Breaking News

Daily Archives: March 30, 2017

బిజెపి మండల అధ్యక్షునిగా రాజు

  నందిపేట, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి మండల అధ్యక్షునిగా మండల కేంద్రానికి చెందిన పెయింటర్‌ రాజును మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కార్యదర్శి శివరాజ్‌కుమార్‌, ఆర్మూర్‌ ఇన్‌చార్జి నూతుల శ్రీనివాస్‌లు నియామక పత్రం అందజేశారు. ఆయనతోపాటు కార్యదర్శులుగా సాయిరెడ్డిని, శ్రీనివాస్‌గౌడ్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ తమకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని, పార్టీ బలోపేతానికి పాటుపడతానని చెప్పారు.

Read More »

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు వినతి

  కామారెడ్డి, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ (టిడబ్ల్యుజెఎఫ్‌) ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణకు వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా జర్నలిస్టుల సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. చిన్న, పెద్ద పత్రికలు తేడా లేకుండా అక్రిడేషన్లు మంజూరు చేయాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వారందరికి అక్రిడేషన్లు కల్పించాలన్నారు. జర్నలిస్టుల పిల్లలకు విద్యాహక్కు చట్టం ప్రకారం ఉచిత విద్య సౌకర్యం కల్పించాలని, అర్హతగల విలేకరులకు డబుల్‌ బెడ్‌రూం పథకం వర్తింపజేయాలన్నారు. ...

Read More »

ఐలమ్మ విగ్రహ ప్రతిష్టాపనకు భూమిపూజ

  కామారెడ్డి, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్టాపన చేసేందుకు కామారెడ్డి రజక సంఘం ప్రతినిధులు భూమిపూజ చేశారు. స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహం ఎదుట ఐలమ్మ విగ్రహాన్ని నెలకొల్పనున్నట్టు తెలిపారు. ఈ సందర్బంగా వారు మట్లాడుతూ నాడు సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాల్గొని ఎంతోమందికి స్పూర్తినిచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిదులు నర్సయ్య, స్వామి, శ్రీనివాస్‌, రాజు, గంగాదర్‌, శ్రీను, అనిల్‌, శ్యాం, శంకర్‌, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

Read More »

సంఘీభావ మహాసభ కరపత్రాల ఆవిష్కరణ

  కామారెడ్డి, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లో ఏప్రిల్‌ 4న నిర్వహించనున్న మేధావుల సంఘీభావ మహాసభకు సంబంధించిన కరపత్రాలను గురువారం కామారెడ్డిలో ఎంఆర్‌పిఎస్‌ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ఏప్రిల్‌ 4న హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్‌ ఆడిటోరియంలో సంఘీభావ మహాసభ నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమానికి అంబేడ్కర్‌ మనువడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌, ఎంఆర్‌పిఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృస్ణ మాదిగ, మాదిగ మేధావుల వేదిక ఛైర్మన్‌, కన్వీనర్లు కాశీం, శ్రీనివాస్‌తోపాటు ...

Read More »

తెరాస సభ్యత్వ నమోదుకు విశేష స్పందన

  నందిపేట, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గాదెపల్లి గ్రామంలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు నక్కల భూమేశ్‌ గురువారం ప్రారంభించారు. సభ్యత్వ నమోదుకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని, గురువారం గ్రామంలోని మాలకులస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి తెరాస సభ్యత్వం తీసుకున్నట్టు తెలిపారు. ఖుదావన్‌పూర్‌ గ్రామ ఎంపిటిసి ఆధ్వర్యంలో గ్రామంలో సభ్యత్వనమోదు కార్యక్రమం జరిగింది. తెరాస ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు.

Read More »

ఘనంగా సైలానిబాబా దర్గా ఉర్సు ప్రారంభం

  నందిపేట, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని పలుగుట్ట సమీపంలో గల సైలానిబాబా దర్గా ఉర్సు ఉత్సవాలు గురువారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఒంటెలు, గుర్రాలను అందంగా అలంకరించి దర్గా చాదర్‌లు కప్పి అందంగా ముస్తాబు చేశారు. పాతూరులోని శివాజీ విగ్రహం వద్దగల మహబూబ్‌ సుబాని దర్గా నుంచి శోభాయాత్ర ప్రారంభమై ప్రధాన వీధుల గుండా భక్తి,కీర్తనలతో సాగుతుంది. కుల, మతాలకు అతీతంగా ప్రజలు రోడ్డు వెంబడి నిలబడి యాత్రకు స్వాగతం పలుకుతున్నారు. అర్ధరాత్రి వరకు పలుగుట్ట సైలానిబాబా ...

Read More »

తైబజార్‌ నిదులతో ప్రత్యేక అభివృద్ది పనులు

  గాంధారి, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తైబజార్‌ వేలంలో వచ్చిన నిధులతో గ్రామంలో ప్రత్యేక అభివృద్ది పనులు చేపడతామని గాంధారి సర్పంచ్‌ సత్యం అన్నారు. గురువారం గాంధారి గ్రామ పంచాయతీ కార్యాలయంలో తైబజార్‌ నిర్వహించారు. మార్కెట్‌ తైబజార్‌ వేలం 3 లక్షల 52 వేలకు దక్కించుకోగా గోదల మార్కెట్‌ వేలం 17 వేల 500 లకు దక్కించుకున్నారు. తైబజార్‌ వేలంలో వచ్చిన మొత్తం డబ్బును గ్రామంలో బతుకమ్మ, వినాయక నిమజ్జనాల ఏర్పాటుకు ఖర్చుచేయడానికి పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించారు. ...

Read More »

పట్టణ రజక సంఘం అధ్యక్షునిగా మహేశ్‌

  కామారెడ్డి, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ రజక యువజన సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షునిగా ఎన్‌.మహేశ్‌, ఉపాధ్యక్షునిగా మంగేశ్‌, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్‌, కోశాధికారిగా ప్రకాశ్‌, బాలగంగాధర్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు.

Read More »

లబ్దిదారులకు ట్రాక్టర్ల అందజేత

  కామారెడ్డి, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం లబ్దిదారులకు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ చేతుల మీదుగా ట్రాక్టర్లు అందజేశారు. కామారెడ్డి మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన బండారి లక్ష్మికి యంత్ర లక్ష్మి పథకం కింద మంజూరైన ట్రాక్టర్‌ను ప్రభుత్వవిప్‌ అందజేశారు. ప్రభుత్వం రైతులను ప్రోత్సహించడంలో భాగంగా లబ్దిదారులకు ట్రాక్టర్లు పంపిణీ చేస్తుందని, లబ్దిదారులు తద్వారా వ్యవసాయంలో అభివృద్ది చెందాలని సూచించారు. కార్యక్రమంలో లింగాపూర్‌ గ్రామ తెరాస అధ్యక్షుడు బండారిరాంరెడ్డి, ఏఎంసి డైరెక్టర్‌ బాగయ్య, ...

Read More »

అంబేడ్కర్‌, జగ్జీవన్‌రాం జయంతులు ఘనంగా నిర్వహించాలి

  – జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏప్రిల్‌ 5న బాబు జగ్జీవన్‌రాం, డాక్టర్‌ అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలను ఘనంగానిర్వహించేందుకు అన్నిఏర్పాట్లు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌సత్యనారాయణ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం తమ చాంబరులోజయంతి ఉత్సవాల ఏర్పాట్లపై ఎస్సీ, ఎస్టీ సంక్షేమ అధికారులతో పాటు ఎస్సీ, అంబేడ్కర్‌ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బాబు జగ్జీవన్‌రాం, అంబేడ్కర్‌ విగ్రహాలకు రంగులు వేయించి అలంకరించాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా ...

Read More »

వ్యాధి నిరోదక శక్తి పెరగడానికే మందుల పంపిణీ

  గాంధారి, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జీవాల్లో వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి నట్టల నివారణ మందుల పంపిణీ చేస్తున్నట్టు పశు సంవర్ధకశాఖ ఏడిఏ రోహిత్‌రెడ్డి తెలిపారు. గురువారం గాంధారి మండల కేంద్రంలో నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నట్టల నివారణ మందుల పంపిణీతో వ్యాధి నిరోధక శక్తి పెరగడమే గాకుండా, జీవాల్లో నట్టల బెడద ఉండదన్నారు. అదేవిధంగా మేకలు, గొర్రెలకు పుట్టే పిల్లలు అధిక బరువుతో పుడతాయన్నారు. ...

Read More »

ఓటరునమోదు చేసుకోవాలి

  గాంధారి, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన పౌరులు ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొని తమ పేర్లను జాబితాలో నమోదు చేసుకోవాలని గాంధారి తహసీల్దార్‌ ఎస్‌.వి.లక్ష్మణ్‌ అన్నారు. గురువారం తన కార్యాలయంలో ఆయా రాజకీయ పార్టీల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఓటరు నమోదు కొరకు ఏప్రిల్‌ 20వ తేదీన నోటిఫికేషన్‌ విడుదలచేస్తామని, మే 10వ తేదీ వరకు ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. దీని కొరకు ఏప్రిల్‌ 26వ తేదీ నుండి మే 3 వరకు బూత్‌ స్థాయిలో ...

Read More »

మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి

  బీర్కూర్‌, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలో అల్లం గంగారాం, మూత్ర పిండ వైద్యులు రాంచందర్‌ సితాలె గత కొన్నిరోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మండలంలో సీనియర్‌ పార్టీ నాయకులు అనారోగ్యంతో మృతి చెందడం బాదాకరమన్నారు. పార్టీ కార్యకర్తలకు తెరాస ఎల్లవేళలా అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఆయన వెంట మార్కెట్‌ ...

Read More »

ప్రత్యేక పూజల్లో తెరాస నాయకులు

  గాంధారి, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉగాది పండగ సందర్భంగా బుధవారం ఎంపి బిబి పాటిల్‌తోపాటు తెరాస నాయకులు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ ఖేడ్‌ వద్ద గల ఝరా సంగం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాందారి మండలానికి చెందిన తెరాస రాష్ట్ర నాయకులు నర్వాపూర్‌ సత్యం ఎంపి బిబి పాటిల్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక హారతులు, స్వామి వారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. తెలంగాణ ...

Read More »

తెరాస పార్టీకి అపూర్వ స్పందన

  బీర్కూర్‌, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీకి మండలంలోని ఆయా గ్రామాల్లో అపూర్వ స్పందన లభిస్తుందని కిష్టాపూర్‌ సర్పంచ్‌ పరుసుగంగొండ అన్నారు. మండలంలోని కిష్టాపూర్‌ గ్రామంలో గురువారం తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాసపార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు పార్టీలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More »

నసురుల్లాబాద్‌లో కుస్తీ పోటీలు

  బీర్కూర్‌, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉగాది పర్వదినం పురస్కరించుకొని నసురుల్లాబాద్‌ గ్రామంలో గ్రామ సర్పంచ్‌ సాయిలు ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే ఉగాది పండగ సందర్భంగా గ్రామంలో కుస్తీ పోటీలు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. మల్లయోధులు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి పాల్గొన్నారు. చివరి కుస్తీలో గెలిచిన వ్యక్తికి రూ. 2 వేల నగదు, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలోగ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

  బీర్కూర్‌, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని మైలారం గ్రామంలో తెరాస పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి గురువారం సిసి రోడ్డు పనులు ప్రారంభించారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ పథకం కింద రూ. 3 లక్షల వ్యయంతో గ్రామంలో సిసి రోడ్డు పనులు చేపడుతున్నట్టు ఆయన అన్నారు. తెరాస పార్టీ ఆద్వర్యంలో ప్రతి గ్రామంలో సిసి రోడ్లు, సిసి డ్రైనేజీలు నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పెరిక శ్రీనివాస్‌, సర్పంచ్‌సాయిరాం, ఎంపిటిసి మహేందర్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More »

ఇంకుడుగుంతల డబ్బులు చెల్లించాలి

  నిజాంసాగర్‌, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంకుడు గుంతల డబ్బులు చెల్లించాలని కోరుతూ మక్దుమ్‌పూర్‌ కూలీలు ఎంపిడివో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఇంకుడు గుంతల డబ్బులు చెల్లింపుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సరం క్రితం ఉపాది హామీ అధికారుల సూచన మేరకు ఇంకుడు గుంతలు తవ్వామని, హరితహారం తదితర కార్యక్రమాల్లో మొక్కలు నాటినట్టు చెప్పారు. పనిచేసిన కూలీ ఇప్పటి వరకు తమకు అందలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు త్వరితగతిన ...

Read More »

బోరుమోటారు ప్రారంభం

  నిజాంసాగర్‌, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నర్వా గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెరాస మండల ఉపాధ్యక్షుడు నర్సింలు అన్నారు. నర్వా గ్రామంలో మోటారు పైప్‌లైన్‌ పనులు ప్రారంభించారు. పంచాయతీ నిధులతో సర్పంచ్‌ అనసూయ ఆధ్వర్యంలో పలు కాలనీల్లో తాగునీటి కోసం కొత్త పైప్‌లైన్‌లను వేస్తున్నట్టు తెలిపారు. బోరు మోటారు నుంచి కనెక్షన్‌ ఇవ్వడంతో గ్రామంలో నీటి సమస్య పరిష్కారం అయిందన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు సుదర్శన్‌, కారోబార్‌ జంగం ప్రభాకర్‌, నాయకులు రాములు, ...

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

  నిజాంసాగర్‌, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మల్లూర్‌ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన నాలుగు లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. గ్రామంలోని కొత్త కాలనీవైపు సిసి రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పనులు పూర్తయితే తమ ఇబ్బందులు దూరమవుతాయని కాలనీ వాసులు సంతోషిస్తున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బసప్ప, వార్డు సబ్యులు మైశయ్య, గంగారాం తదితరులు పాల్గొన్నారు.

Read More »