Breaking News

Daily Archives: April 1, 2017

ఘనంగా కుస్తీ పోటీలు

  నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని కోమలంచ గ్రామంలో కుస్తీపోటీలు హోరాహోరీగా సాగాయి. గ్రామ శివారులోని నల్లపోచమ్మ ఆలయ ఉత్సవాలు మూడురోజుల నుంచి నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలైన జుక్కల్‌, నారాయణఖేడ్‌, మద్నూర్‌, బాన్సువాడ, ఎల్లారెడ్డి మండలాల నుంచి మల్లయోధులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గెలుపొందిన వారికి నిర్వాహకులకు నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ సాదుల సత్యనారాయణ, రంగారెడ్డి, విఠల్‌రెడ్డి, తదితరులున్నారు.

Read More »

ఈనెల 10 వరకు స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగించాలి

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పంచాయతీ రాజ్‌ అధికారి ఆదేశాల మేరకు మండలంలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని ఎంపిడివో శ్రీనివాస్‌ తెలిపారు. శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో మండల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఒడ్యాట్‌ గ్రామంలో స్పెషల్‌ డ్రైవ్‌ బృందం ఇంటింటికి తిరుగుతూ ఇంటి పన్ను బకాయిలు 31 వేలు వసూలు చేసినట్టు ఆయన తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల్లో 1 లక్ష 70 వేలు ఇంటి పన్ను బకాయిలు వసూలైనట్టు ఎంపిడివో తెలిపారు. …

Read More »

విద్యార్థులకు వైద్య పరీక్షలు

  నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని హసన్‌పల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఆర్‌బిఎస్‌కె ఆద్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యాధికారిణి సాధన, వైద్యులు విఠల్‌రావు వైద్య పరీక్షలు నిర్వహించి కావాల్సిన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫార్మాసిస్టు సౌమ్య, ఆరోగ్య కార్యకర్త సునిత, ప్రధానోపాధ్యాయురాలు సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

విద్యార్థులకు దుస్తుల పంపిణీ

  నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అచ్చంపేట జిల్లా ఉన్నత పాఠశాలలో ఏకరూప దుస్తులను విద్యార్థులకు అందజేశారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు సర్పంచ్‌ మణెమ్మ, ఎంఇవో బలిరాం రాథోడ్‌ దుస్తులు పంపిణీ చేశారు. బడి ఈడు పిల్లలను బడుల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేశ్‌, సాయిలు, తదితరులున్నారు.

Read More »

పల్స్‌పోలియో ర్యాలీ

  నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని 0-5 సంవత్సరాలలోపు చిన్నారులందరికి పల్స్‌పోలియో చుక్కలు వేయించాలని నిజాంసాగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు శనివారం ర్యాలీ నిర్వహించారు. నిజాంసాగర్‌ హైస్కూల్‌ నుంచి పాతబస్టాండ్‌, ఎంఇవో కార్యాలయం, పోలీసు స్టేషన్‌ మీదుగా ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా వైద్యురాలు స్పందన మాట్లాడుతూ 0-5 సంవత్సరాలలోపు చిన్నారులకు చుక్కల మందు వేయిస్తే అంగవైకల్యం రాకుండా ఉంటారని తెలిపారు. ఆదివారం జరగబోయే పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Read More »

ట్రాన్స్‌ఫార్మర్‌ మార్పిడి పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 28వ వార్డు ఆర్‌.కె.లాడ్జ్‌ రోడ్డులో ట్రాన్స్‌ఫార్మర్‌ మార్పిడి పనులను వార్డు కౌన్సిలర్‌ అరికెల ప్రభాకర్‌ యాదవ్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాన్స్‌ఫార్మర్‌ రోడ్డుపై ఉండడం వల్ల అటుగా వెళుతున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ట్రాఫిక్‌కు సైతం అంతరాయం ఏర్పడుతుందన్నారు. సమస్య తీర్చేందుకు తమ స్వంత డబ్బు రూ. 25 వేలు వెచ్చించి ట్రాన్స్‌ఫార్మర్‌ మరోచోటికి మార్చే పనులు చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో …

Read More »

ఇస్కాన్‌ పరీక్షలో జీవదాన్‌ విద్యార్థిని ప్రతిభ

  కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్నేషనల్‌ ఇస్కాన్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్యు ఎంపవర్‌మెంట్‌ కాంటెస్ట్‌లో కామారెడ్డి జీవదాన్‌ పాఠశాలకు చెందిన విద్యార్థిని ప్రతిభ కనబరిచారు. మోసర్ల భవితారెడ్డి రాష్ట్రస్థాయిలో నిర్వహించిన కాంటెస్టులో ప్రథమ ర్యాంకు సాధించినట్టు పాఠశాల ఫాదర్‌ జార్జ్‌ తెలిపారు. ఈ సందర్భంగా భవితారెడ్డికి ధృవీకరణ పత్రం అందజేశారు. దాంతోపాటు ఇస్కాన్‌ సంస్త పంపిన కృష్ణభగవాన్‌, భగవద్గీత పుస్తకాలు అందజేశారు. పాఠశాల యాజమాన్యం, అధ్యాపక బృందం విద్యార్థినిని అభినందించారు.

Read More »

చలివేంద్రం ప్రారంభం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని కొత్తబస్టాండ్‌ వద్ద శనివారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ప్రారంభించారు. రుద్ర ఆసుపత్రి, టెంజు కామారెడ్డి ఎలక్ట్రానిక్‌ మీడియా ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆసుపత్రి యాజమాన్యం శ్రీశైలం, డాక్టర్‌ శివ, టెంజు జిలా ఉపాధ్యక్షుడు అంజు, ప్రతినిదులు రాము, రాజు, కిసన్‌, శ్రీకాంత్‌, …

Read More »

దర్గా అభివృద్దికి కృషి చేస్తా

  – ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నందిపేట, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని నిజామాబాద్‌ రోడ్డుపక్కనగల సైలానిబాబా దర్గా అభివృద్ది కొరకు కృషి చేస్తామని ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. గత మూడురోజులుగా జరుగుతున్న ఉర్సు ఉత్సవాలు శనివారం ఉదయం 5 గంటల వరకు ఖవాలితో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. నందిపేట మతసామరస్యానికి నిదర్శనంగా కేదారేశ్వర ఆలయం పక్కనే దర్గా ఉందన్నారు. ప్రజలందరు కులమతాలకు అతీతంగా పండగ జరుపుకోవడం …

Read More »

సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం టేక్రియాల్‌ గ్రామంలో శనివారం సిసి రోడ్డు నిర్మాణ పనులను జడ్పిటిసి సభ్యుడు మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ నిధులు రూ. లక్షలతో రోడ్డు పనులు ప్రారంభించినట్టు తెలిపారు. గ్రామ వాసులు రోడ్డు సమస్యను తమ దృస్టికి తీసుకురాగా ఇందుకోసం ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ నిధులు కేటాయించినట్టు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నారాయణ, నాయకులు రవి పాటిల్‌, నిఖిల్‌రావు, సతీష్‌రెడ్డి, శంకర్‌రావు, రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »