Breaking News

Daily Archives: March 31, 2017

గ్రామంలో ఉండకుంటే అంగన్‌వాడిలపై వేటు

  కామారెడ్డి, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయా గ్రామాల్లో పనిచేస్తున్న అంగన్‌వాడి సూపర్‌వైజర్లు గ్రామాల్లో ఉండకుంటే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు వెనుకంజ వేయబోమని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అమ్మఒడి కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శ్వేతతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో అంగన్‌వాడి కేంద్రాల నిర్వహణ సక్రమంగా జరగడం లేదని తమకు సమాచారం ఉందని తెలిపారు. అలసత్వం వహిస్తే నిబందనల ప్రకారం పౌష్టికాహారం అందించకుంటే వారిని సస్పెండ్‌ చేస్తామనిపేర్కొన్నారు. అంగన్‌వాడి ...

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

  కామారెడ్డి, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 25వ వార్డు వశిష్ట డిగ్రీ కళాశాల సమీపంలో చేపడుతున్న సిసి రోడ్డు పనులను శుక్రవారం మనిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. బిఆర్‌జిఎఫ్‌ నిధులు రూ. 2 లక్షలతో రోడ్డు పనులు చేపడుతున్నట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ సల్ల రాధికా, ఎం.ఇ భూమేశ్‌, నాయకులు అశోక్‌కుమార్‌, కాంట్రాక్టర్‌ నర్సింలు, తదితరులున్నారు.

Read More »

తెరాసలో పలువురి చేరిక

  కామారెడ్డి, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం దేవునిపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్‌, టిడిపికి చెందిన నాయకులు శుక్రవారం దేవునిపల్లి సర్పంచ్‌ నిట్టు వెంకట్‌రావు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ సమక్షంలో తెరాసలో చేరారు.ముఖ్యమంత్రి కెసిఆర్‌ చేపడుతున్న అభివృద్ది పనులకు ఆకర్షితులై తెరాసలో చేరుతున్నట్టు తెలిపారు. సుమారు 70 మంది పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో ఎంపిపి లద్దూరి మంగమ్మ, గ్రామ పార్టీ అధ్యక్షుడు రవిందర్‌, వైస్‌ ఎంపిపి కృష్ణాజిరావు, నాయకులు స్వామి, లింగారావు, ...

Read More »

రైతులందరికి సకాలంలో రుణాలు అందిస్తాం

  బీర్కూర్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులందరికి సకాలంలో రుణాలు అందజేస్తామని బీర్కూర్‌ సొసైటీ ఛైర్మన్‌ మాణప్ప గారి రాజప్ప అన్నారు. మండల కేంద్రంలో సొసైటీలో శుక్రవారం మహాజనసభ నిర్వహించారు. ఏప్రిల్‌ 1, 2016 నుంచి డిసెంబరు 31, 2016 వరకు ఆదాయ, వ్యయాలను కార్యదర్శి విఠల్‌ చదివి వినిపించారు. స్వల్ప, దీర్ఘ, మధ్య కాలిక రుణాలు బీర్కూర్‌ సొసైటీ ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుందని రైతులు పాస్‌బుక్కులు ఇచ్చిన వెంటనే రుణాలుఅందజేస్తున్నామని ఆయన తెలిపారు. గత ఎనిమిది నెలల ...

Read More »

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ

  కామారెడ్డి, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదలైన చెక్కులను శుక్రవారం కామారెడ్డిలో బాధిత కుటుంబాలకు అందజేశారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ చెక్కులను అందజేశారు. కామారెడ్డి పట్టణానికి చెందిన భవ్యకు అపెండిక్స్‌ ఆపరేషన్‌ కావడంతో రూ. 10 వేలు, కామరెడ్డి మండలం క్యాసంపల్లికి చెందిన నర్సయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి రూ. 55 వేల చెక్కులు అందజేశారు. మాచారెడ్డి మండలానికి చెందిన నర్సారెడ్డికి చెక్కులు ...

Read More »

వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు ప్రభుత్వం కృషి

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కామారెడ్డి, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించి రైతులకు లాభసాటిగా ఉండేవిధంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేసేందుకు రాష్ట్ర ప్రబుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో యంత్రలక్ష్మి కింద మంజూరైన 92 ట్రాక్టర్లను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా యంత్రలక్ష్మి ...

Read More »

వాటర్‌ ట్యాంకు నిర్మాణానికి భూమిపూజ

  బీర్కూర్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని వీరాపూర్‌, తిమ్మాపూర్‌ గ్రామాల్లో వాటర్‌ ట్యాంకు నిర్మాణాలకు మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు పెరిక శ్రీనివాస్‌ భూమిపూజ చేశారు. ఆయా గ్రామాల్లో 40 వేల కిలో లీటర్ల సామర్థ్యంగల వాటర్‌ ట్యాంకులు నిర్మించనున్నట్టు తెలిపారు. రూ. 16 లక్షల వ్యయం అవుతుందని అన్నారు. మిషన్‌ భగీరథలో భాగంగా శుద్దజలాన్ని ఆయా గ్రామప్రజలకు అందించే ప్రయత్నంలో భాగంగా వాటర్‌ ట్యాంకులు నిర్మిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జడ్పిటిసి కిషన్‌ నాయక్‌, గ్రామ పెద్దలుపాల్గొన్నారు.

Read More »

5న ఛలో కామారెడ్డి

  కామారెడ్డి, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంఆర్‌పిఎస్‌ టిఎస్‌ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 5వ తేదీన ఛలో కామారెడ్డికార్యక్రమం నిర్వహించనున్నట్టు సంస్థ రాష్ట్ర కార్యదర్శి వేముల బలరాం అన్నారు. ఏప్రిల్‌ 5న జరిగే బాబు జగ్జీవన్‌రాం జయంతిని ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా నిర్వహిస్తున్నారని, ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ఛలో కామారెడ్డికి దళితులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. పార్శి రాములు కళ్యాణ మండపంలో జగ్జీవన్‌రాం జయంతి వేడుకలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సుంకరి శ్రీనివాస్‌, చందు, ...

Read More »

విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ

  నిజాంసాగర్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నిజాంసాగర్‌ ఉన్నత పాఠశాలలోని నలుగురు విద్యార్థులకు ప్రభుత్వం ఆరోగ్య కేంద్రంలో విదులు నిర్వర్తించే పార్మాసిస్టు అనితారెడ్డి కంటి అద్దాలను పంపిణీ చేశారు. మార్చిమొదటి వారంలో కంటి వైద్యులు వెంకటేశం పాఠశాలలోని 190 మంది కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో నలుగురికి కంటి అద్దాలు అవసరముండగా శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, తదితరులున్నారు.

Read More »

చల్లంగ చూడమ్మ.. పోచమ్మ …

  నిజాంసాగర్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉగాది పండగ పురస్కరించుకొని గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. మండలంలోని కోమలంచ గ్రామంలో నల్లపోచమ్మ ఆలయ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం అందంగా అలంకరించిన బోనాలను నెత్తిన పెట్టుకొని మహిళలు చెరువు గట్టున వెలసిన పోచమ్మ ఆలయంలో అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా వీధుల నుంచి బోనాల ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామంలోని అన్ని కులాలకు చెందిన మహిళలు సామూహికంగా పాల్గొన్నారు. అదేవిధంగా హనుమాన్‌ మందిరం వద్ద జడకొప్పులాట ...

Read More »

పల్స్‌పోలియో విజయవంతం చేయండి

  బీర్కూర్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 2వ తేదీన నిర్వహించబోయే పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలని ప్రాథమిక వైద్యులు దిలీప్‌కుమార్‌ అన్నారు. బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండల కేంద్రాల్లో పాఠశాల విద్యార్థులచే పల్స్‌పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల చిన్నారుల వరకు పల్స్‌పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలని ఆయా గ్రామాల ప్రధాన వీధుల గుండా నినాదాలతో ర్యాలీ కొనసాగించారు. పల్స్‌పోలియో కార్యక్రమానికి సంబంధించి ఆయా మండలాల్లో ప్రణాళిక సిద్దంచేసినట్టు ఆయన తెలిపారు. ...

Read More »

రేషన్‌ సరుకులు సక్రమంగా అందించాలి

  నిజాంసాగర్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల రేషన్‌ డీలర్లునిత్యవసర సరుకులనుసక్రమంగా అందించాలని తహసీల్దార్‌ అబ్దుల్‌ గనిఖాన్‌ అన్నారు. తహసీల్‌ కార్యాలయంలో శుక్రవారం రేషన్‌ డీలర్లతో సమావేశమయ్యారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న సరుకులను వినియోగదారులకు అందించాలని, రేషన్‌ దుకాణాలు సమయం ప్రకారం తెరవాలని సూచించారు. సరుకులలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సమావేశంలో డీలర్లు సురేశ్‌, గంగాధర్‌, వెంకటేశం, బాలయ్య, తదితరులున్నారు.

Read More »