్ష్మణ్‌, సాయిలు, సునీల్‌, తదితరులున్నారు.

Read More »

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల పరిశీలన

  నిజాంసాగర్‌, మార్చి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నర్వా గ్రామంలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేసినందుకు అధికారులు బృందంగా ఏర్పడి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో నిర్మించిన మరుగుదొడ్లను ఎంపిడివో రాములు నాయక్‌ పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబం మరుగుదొడ్లు తప్పకుండా నిర్మించుకోవాలన్నారు. బహిరంగ మలవిసర్జన చేయడంతో ప్రజలు రోగాలబారిన పడి ఆసుపత్రుల పాలవుతారని స్పష్టం చేశారు. మరుగుదొడ్లు వాడకం వల్ల ఆరోగ్యంగాఉంటారని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అనసూయ, ఎపిఎం రాంనారాయణగౌడ్‌, తదితరులున్నారు.

Read More »

ఘనంగా నీటి దినోత్సవం

  బీర్కూర్‌, మార్చి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని అంకాస్‌ చెరువు వద్ద నీటిపారుదల శాఖాధికారుల ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా నీరు పొదుపుగా వాడుకోవాలని ప్రమాణం చేయించారు. భవిష్యత్తు తరానికి నీటిని అందించేవిధంగా ప్రస్తుతమానవాలి పొదుపుగా వాడుకోవాలని జడ్పిటిసి కిషన్‌ నాయక్‌తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

టిప్పర్‌ ఢీ – గొర్రెలు మృతి

  బీర్కూర్‌, మార్చి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌లో టిప్పర్‌ వాహనం గొర్రెల మందను ఢీకొనడంతో నాలుగు గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయని స్థానికులు తెలిపారు. కాగా మరో నాలుగు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయని తెలిపారు. టిప్పర్‌ డ్రైవర్‌ అతివేగంగా వాహనం నడపడం వల్లే గొర్రెల మంద అడ్డుగా వచ్చినపుడు వాహనం అదుపుచేయకపోవడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ రాజ్‌భరత్‌ తెలిపారు.

Read More »

మిషన్‌ భగీరథ సర్వే

  నిజాంసాగర్‌, మార్చి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని మంజీర పెద్దపూల్‌ వంతెన వద్ద మిషన్‌ భగీరథ ఏ.ఇ. రాజశేఖర్‌ నీటిపారుదల శాఖ ఎ.ఇ. శివకుమార్‌ పైప్‌లైన్‌లకు సంబందించిన సర్వే నిర్వహించారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తిన సమయంలో ఏస్థాయిలో నీరు వంతెనకు ఆనుకొని వెళుతుందని పరిశీలించారు. దిగువకు వెళ్లే నీటి మట్టాన్ని బట్టి మిసన్‌ భగీరథ పైప్‌లైన్‌లను వేయడం జరుగుతుందని ఎ.ఇ. తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆరేడు గ్రామం నుంచి 75 కి.మీ. ...

Read More »

పుస్తకాల పంపిణీ

  నిజాంసాగర్‌, మార్చి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలో నూతన విద్యాసంవత్సరం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిజాంసాగర్‌ మండలంలో విద్యాశాఖ కార్యాలయంలో ఆయా పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు పంపిణీ కార్యక్రమాన్ని ఎంఇవో బలిరాం రాథోడ్‌ ప్రారంభించారు. మండలంలో 46 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 28 వేల పాఠ్యపుస్తకాలు రావాల్సిఉంది, మొదటి విడతలో 18 వేల పుస్తకాలు వచ్చాయన్నారు. వాటిని ఆయా పాఠశాలలకు అందజేస్తున్నట్టు తెలిపారు. రెండోవిడత పుస్తకాలు రెండ్రోజుల్లో వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, పిఆర్‌టియు అధ్యక్షుడు బాస్కర్‌గౌడ్‌, ...

Read More »

ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు

  నిజాంసాగర్‌, మార్చి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలు స్పందన గర్భిణీ, బాలింతలకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. వారితోపాటు మండలంలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థినిలకు వైద్య పరీక్షలు చేసి అవసరమగు మందులు అందజేయడం జరిగిందన్నారు. గర్భిణీలు నెలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Read More »

మద్యం సేవించివాహనాలు నడిపినవారికి జరిమానా

  బీర్కూర్‌, మార్చి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం రాత్రి బీర్కూర్‌ గ్రామంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురు వ్యక్తులపై ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి కేసు నమోదు చేశారు. వారిని బుధవారం బాన్సువాడ మున్సిఫ్‌ కోర్టుకు తరలించారు. అక్కడ న్యాయమూర్తి ఒక్కొక్కరికి 2200 రూపాయల జరిమానా విధించినట్టు తెలిపారు. మద్యంసేవించి వాహనాలు నడపవద్దని, మండలంలో ప్రధాన కూడళ్లలో ప్రతినిత్యం వాహనదారులను తనిఖీలు చేస్తామని ఆయన అన్నారు. మద్యంసేవించి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read More »

గండివేటుకు చేరిన భాస్కర్‌ మృతదేహం

  గాంధారి, మార్చి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సౌదీ అరేబియాలో గుండెపోటుతో మృతి చెందిన యువకుని మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరుకుంది. మృతదేహన్ని చూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఒక్కసారిగా గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. గాందారి మండలం గండివేట్‌ గ్రామానికి చెందిన బాస్కర్‌ అనే యువకుడు గతనెల 20న సౌదీ అరేబియాలో గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయాన్ని అతని స్నేహితులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. చివరి చూపు కొరకు కన్న కొడుకు మృతదేహాన్ని స్వగ్రామానికి ...

Read More »

నీటి ప్రతిజ్ఞలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

  గాంధారి, మార్చి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా గాంధారి మండలం ముదెల్లి చెరువు వద్ద నీటి ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పెద్ద చెరువు వద్ద మండల ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెరువులో నీటికి, చెరువు కట్టపై కొబ్బరి కాయలు కొట్టారు. అనంతరం చెరువు కట్ట వద్ద నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ జల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. నీటిని సంరక్షిస్తామని పొదుపుగా వినియోగిస్తామని ఒక్కనీటి ...

Read More »

తెరాస సభ్యత్వ నమోదు

  కామారెడ్డి, మార్చి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. తెరాస శ్రేణులు పట్టణంలోని వివిధ వార్డుల్లో కలియ తిరుగుతూ ప్రజలకు పార్టీ సభ్యత్వ నమోదు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధ్యమైనంత మేరకు క్రియాశీలక కార్యకర్తలను పార్టీలో చేర్చుకునేందుకు తమ వంతు కృషిచేస్తున్నామన్నారు. తద్వారా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. పార్టీ సబ్యత్వం తీసుకున్నవారికి పార్టీ పక్షాన రెండు లక్షల ప్రమాదబీమా సౌకర్యం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ...

Read More »

24న సదరం క్యాంపు

  కామారెడ్డి, మార్చి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఈనెల 24న సదరం క్యాంపు నిర్వహించనున్నట్టు జిల్లా గ్రామీణాభివృద్ది శాఖాధికారి తెలిపారు. మానసిక, బుద్దిమాంద్యం, వికలత్వం ఉన్నవారికి సదరం క్యాంపులో వైద్యపరీక్షలు నిర్వహించి వైద్యులచేత దృవీకరణ పత్రాలు అందజేస్తామన్నారు. ఎంపిడివో కార్యాలయంలో సదరం క్యాంపునకు సంబంధించి టోకెన్లు తీసుకొని ప్రబుత్వ ఆసుపత్రిలో క్యాంపునకు హాజరుకావాలని కోరారు.

Read More »

రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

  కామారెడ్డి, మార్చి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థి సంఘాల ఆమరణ దీక్షకు మద్దతుగా బుధవారం కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్‌ చౌరస్తాలో విద్యార్థి సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వదిష్టిబొమ్మనుదగ్దం చేశారు. కళాశాల ఆస్తుల రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో ప్రబుత్వ తీరును నిరసిస్తూ దిష్టిబొమ్మ దగ్దం చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కళాశాల ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని రెండేళ్లక్రితం హామీ ఇచ్చినా అవి హామీగానే మిగిలిపోయాయని విమర్శించారు. ఇప్పటికైనా రిజిస్ట్రేషన్‌ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని ...

Read More »

ప్రతి బొట్టు ఒడిసి పట్టు

  కామారెడ్డి, మార్చి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి నీటిని బొట్టును ఒడిసి పట్టి భూగర్భజలాలు సంరక్షించుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ పిలుపునిచ్చారు. ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో జలజాతర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటిని విచ్చలవిడిగా వాడుతుండడంతో భూగర్భజలాలు అంతరించిపోతున్నాయని, ఇలాగే కొనసాగితే మున్ముందు నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. నీటిని సంరక్షించుకొని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. సాగు, తాగునీరు అవసరాలకు అవసరమైనంత ...

Read More »

విద్యార్థి జేఏసి ఆమరణ దీక్ష విరమణ

  కామారెడ్డి, మార్చి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములను కళాశాల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తు విద్యార్థి జేఏసి ఆద్వర్యంలో చేపట్టిన ఆమరణ దీక్షను బుధవారం విరమించారు. కళాశాలకు చెందిన 148.09 ఎకరాలను కళాశాల పేరిట రిజిస్ట్రేషన్‌ చేస్తామని జిల్లా కలెక్టర్‌ హామీ ఇవ్వడంతో ఆమరణ దీక్ష విరమించనున్నట్టు జేఏసి ప్రతినిధులుతెలిపారు. విద్యార్థుల ఆమరణ దీక్ష నేపథ్యంలో బుధవారం ప్రజాసంఘాలు, జేఏసి నాయకులు కలెక్టర్‌తో మాట్లాడారు. కలెక్టర్‌ ఈ విషయమై ప్రభుత్వ అధికారులతో ...

Read More »

ప్రతి నీటి చుక్క పొదుపుగా వాడుకోవాలి

  మోర్తాడ్‌, మార్చి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి నీటి చుక్కను పొదుపుగా వాడుకోవాలని జడ్పిటిసి ఎనుగందుల అనిత, సర్పంచ్‌లు దడివె నవీన్‌, శ్రీవైష్ణవి, వైస్‌ ఎంపిపి పాపాయి పవన్‌లు అన్నారు. బుధవారం మోర్తాడ్‌, ఏర్గట్ల మండల కేంద్రంలోని ముసలమ్మ చెరువు, చిన్నచెరువు గట్లపై సిఎం కెసిఆర్‌ పిలుపుమేరకు నీటిపొదుపు వాడకంపై ప్రతిజ్ఞ చేశారు. బుధవారం ప్రపంచ నీటి దినోత్సవం పురస్కరించుకొని మోర్తాడ్‌, ఏర్గట్ల చెరువు గట్లపై విద్యార్థులు, ప్రజాప్రతినిదులు, నాయకులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...

Read More »