Breaking News

Daily Archives: April 3, 2017

రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీల్లో పాల్గొన్న పేట్‌ సంగం విద్యార్థులు

  గాంధారి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం పేట్‌సంగం పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి జూనియర్‌ వాలీబాల్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలకు ఎంపిక అయ్యారు. మార్చి 31వ తేదీ నుండి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు ఖమ్మం జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్‌-18 జూనియర్‌ వాలీబాల్‌ చాంపియన్‌ సిప్‌ పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. పేట్‌సంగెం పాఠశాలకు చెందిన ప్రసాద్‌ బాలుర విభాగంలో పాల్గొనగా, మౌనిక, సోనియా, సౌమ్యలు బాలికల విభాగంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా …

Read More »

గాంధారిలో ప్రారంభమైన బడిబాట

  గాంధారి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో సోమవారం బడిబాట కార్యక్రమాన్ని ఎంఇవో సేవ్లానాయక్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల నుండ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఆచార్యజయశంకర్‌ పేరుతో ప్రారంభించిన బడిబాట కార్యక్రమం ఈనెల 13వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. మన పిల్లల్ని మన బడిలోచేర్పిద్దాం – మన బడిని కాపాడుకుందాం అనేనినాదంతో బడిబాట కార్యక్రమం కొనసాగుతుందన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని …

Read More »

ప్రజావాణిలో ఒకే ఫిర్యాదు

  గాంధారి,ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఒక వినతి పత్రం వచ్చినట్టు తహసీల్దార్‌ ఎస్‌.వి.లక్ష్మణ్‌ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఫిర్యాదులు, వినతులు వెంటనే పరిష్కరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎండివో సాయాగౌడ్‌, ఎంఇవో సేవ్లానాయక్‌, సర్వేయర్‌ నరేందర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య సౌకర్యం కోసం వినతి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జర్నలిస్టుల పిల్లలకు విద్యాసంస్థల్లో ఉచిత విద్య సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి విద్యాశాఖాధికారికి తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ (టిడబ్ల్యుజె) ప్రతినిదులు సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్య హక్కు చట్టం ప్రకారం విద్యాసంస్థల్లో 25 శాతం ఉచిత విద్య బోధించాలనే అంశంలో జర్నలిస్టుల పిల్లలకు చోటు దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ప్రయివేటు విద్యాసంస్తలకు ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో …

Read More »

డయల్‌ యువర్‌ ఎస్పీలో పది ఫిర్యాదులు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమంలో పది ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ కార్యాలయ సిబ్బంది తెలిపారు. కామారెడ్డి – 2, తాడ్వాయి -2, దేవునిపల్లి-1, గాంధారి-1, రామారెడ్డి-1, ఎల్లారెడ్డి-1, బిచ్కుంద -1, జుక్కల్‌ -1 ప్రజల నుంచి ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి సంబంధిత ఎస్‌హెచ్‌వోలకు కేసు వివరాలు తెలియపరచాలన్నారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని సూచించారు.

Read More »

యువకుని అదృశ్యం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రవీణ్‌ఫ్లెక్సీలో పనిచేస్తున్న భూమేశ్‌ (23) అనే యువకుడు ఈనెల 2వ తేదీ నుంచి కనిపించడం లేదని ఫిర్యాదు అందినట్టు కామారెడ్డి పట్టణ ఎస్‌ఐ శోభన్‌బాబు తెలిపారు. భవానిపేట గ్రామానికి చెందిన భూమేశ్‌ ఈనెల 2వ తేదీ నుంచి కనిపించడం లేదని భూమేశ్‌ తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు వివరించారు.

Read More »

గోదావరి జలాలనువిడుదల చేయాలని వినతి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి గత వారంరోజులుగా గోదావరి జలాల సరఫరా నిలిచిపోయిందని జలాల విడుదలకు చర్యలు తీసుకోవాలని సోమవారం ప్రజావాణిలో భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు జూలూరి సుధాకర్‌ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత వారంరోజులుగా గోదావరి జలాలు రాక నీటిపై ఆధారపడి ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సమస్య పరిష్కరించి జలాల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

Read More »

మహిళ అదృశ్యం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో పిఎంహెచ్‌ కాలనీకి చెందిన పి.సంధ్య (21) ఈనెల 2వ తేదీనుంచి కనిపించడం లేదని పిర్యాదు అందినట్టు పట్టణ ఎస్‌ఐ శోభన్‌బాబు తెలిపారు. సంధ్య తల్లి రాజమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు వివరించారు.

Read More »

వడదెబ్బపై ప్రజలకు అవగాహన

  కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎండ తీవ్రత అధికమవుతున్నందున ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో మాట్లాడారు. ఎండ తీవ్రత సాధారణ ఉష్ణోగ్రతల కన్న అదికంగా ఉందని అందునుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పిహెచ్‌సిలు, ప్రభుత్వ ఆసుపత్రులు, గ్రామ పంచాయతీలు, అంగన్‌వాడి కేంద్రాల్లో వడదెబ్బ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫ్లెక్సీలు ఏర్పాటు …

Read More »

ప్రజావాణిలో 52 ఫిర్యాదులు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 52 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ సిబ్బంది తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించి ఆయా గ్రామాల ప్రజల నుంచి ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. వాటిని సంబంధిత అధికారులకు కలెక్టర్‌ పంపినట్టు తెలిపారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి వాటి పరిస్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

Read More »