దుబాయి నుంచి వచ్చిన భర్తను ప్రియుళ్లతో కలిసి చంపేసిందో భార్య

ఇద్దరు ప్రియుళ్లతో కలిసి.. భర్తను సజీవ దహనం చేసిన భార్య 

 
మోపాల్‌(నిజామాబాద్ జిల్లా): మండలంలోని ఠాణాకుర్దు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి భార్య లీలావతి, భర్త సాయిలు(33)ను పథకం ప్రకారం సజీవ దహనం చేసిన ఘటన కలకలం రేపింది. నిజామాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ వెంకటేశ్వర్లు, మోపాల్‌ సీఐ సతీష్‌లు మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని సందర్శించారు. స్థానికుల కథనం ప్రకారం.. ఠాణాకుర్దు గ్రామానికి చెందిన వేల్పూర్‌ సాయిలు బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లి గత పదిరోజుల క్రితమే స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. భార్య లీలావతిపై ఎంతో నమ్మకంతో ఉండేవాడు. ఎవరెన్ని చెప్పినా.. వినేవాడు కాదు. కానీ సాయిలు భార్య లీలావతి అతని నమ్మకాన్ని వమ్ము చేస్తూ.. అదే గ్రామానికి చెందిన తిరుపతి, రమేశ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో తన వ్యవహారం భర్తకు తెలిసిపోతుందని ముందుగానే పసిగట్టిన భార్య పథకం ప్రకారం.. అదే ‘నమ్మకం’తో భర్తతో అన్యోన్యంగా ఉండసాగింది.
కానీ ముందస్తు వ్యూహం ప్రకారం.. తిరుపతి, రమేశ్‌తో కలిసి భర్త సాయిలును సోమవారం అర్ధరాత్రి గొంతు నులిమి దారుణంగా హత్యచేసింది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న మంచానికి కట్టివేసి.. కిరోసిన్‌ పోసి నిప్పు అంటించి.. ఇంటికి తాళం వేసి పారిపోయారు. ఉదయం సాయిలు ఇంట్లో నుంచి పొగలు రావడంతో చుట్టు పక్కల కాలనీవాసులు, బంధువులు వెంటనే తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లే సరికి సాయిలు అగ్నికి ఆహుతి అవడాన్ని చూసి కాలనీ వాసులు తమకు ఫోన చేశారని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. కానీ అప్పటికే సాయిలు మృతి చెందాడని తెలిపారు. సంఘటనను చూసిన సాయిలు తల్లి పోసాని బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. భార్యపై అతి నమ్మకమే సాయిలు హత్యకు దారి తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, నిందితులు లీలావతి, తిరుపతి, రమేశ్‌లు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు జరుపుతున్నారు.

Check Also

నెలాఖరులోగా పత్తిరైతులకు గుర్తింపు కార్డులు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెలాఖరులోగా పత్తి రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్టు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *