Breaking News

Daily Archives: March 28, 2017

వడగండ్ల బాధితుల జాబితా సిద్దం

  బీర్కూర్‌, మార్చి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత పదిరోజు లక్రితం బీర్కూర్‌ మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని తహసీల్దార్‌ కృష్ణానాయక్‌ అన్నారు. కిష్టాపూర్‌ గ్రామంలో వ్యవసాయ అధికారిణి కమలతో కలిసి గ్రామ సభ నిర్వహించారు. గత వారం రోజులుగా పంట నష్టం సర్వే చేసినట్టు తెలిపారు. పంట నష్టపోయిన రైతుల వివరాలను గ్రామ సభలో చదివి వినిపించారు. మార్పులు, చేర్పులపై తగు సూచనలు చేయాల్సిందిగా గ్రామస్తులను కోరారు. నివేదికలు ...

Read More »

గ్రామ గ్రామాన సిసి రోడ్డు పనులు

  గాంధారి, మార్చి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ప్రతి గ్రామానికి సిసి రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక నిదులు మంజూరైనట్టు గాంధారి జడ్పిటిసి తానాజీరావు, ఎంపిపి యశోదాబాయిలు తెలిపారు. మంగళవారం మండలంలోని జివ్వాడి, రామలక్ష్మణ్‌ పల్లి గ్రామాల్లో సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. మండలానికి సుమారు కోటి 50 లక్షల రూపాయల నిధులు మంజూరు కాగా ప్రతి గ్రామంలో సిసి రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. నెలాఖరులోగా రోడ్డు పనులు ప్రారంభించి పూర్తిచేసేవిధంగా చూస్తామన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని ...

Read More »

తెరాస పార్టీకి అపూర్వ స్పందన

  బీర్కూర్‌, మార్చి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీకి అపూర్వ స్పందన లభిస్తుందని తెరాస పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి పోచారం సురేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని దామరంచ, బీర్కూర్‌ గ్రామాల్లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఆసరా పింఛన్లు, రూపాయికి కిలో బియ్యం, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ తదితర పథకాలకు ఆకర్షితులైన ఆయా గ్రామాల ప్రజలకు తెరాసలో లక్ష్యానికి మించి చేరుతున్నారని, పార్టీకి అపూర్వ స్పందన లభిస్తుందని ...

Read More »

పోలింగ్‌ బూత్‌ల పరిశీలన

  బీర్కూర్‌, మార్చి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ భన్వర్‌లాల్‌ ఆదేశాల మేరకు బీర్కూర్‌ తహసీల్దార్‌ కృష్ణనాయక్‌ మండలంలోని పలు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. రాబోవు స్తానిక సంస్థలు, తదితర ఎన్నికల దృష్ట్యా ప్రతి సంవత్సరం పరిశీలనలో భాగంగా పోలింగ్‌ బూత్‌లను పరిశీలిస్తున్నట్టు ఆయన తెలిపారు. మండలంలో 23 పోలింగ్‌ కేంద్రాలున్నాయని, ప్రస్తుతం పోలింగ్‌ కేంద్రాలో ఏ స్థితిలో ఉన్నాయో పరిశీలించి నివేదికలు రూపొందించి అధికారులకు పంపనున్నట్టు తెలిపారు. మంగళవారం కిష్టాపూర్‌ గ్రామంలోని పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ...

Read More »

అణగారిన వర్గాల ఆశాకిరణం కెసిఆర్‌

  నిజామాబాద్‌, మార్చి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ పల్లెలు కళావంతం చేయడానికి, కులవృత్తులను ప్రోత్సహించి అణగారిన వర్గాలకు చేయూతనివ్వడానికి పుట్టుకొచ్చిన ఆశాకిరణం సిఎం కెసిఆర్‌ అని తెరాస రాష్ట్ర నాయకులు పోతంగల్‌ కిషన్‌రావు అన్నారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ఎరుకల (గిరిజన) హక్కుల ఐక్య సాదన పోరాట సమితి ఆద్వర్యంలో తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం స్థానిక సదానంద్‌ గార్డెన్‌లో సభ నిర్వహించారు. సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోనేరు సాయిలు అధ్యక్షతన ...

Read More »

నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు

  – మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బీర్కూర్‌, మార్చి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రజలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. హేవిళంబి నామ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి, పంటలు అభివృద్ది చెందాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రజలందరు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని పేర్కొన్నారు. కెసిఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం బంగారు తెలంగాణ సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. దళిత, పేద, మధ్యతరగతి, సంపన్న వర్గాలందరు సుఖంగా ...

Read More »

ఓటర్‌ జాబితాలో పేర్ల గల్లంతుకు బాధ్యులెవరు

  బీర్కూర్‌, మార్చి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ గ్రామంలో 7,8,9,10, 11,12 వార్డుల్లో ఓటరు జాబితాలో పేర్ల గల్లంతుకు బాధ్యులెవరని బీర్కూర్‌ ఎంపిటిసి-2 సుధాకర్‌ యాదవ్‌ డిప్యూటి తహసీల్దార్‌ వరప్రసాద్‌తో వాగ్వాదానికి దిగారు. ఓటరు జాబితాలో పేర్లు ఎలా పోతాయని, దానికి బాధ్యులెవరో తెలియజేయాలని మంగళవారం డిప్యూటి తహసీల్దార్‌ను నిలదీశారు. మూడురోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఆయన మాట ఇవ్వడంతో శాంతించారు. మూడు రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ...

Read More »

గాంధారి పోస్టాఫీసుకు అవార్డు

  గాంధారి, మార్చి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉత్తమ సేవలు అందించినందుకుగాను గాంధారి తపాలా కార్యాలయానికి ప్రశంసా అవార్డు లభించింది. సోమవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగిన పోస్టల్‌ మహామేళ కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేశారు. చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ చంద్రశేఖర్‌, సీనియర్‌ సూపరింటెండెంట్‌ సుచిస్విత చేతుల మీదుగా గాంధారి పోస్టాఫీస్‌ ఎస్‌పియంకు అవార్డు ప్రదానం చేశారు. ఉత్తమ సేవలకు గుర్తింపుగా పోస్టాఫీసుతో పాటు ఎన్‌పిఎం భిక్షపతికి, సిబ్బందికి ప్రత్యేక ప్రశంసా పత్రాలను అందజేశారు. అవార్డు వచ్చినందుకు చాలా ...

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

  నిజాంసాగర్‌, మార్చి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సింగీతం గ్రామంలో సిమెంటు రోడ్డు పనులు ఎంపిటిసి సభ్యురాలు శైలజ, సర్పంచ్‌ ఆనంద్‌పల్లి వీరమణి ప్రారంభించారు. సిసి రోడ్డు నిర్మాణం కోసం ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, జడ్పిఛైర్మన్‌ దఫేదార్‌ రాజులు రూ. 5 లక్షలు మంజూరు చేశారన్నారు. సిసి రోడ్డు పనులను విఠలేశ్వర ఆలయంతోపాటు పలు వీధుల్లో నిర్మిస్తున్నట్టు ఆమె తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి గ్రామాల్లో సిసి రోడ్డు నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సాయాగౌడ్‌, ...

Read More »

పలు గ్రామాల్లో స్పెషల్‌ డ్రైవ్‌

  గాంధారి, మార్చి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని పలు గ్రామాల్లో మంగళ వారం పన్నుల వసూళ్ల కొరకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వెంకటాపూర్‌ గ్రామంతోపాటు సదాశివనగర్‌ మండలం యాచారంలో పంచాయతీ కార్యదర్శులు, ఈఓపిఆర్‌డి ఆనంద్‌ నేతృత్వంలో ఇంటి పన్ను వసూళ్లను చేపట్టారు. ఆయా గ్రామాల్లోని ఇంటింటికి తిరిగి ఇంటి పన్ను, నల్లా పన్నులు వసూలు చేశారు. యాచారం గ్రామ పంచాయతీలో 30 వేల రూపాయలు, వెంకటాపూర్‌ గ్రామ పంచాయతీలో 30 వేల రూపాయల ...

Read More »

అంగన్‌వాడి కేంద్రాల పనితీరుపై విచారణ

  నిజాంసాగర్‌, మార్చి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని అంగన్‌వాడి కేంద్రాన్ని సూపర్‌వైజర్‌ లక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో తల్లిదండ్రుల కమిటీ సమావేశం నిర్వహించారు. అంగన్‌వాడి కార్యకర్తల పనితీరు గురించి ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు పౌష్టికాహరం అందించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట ఎఎన్‌ఎం శాంతశ్రీ, సునీత, తదితరులున్నారు.

Read More »

విద్యుత్‌ షాక్‌తో ఒకరి మృతి

  గాంధారి, మార్చి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం నేరల్‌ తాండాకు చెందిన చందన్‌సింగ్‌ (35) అనే వ్యక్తి సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెడుతుండగా విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందాడు. గ్రామస్తుల, పోలీసుల కథనం ప్రకారం.. నేరల్‌ తాండాకు చెందిన చందన్‌సింగ్‌కు దగ్గర్లోని కర్నమ్‌ గడ్డ తాండా శివారులో స్వంత భూమి ఉంది. దీంతో మంగళవారం ఉదయం వ్యవసాయ భూమి దగ్గరికి వెళ్లగా తన సెల్‌ఫోన్‌లో చార్జింగ్‌ అయిపోవడంతో తాండాకు వచ్చాడు. తాండాలోని ఓ ఇంట్లో తన సెల్‌ఫోన్‌కు చార్జింగ్‌ ...

Read More »

టెన్త్‌ ఫిజిక్స్‌లో 4 గ్రేస్‌ మార్కులు

హైదరాబాద్‌: టెన్త్‌ ఫిజిక్స్‌ ప్రశ్నపత్రం అత్యంత కఠినంగా ఇచ్చారంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ వర్గాలు వ్యక్తం చేసిన ఆందోళనలపై విద్యాశాఖ స్పందించింది. ప్రశ్నపత్రంలో వచ్చిన తప్పిదాలపై సమీక్ష నిర్వహించిన పాఠశాల విద్యాశాఖ తప్పులను గుర్తించింది. 17-బి ప్రశ్నలో స్పష్టత లేక పోవటం కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడినట్లు గుర్తించామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఆర్‌ సురేంద్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రశ్నకు తప్పయినా, ఒప్పయినా ప్రయత్నం చేసిన విద్యార్థులకు నాలుగు మార్కులు కలపనున్నట్లు ప్రకటించారు. ప్రశ్నపత్రంపై పరీక్షల విభాగం తెలిపిన వివరాలివి.  పదో తరగతి ...

Read More »

హైదరాబాద్‌లో నెల రోజులుగా నో క్యాష్‌ బోర్డులు

90 శాతం ఏటీఎంలు మూతే నగదు కోసం హోం బ్రాంచీలకు ఖాతాదారుల పరుగు ఏటీఎంల సంఖ్య తగ్గించే చర్యలు నగరంలో నెలరోజులుగా 90 శాతం ఏటీఎంల వద్ద నో క్యాష్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఏటీఎంల ముందు నో క్యాష్‌, నాట్‌ వర్కింగ్‌ అనే బోర్డులను రోజూ పెడుతుండటంతో నగరవాసులు హోం బ్రాంచీలకు పరుగుపెడుతున్నారు. నగదు కోసం బ్యాంకులకు వెళితే గంటల సమయం వృథా అవుతోందని ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడిగినంత నగదు చెస్ట్‌ల నుంచి బ్యాంకులకు చేరడం లేదని పలువురు అధికారులు అంటున్నారు. ...

Read More »

కీలక దశలో జిఎస్‌టి

పార్లమెంట్‌లో బిల్లులు ఆమోదమే తరువాయి జూలై ఒకటి నుంచి అమలు! కీలకమైన నాలుగు జిఎస్‌టి బిల్లులను ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పరోక్ష పన్నులకు సంబంధించి గత స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద సంస్కరణగా చెబుతున్న జిఎస్‌టి పార్లమెంట్‌ ముంగిటకు రావడంతో అమలు ప్రక్రియ తుదిదశకు చేరిందని చెప్పవచ్చు.   న్యూఢిల్లీ: అవరోధాలన్నింటినీ అధిగమించి ఎట్టకేలకు వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లులు పార్లమెంట్‌ను చేరాయి. జూలై ఒకటి నుంచే జిఎస్‌టి అమలు చేయాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం పార్లమెంట్‌ ప్రస్తుత ...

Read More »

బండ్ల గణేష్‌ తోడేలులాంటి వాడు: సచిన్‌ జోషి

తనను చంపమని గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌కు హీరో సచిన్‌ జోషి డబ్బులు ఇచ్చాడని, అయితే నయీమ్‌ చనిపోవడంతో తను బతికిపోయానని ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. బండ్ల గణేష్‌ చేసిన ఆ ఆరోపణలపై సచిన్‌ జోషి స్పందించాడు. సచిన్‌ నటించిన ‘వీడెవడు’ చిత్ర టీజర్‌ విడుదల కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా బండ్ల గణేష్‌ను తీవ్రంగా విమర్శించాడు సచిన్‌. ‘బండ్ల గణేష్‌ మనిషి కాదు. అతను తోడేలులాంటివాడు. నమ్మక ద్రోహం చేశాడు. ఎవడినైతే నమ్మకూడదో వాడితోనే వ్యాపారం చేశా. ...

Read More »

ట్రంప్‌ కారా! మజాకా!

అమెరికా అధ్యక్షుడికి భద్రత పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తీసుకునే ఆహారం నుంచి పయనించే వాహనం వరకు ప్రతి విషయంలో నిఘా ఉంటుంది. అధికారులు అత్యంత కట్టుదిట్టుమైన చర్యలు తీసుకుంటారు. మరి అలాంటిది అగ్రరాజ్య అధ్యక్షుడు ఉపయోగించే కారంటే.. మామూలుగా ఉంటుందా? ఆ కొత్త కారు గురించి ఆసక్తికరమైన విషయాలు..  అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఉపయోగిస్తున్న కొత్త కారును ‘బీస్ట్‌’ అని పిలుస్తున్నారు. జనవరిలోనే ఈ కారు ఉపయోగించాల్సింది. కానీ అప్పటికి ఆ కారు సిద్ధం కాలేదు. ఇలాంటి కార్లు మొత్తం 12 ఉంటాయి. ...

Read More »