Breaking News

అమ్మ పుట్టినరోజునే ఆమెను హత్యచేశాడు. కారణం..

ఫ్లోరిడా: ప్రాణం పోసిన అమ్మ పుట్టిన రోజు వచ్చిందంటే ఆమె కడుపున జన్మించిన వారికి చెప్పలేని సంతోషం ఉంటుంది. అమ్మకు ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని అత్రుతగా ఎదురుచూస్తారు. కానీ.. అమెరికాలోని ఫ్లోరిడా నగరానికి చెందిన ఓ యువకుడు విరుద్ధంగా ప్రవర్తించాడు. జన్మనిచ్చిన తల్లిని ఆమె పుట్టిన రోజు నాడే కడతేర్చాడు. జోషూ లియోన్ కర్మోనా అనే 18 ఏళ్ల యువకుడు అమ్మను చంపేయాలని ఎప్పటి నుంచో ఎదురుచూశాడు. ఆమె పుట్టిన రోజు నాడే ఆమెను చంపాలని ముహూర్తంగా ఎంచుకున్నాడు. అనుకున్న రోజు రానే వచ్చింది. 39వ పుట్టిన రోజు ఆనందంలో ఉన్న టహిరి లువా ఎంజెలోకు తెలియదు పాపం అవే ఆమెకు చివరి ఘడియలని. బేస్‌బాల్ బ్యాటుతో మొహంపై స్ప‌ృహతప్పే వరకూ కొట్టాడు. అనంతరం కసాయి కత్తి తీసుకుని మెడపై విచక్షిణా రహితంగా పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అమ్మను హత్య చేసి ఏమాత్రం భయపడకుండా కారు తీసుకుని డే కేర్ సెంటర్‌లో ఉన్న 3 ఏళ్ల చెల్లి వద్దకు వెళ్లాడు. ఫ్రెండ్‌ని పార్కుకి రమ్మని ముందే చెప్పిన నిందితుడు చెల్లి తీసుకుని పార్క్‌కి వెళ్లాడు. జరిగిన విషయాన్ని ఫ్రెండ్‌తో చెప్పాడు. జీవితాంతం జైలులో ఉండబోతున్నానని, చెల్లిని ఫ్రెండ్ ద్వారా ఇంటికి పంపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కొన్ని గంటల తర్వాత నిందిత యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తండ్రి మరణించడంతో తల్లి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందిని, పెంపుడు తండ్రితో తల్లి  కలిసుండడం ఏమాత్రం ఇష్టంలేకపోవడంతోనే ఈ హత్య చేశానని నిందితుడు కర్మోనా ఒప్పుకున్నాడు. దీంతో జైలుకు తరలించారు. ఈ ఘటన గత సోమవారం జరిగింది.

Check Also

పూరి వర్గాన్నే టార్గెట్ చేశారా?

హైదరాబాద్: సినిమా ఇండ్రస్టీ అంటేనే ఓ మాయా జగత్తు. సింగిల్ నైట్లో స్టార్స్ అయిపోవచ్చు. సింగిల్ డేలో రోడ్డుపైకి వచ్చేయచ్చు. ఒక్క …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *