Breaking News

Monthly Archives: April 2017

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

  నిజామాబాద్‌, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులనుండి ఒక్క కిలో కూడా తగ్గించకుండా కొనుగోలు చేయించాల్సిన బాధ్యత తహసీల్దార్లదేనని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఏ.రవిందర్‌రెడ్డి తహసీల్దార్లను ఆదేశించారు. శనివారం సాయంత్రం ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరుపై తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడతూ రైతులు పండించిన పంటలకు దళారుల ప్రమేయం లేకుండా మద్దతుధర కల్పించాలనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ఎక్కడైనా ఎక్కువ …

Read More »

స్వైన్‌ఫ్లూ, వడదెబ్బల నివారణకు అప్రమత్తంగా ఉండాలి

  నిజామాబాద్‌, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వైన్‌ఫ్లూ, వడదెబ్బల నివారణకు అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వైద్యాధికారులకు ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌ నుంచి తహసీల్దార్లు, ఆర్డీవోలు, ఎంపిడివోలు, వైద్య అధికారులతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, జడ్పి సిఇవోతో కలిసి వడదెబ్బ, స్వైన్‌ఫ్లూ నివారణ చర్యలపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రబలినపుడు వైద్యాధికారులు త్వరగా స్పందించాలని, అక్కడ ప్రథమ చికిత్స చేసి అవసరమైతే జిల్లా ఆసుపత్రికి రిఫర్‌ …

Read More »

అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్ముడు బసవేశ్వరుడు

  నిజామాబాద్‌, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్త్రీ పురుష సమానత్వం గురించి, ఆర్థిక, సాంఘిక, రాజకీయ సమానతల గురించి 884 సంవత్సరాల క్రితమే ఆలోచించిన మహాత్ముడు బసవేశ్వరుడు అని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఏ.రవిందర్‌ అన్నారు. శనివారం జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కొత్త అంబేడ్కర్‌ భవనంలో మహాత్మ బసవేశ్వర 884వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ మహాత్ముల ఆదర్శాలు, బోధనలు సమకాలీన సమాజంలో అవసరమని వారి సిద్దాంతాలు అందరం గౌరవించాలని, …

Read More »

వ్యవసాయ మార్కెట్లోనే ధాన్యం విక్రయించాలి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్‌ ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్దిష్ట ధరకు విక్రయించాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య కోరారు. తేమ 17 శాతం, చెత్త తాలు 1 శాతం, మట్టిపెల్లలు, రాళ్ళు 1 శాతం, పురుగుతిన్న ధాన్యం 5 శాతం, మడుచుకుపోయిన ధాన్యం 3 శాతం, మొలకెత్తిన ధాన్యం 4 శాతానికి మించి ఉండరాదన్నారు. రైతులు బ్యాంకు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్సు కాపీలను …

Read More »

మే 1న ఫోన్‌ ఇన్‌ విత్‌ కలెక్టర్‌

  కామారెడ్డి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మే 1వ తేదీన ఫోన్‌ ఇన్‌ విత్‌ జిల్లా కలెక్టర్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు జిల్లా పౌరసంబంధాల అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి 11 వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలందరు తమ సమస్యలు, కాలనీ సమస్యలు, ప్రభుత్వ పరమైన సమస్యలు ఫోన్‌ ద్వారా కలెక్టర్‌తో నేరుగా సంప్రదించవచ్చన్నారు. 08468-220252 నెంబరుకు ఫోన్‌చేసి సమస్యలు విన్నవించాలని అన్నారు.

Read More »

జేఇఇ ర్యాంకర్లకు సన్మానం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 27న ప్రకటించిన జేఇఇ మెయిన్స్‌ ఫలితాల్లో ప్రతిబ కనబరిచిన ర్యాంకర్లకు శ్రీసాందీపని కళాశాల యాజమాన్యం సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ జేఇఇ మెయిన్స్‌ ఫలితాల్లో కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు జేఇఇ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారని తెలిపారు. వీరిని అభినందించారు. కార్యక్రమంలో యాజమాన్య సభ్యులు అశోక్‌రావు, పెంటయ్య, కృష్ణమూర్తి, జనార్దన్‌రెడ్డి, తదితరులున్నారు.

Read More »

మహాపురుషుల బాటలో నడవాలి

  – జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహానీయులు చూపిన బాటలో నడిచి ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో శనివారం శ్రీశ్రీశ్రీ విశ్వగురువు మహాత్మా బసవేశ్వరి 884వ జయంతి ఉత్సవాలను ప్రభుత్వపరంగా లాంచనంగా నిర్వహించారు. దీనికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బసవేశ్వరుని జీవిత విశేషాలను వివరించారు. ఆత్మ, పరమాత్మ గురించి తన ప్రసంగంలో చెప్పారు. ప్రభుత్వం ఇలాంటి మహాపురుషుని …

Read More »

అభివృద్ది నిధులతో విహారయాత్రలా!

  గాంధారి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామంలో అభివృద్ది పనులకు కేటాయించిన నిదులతో గాంధారి గ్రామ పంచాయతీ పాలకవర్గం విహారయాత్రలకు వెళ్లి జల్సాలు చేసిందని బిజెపి నాయకులు, కాలనీవాసులు ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలోని గుండమ్మ కాలువ రోడ్డుపై నిలిచిన మురికి నీటిని చూపిస్తూ కాలనీవాసులు, బిజెపి నాయకులు ఇలా స్పందించారు. గత కొన్ని సంవత్సరాలుగా గుండమ్మ కాలువరోడ్డు వద్దగల కాలనీవాసులు ఎన్నోసార్లు పంచాయతీ పాలకవర్గానికి మొరపెట్టుకున్నా అధికారులుగానీ, పంచాయతీ పాలకవర్గ సభ్యులుగాని స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. చిన్నపాటి జల్లులు …

Read More »

వరంగల్‌ సభకు తరలిన తెరాస శ్రేణులు

  గాంధారి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరంగల్‌లో గురువారం సాయంత్రం నిర్వహించే తెరాస ఆవిర్బావ సబకు గాంధారి మండలం నుంచి తెరాస నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివెళ్లారు. ఇప్పటికే బుధవారం సాయంత్రం మండలం నుంచి సుమారు 50 ట్రాక్టర్లలో రైతులు, కార్యకర్తలు సబకు తరలివెళ్లగా, గురువారం ఉదయం ప్రత్యేక వాహనాల్లో మరికొందరు నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ప్రయివేటు బస్సులు, జీపులు, కార్లలో బయల్దేరారు. ఉదయం 10 గంటల సమయంలో 10 బస్సులు, ప్రత్యేక వాహనాల్లో తెరాస శ్రేణులు …

Read More »

ఘనంగా లక్ష్మమ్మదేవి ఆలయ వార్షికోత్సవం

  గాంధారి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని లక్ష్మమ్మ దేవి ఏడవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం నుంచి శనివారం వరకు మూడురోజుల పాటు ఆలయ వార్షికోత్సవాలు గ్రామాభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ ఛైర్మన్‌, మాజీ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ తాన్‌సింగ్‌ నాయక్‌ తెలిపారు. మొదటిరోజు గురువారం ఆలయంలో భారత్‌ భూషణ్‌ జోషి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండోరోజు శుక్రవారం అమ్మవారికి బోనాల సమర్పణ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. చివరిరోజు శనివారం …

Read More »