Breaking News

Daily Archives: March 24, 2017

జ్యోతిబాఫూలే గురుకుల విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తులు

  కామారెడ్డి, మార్చి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ బాలబాలికలకు ఇంగ్లీష్‌ మీడియం 6,7 తరగతులకు, జూనియర్‌ కళాశాలలు, మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు మహాత్మా జ్యోతిబాఫూలే వెనకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు ళీశీచీశిలీబీగీజీలిరిరీ.బీవీవీ.వీళిఖీ.రిదీ లో చూడవచ్చని పేర్కొన్నారు. 6వ, 7వ తరగతుల విద్యార్థులకు ఈనెల 28వ తేదీ, అదేవిధంగా జూనియర్‌, ...

Read More »

భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి

  కామారెడ్డి, మార్చి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టంలో పెన్షన్‌ ఇవ్వాలని ఉన్నప్పటికి, సంక్షేమ బోర్డులో సభ్యులుగా నమోదైన 60 సంవత్సరాలు దాటిన నిర్మాణ కార్మికులకు ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదని బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కన్వీనర్‌ బి.బాల్‌రాజ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయం ముందు ఏఐటియుసి అనుబంధ సంఘం టిఎస్‌ బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆద్వర్యంలో ధర్నా చేపట్టారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి ...

Read More »

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి

  – జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, మార్చి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో తెలంగాణ ఉపాధ్యాయ సంఘం తపస్‌ ఆధ్వర్యంలో బటిబాట పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే బాద్యత అందరిదన్నారు. ప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించే బాధ్యత ఉపాధ్యాయ సంఘాలపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తపస్‌ జిల్లా అధ్యక్షుడు రమేశ్‌, రాష్ట్ర కార్యదర్శులు రాఘవరెడ్డి, లక్ష్మణ్‌రావు, జిల్లా ...

Read More »

బడిబాట విజయవంతం చేయండి

  నిజాంసాగర్‌, మార్చి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం బడి ఈడు పిల్లలను బడి బయట ఉండకుండా చూసేందుకు ఏప్రిల్‌ 13వ తేదీ వరకు ప్రొ.జయశంకర్‌ బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఎంఇవో బలిరాం రాథోడ్‌ తెలిపారు. ఎంఇవో కార్యాలయంలో శుక్రవారం ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని 6-14 సంవత్సరాలలోపు బడిబయట పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు. నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైనందున ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను అందజేసి సిలబస్‌ ప్రారంభించాలని సూచించారు. ఒంటిపూట బడులకు ప్రార్థనా ...

Read More »

కొనసాగుతున్న నీటి విడుదల

  నిజాంసాగర్‌, మార్చి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌- కామారెడ్డి జిల్లాల పరిధిలోని సాగుచేసుకుంటున్న యాసంగి పంటల అవసరాల కోసం నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాలువకు నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు ప్రధాన కాలువకు 2 వేల క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మొదటి ఆయకట్టు ప్రాంతం నుంచి చివరి ఆయకట్టు వరకు సాగుచేసుకుంటున్న పంటలకు సాగర్‌ నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటి విడుదల చేయడంతో హెర్తులూస్‌ జలవిద్యుత్‌ ...

Read More »

కామారెడ్డి జిల్లా వెబ్‌ పోర్టల్‌ ప్రారంభం

  కామారెడ్డి, మార్చి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా వెబ్‌ పోర్టల్‌ను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ శుక్రవారం తనచాంబరులో ప్రారంభించారు. జిల్లాకు సంబంధించిన అన్ని వివరాలు పూర్తిగా అందించాలనే ఉద్దేశంతో పోర్టల్‌ ప్రారంభించినట్టు తెలిపారు. అదేవిధంగా ప్రజల నుంచి కూడా అవసరమున్న సమాచారాన్ని సమర్పించడానికి పోర్టల్‌లో వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలోని పదవి విరమణ పొందిన ప్రభుత్వ ఆరోగ్యశాఖ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి వారి శక్తికొలది ప్రభుత్వానికి స్వచ్చందంగా సేవలు అందించడానికి వివరాలను పోర్టల్‌లో పూర్తి ...

Read More »

బిజెపి నాయకుల అరెస్టు

  కామారెడ్డి, మార్చి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మతపరమైన రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగా బిజెపి, బిజెవైఎం ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి మద్దతుగా కామారెడ్డి బిజెపి శ్రేణులు హైదరాబాద్‌ బయల్దేరుతుండగా పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని నాయకులు అర్కుల ప్రభాకర్‌ పేర్కొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపేప్రసక్తేలేదని, మతపరమైన రిజర్వేషన్‌లతో 52 శాతం ఉన్న బిసిలకు అన్యాయం జరుగుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇటువంటి చర్యలకు పాల్పడితే బిసిలే బుద్దిచెబుతారని స్పష్టం చేశారు. అరెస్టయిన వారిలో ...

Read More »

ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణం

  గాంధారి, మార్చి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఎంతో అవసరమని, ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని గాంధారి సర్పంచ్‌ సత్యం గ్రామస్తుల్లో చైతన్యం నింపారు. శుక్రవారం గాంధారి గ్రామ పంచాయతీ పరిధిలోని మదన్‌పల్లి గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అంతేకాకుండా ఇంటింటికి తిరిగి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. ప్రజల్లో అపోహను తొలగించడానికి స్తానిక ఇంజనీర్‌ హైమద్‌తో కలిసి వారికి మరుగుదొడ్ల ఆవశ్యకత గురించి వివరించారు. వాస్తు ప్రకారం ఇంటివద్ద ఏ బాగంలో మరుగుదొడ్లు ...

Read More »

మిన్నంటిన హరినామ స్మరణ

  నిజాంసాగర్‌, మార్చి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మాగి గ్రామంలో హరినామ సంకీర్తనలు మారుమోగాయి. ఆంజనేయ ఆలయ ఉత్సవాలను పురస్కరించుకొని స్థానిక ధర్మశాల సత్రంలో వారంరోజులపాటు హరినామ సప్తాహ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముగింపు రోజు సందర్భంగా గోపాల కలువలు తీశారు. పండరిపూర్‌ విఠలేశ్వర స్వామి నామస్మరణ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆడపడుచులందరు కలశాలతో గోపాల కాలువలో పాలుపంచుకున్నారు. భాజా భజంత్రీలతో గోపాల కాలువలు వైభవంగా నిర్వహించారు. అనంతరం హనుమాన్‌ ఆలయం వద్ద భక్తులకు అన్నదానం ఏర్పాటు ...

Read More »

తాండాలో నీటి కటకట

  గాంధారి, మార్చి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి కాలం ప్రారంభం కాలేదు… ఇంకా ఏప్రీల్‌ మాసం రానే రాలేదు… అప్పుడే గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. గాంధారి మండలంలోని పలు గిరిజన తాండాల్లో ఉన్న బావుల్లో నీరు అట్టడుగు స్థాయికి చేరుకోవడంతో తాండా వాసులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని బీర్మల్‌ తాండాలో ఉన్న ఒకే ఒక్క బావిలో నీరు అడుగంటిపోవడంతో తాండా వాసులు ఒక్కొక్కరుగా ఒక్కో సమయంలో బావిలోని నీటిని తోడుకొని వాడుకుంటున్నారు. ఒకేసారి ...

Read More »

జూన్‌ నాటికి మొక్కలు సిద్దం

  గాంధారి, మార్చి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో భాగంగా జూన్‌ మొదటి వారం వరకు మొక్కలు సిద్దం చేస్తున్నట్టు గాంధారి ఎండివో సాయాగౌడ్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని రాంపూర్‌ గడ్డ వద్ద ఉపాధి హామీ నర్సరీని ఆయన పరిశీలించారు. నర్సరీలో మొక్కల పెంపకం వివరాలు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మొక్కలకు ఎప్పటికప్పుడు నీటిని అందించాలని సూచించారు. ఖచ్చితంగా హరితహారం కార్యక్రమం ప్రారంభం నాటికి మొక్కలు సిద్దమయ్యే విధంగా చూడాలని, అదేవిధంగా నాటిన మొక్కలను సంరక్షించాలని ఉపాధి హామీ సిబ్బందికి ...

Read More »

పుస్తక వివరణపై శిక్షణ

  నిజాంసాగర్‌, మార్చి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఐకెపి కార్యాలయంలో బుక్‌ కీపర్ల గ్రామ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులకు పుస్తక నిర్వహణపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆడిటర్‌ కుమార్‌ సంఘాల నిర్వహణకు చెందిన పుస్తకాలను ఏవిధంగా ఉంచుకోవాలో, సభ్యులు తీసుకుంటున్న గ్రామ సంఘాల అప్పులు, స్త్రీనిధి రుణాల వివరాలు నమోదు చేయాలని, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎపిఎం రాంనారాయణగౌడ్‌, సిసిలు శ్రీకాంత్‌, విఘ్నేశ్వర్‌గౌడ్‌, మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 33 గ్రామ సంఘాల సభ్యులు ...

Read More »

తెరాస సభ్యత్వ నమోదుకు భారీ స్పందన

  నిజాంసాగర్‌, మార్చి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమానికి గ్రామాల్లో విశేష స్పందన లభిస్తుందని మండల పార్టీ ఉపాధ్యక్షుడు నర్సింలు అన్నారు. నర్వా గ్రామంలోని యువకులు, నాయకులు, మహిళలు సభ్యత్వ నమోదు తీసుకున్నారు. స్వచ్చందంగా ముందుకు వచ్చి పార్టీ క్రియాశీల సభ్యత్వంతో పాటు సాదారణ సభ్యత్వం కూడా తీసుకుంటున్నారని అన్నారు. సభ్యత్వం పొందిన వారికి బీమా సదుపాయం ఉందని ప్రచారం చేస్తున్నారు. కార్యక్రమంలో నాయకులు గంగాగౌడ్‌, మల్లయ్య, గణేష్‌, సాయిరాం, శ్రీనివాస్‌గౌడ్‌ ఉన్నారు.

Read More »

వందశాతం బకాయిలు వసూలు చేసిన జిపిలకు ప్రోత్సాహకాలు

  మోర్తాడ్‌, మార్చి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న కార్యదర్శులు వందశాతం ఇంటిపన్ను వసూలు చేసిన గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాలు అందిస్తామని జిల్లా పంచాయతీ రాజ్‌ అధికారి చంద్రమౌళి అన్నారు. శుక్రవారం మోర్తాడ్‌ గ్రామ పంచాయతీని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 30 కోట్ల 66 లక్షల ఇంటి పన్ను బకాయిలు వసూలు చేయాల్సి ఉందని, స్పెషల్‌ డ్రైవ్‌లో గురువారం వరకు 20 కోట్ల 45 ...

Read More »

తెరాస సభ్యత్వానికి అపూర్వ స్పందన

  మోర్తాడ్‌, మార్చి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమానికి యువత, మైనార్టీ మహిళలు, అన్ని వర్గాల ప్రజలు ముందుకు వస్తున్నారని మోర్తాడ్‌ సొసైటీ ఛైర్మన్‌ ఎలాల రాజేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ గంగారెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ చినరాజేశ్వర్‌, తెరాస అధ్యక్షుడు కల్లడ ఏలియాలు అన్నారు. శుక్రవారం మోర్తాడ్‌ సొసైటీలో తెరాస సభ్యత్వ నమోదును ప్రారంభించారు. కార్యక్రమంలో తెరాస నాయకులు, యువజన సంఘాల సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రధాని మోడి కృషి ఫలితమే పెద్దపల్లి-నిజామాబాద్‌ రైల్వే లైన్‌

  మోర్తాడ్‌, మార్చి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ ప్రధాని నరేంద్రమోడి ఆధ్వర్యంలోనే పెద్దపల్లి – నిజామాబాద్‌ రైల్వే లైన్‌ నిర్మాణం పనులు పూర్తయ్యాయని బిజెపి నాయకులు గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, ముత్యాల మనోహర్‌రెడ్డి, నోముల ముత్యంరెడ్డి, తీగల రమేశ్‌రెడ్డి, బోగ దేవేందర్‌లు అన్నారు. శుక్రవారం మోర్తాడ్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. నరేంద్ర మోడి ప్రధాని అయిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో అసంపూర్తిగా ఉన్న పనులకు నిధులు కేటాయించి పూర్తిచేయించిన ఘనత వారిదేనన్నారు. గతంలో ఎన్డీయే ఆద్వర్యంలో అప్పటి ప్రధాని వాజ్‌పాయ్‌ ...

Read More »