Breaking News

Daily Archives: April 4, 2017

సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్దం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో బుధవారం శ్రీరామనవమి వేడుకలు నిర్వహించేందుకు ఆలయాలు ముస్తాబవుతున్నాయి. పట్టణంలోని రైల్వేస్టేషన్‌లో గత 55 ఏళ్లుగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈయేడు 56వ సంవత్సర వేడుకలు వైభవంగా నిర్వహిచేందుకు రైల్వేస్టేషన్‌ శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ప్రతినిదులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 5వ తేదీ నుంచి 15 వరకు వేడుకలు నిర్వహించనున్నారు. బుధవారం సీతా, రామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామివారి విగ్రహాల ఊరేగింపు, ప్రతిష్టాపన చేయనున్నారు. అనంతరం కలశ స్థాపన, సహస్ర …

Read More »

కొనసాగుతున్న బడిబాట

  కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలో బడిబాట కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భాగంగా పట్టణంలోని సైలానిబాబా కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులను మంగళవారం కౌన్సిలర్‌ పద్మ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడిబాటలో భాగంగా బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి బడుల్లో చేర్పించాలని సూచించారు. విద్యార్థులను చిన్నప్పటినుంచే వెట్టికి గురిచేయకుండా వారికి చదువుచెప్పించి విజ్ఞులుగా మార్చాలని కోరారు.

Read More »

ఓటర్ల జాబితా సవరణకు సహకరించాలి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో నిర్వహించనున్న ఓటర్ల జాబితా సవరణకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రభుత్వ అధికారులకు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ చాంబర్‌లో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన ఆయా రాజకీయ పార్టీల నాయకులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన ఈనెల 20వ తేదీన ప్రకటించడం జరుగుతుందన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు ఈనెల …

Read More »

తెరాస కార్యకర్త కుటుంబానికి చెక్కు పంపిణీ

  కామారెడ్డి,ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన తెరాస కార్యకర్త మృతి చెందగా ఆయన కుటుంబానికి ఇన్సురెన్సు చెక్కును మంగళవారం కామరెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌అందజేశారు. 15వ వార్డుకు చెందిన నరేశ్‌ తెరాసలో సభ్యుడుగా ఉన్నారు. ఆయన మృతి చెందడంతో పార్టీ తరఫున విడుదలైన ఇన్సురెన్సు చెక్కు రూ. 2 లక్షలు మృతుని భార్య భవానికి అందజేశారు. కార్యక్రమంలో తెరాస నాయకుడు నిట్టు వేణుగోపాల్‌, కౌన్సిలర్లు సంగి మోహన్‌, ముప్పారపు ఆనంద్‌, పిట్లవేణుగోపాల్‌తదితరులు పాల్గొన్నారు.

Read More »

డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాల్లో సాందీపని ప్రభంజనం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాల్లో కామారెడ్డి సాందీపని కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి యూనివర్సిటీ స్థాయిలో అత్యధిక పాయింట్లు సాధించినట్టు ప్రిన్సిపాల్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. బికాం (సిఎ) విభాగంలో భావిని 10 కి 10 పాయింట్లు సాధించగా బి.కాం (కంప్యూటర్స్‌)లో సాయిప్రీతి 9 పాయింట్లు సాధించినట్టు తెలిపారు. వీరితోపాటు కె.మానస 9.69, వైష్ణవి 9.67, వేదశ్రీ 9.44, అఖిల 9.53 పాయింట్లు సాధించి యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్టు …

Read More »

గ్రామీణ ప్రాంత కళారూపం పెద్దమ్మ, పెద్దిరాజు ఆట

  గాంధారి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ ప్రాంతాల్లో నేటికి పాత సంస్కృతి, కళారూపాలు నాటకాల రూపంలో దర్శనమిస్తున్నాయి. ఇప్పటికి చాలా చిన్నచిన్న పల్లెల్లో గ్రామస్తులు సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేవిధంగా నాటకాలు ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు గ్రామ పెద్దల సహకారం ఉండడంతో యువకులు ముందుకొచ్చి వివిధ రకాల వేషధారణలతో ఆట పాటలతో అలరిస్తున్నారు. ఇందులో భాగమే పెద్దమ్మ పెద్దిరాజు ఆట. గాందారి మండలం సీతాయిపల్లి గ్రామంలో గత మూడురోజులుగా ప్రదర్శన కొనసాగుతుంది. ఇందుకోసం వారంరోజులనుంచి సన్నద్దమయ్యారు. గ్రామంలోని …

Read More »

శ్రీరామనవమికి ఆలయాలు ముస్తాబు

  గాంధారి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీరామనవమి సందర్బంగా గాంధారిమండలంలో ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మండలంలోని రామ్‌లక్ష్మణ్‌పల్లి ఆలయం, గౌరారంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయం, గాందారి హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేకంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. బుధవారం రామనవమి సందర్భంగా ఆయా ఆలయాలను విద్యుత్‌దీపాలు, రంగులతో, పూలతో చక్కగా అలంకరించారు. ఆలయకమిటీ సభ్యులు ఇప్పటికే స్వామివారి కళ్యాణ పీట సిద్దం చేశారు. స్వామివారి కళ్యాణోత్సవానికి మండల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.

Read More »

గాంధారిలో ఎక్సైజ్‌ దాడులు

  గాంధారి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం మాతుసంగం గ్రామ శివారులో పంట పొలాల్లో మంగళవారం ఎక్సైజ్‌ శాఖ అధికారులు దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా నాలుగు కేన్ల నాటుసారా స్వాధీనం చేసుకుని ఇద్దరువ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు ఎల్లారెడ్డి ఎక్సైజ్‌ సిఐ ఎఎల్‌ఎన్‌స్వామి తెలిపారు. పక్కా సమాచారం మేరకు పంటపొలాల్లో దాడులు చేపట్టగా 13 లీటర్ల నాటుసారా నిందితుల వద్ద దొరికిందని అదేవిధంగా 200 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసంచేసినట్టు ఆయన …

Read More »

సీతాయిపల్లిలో యోగా శిబిరం

  గాంధారి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం సీతాయిపల్లి గ్రామంలో మంగళవారం యోగా శిబిరం నిర్వహించారు. ముందుగా పతంతజలి యోగా పీఠం, హరిద్వార్‌ ఆధ్వర్యంలో గ్రామస్తులు గ్రామంలో యోగా ర్యాలీ నిర్వహించారు. అనంతరంయోగ సాధన వలన కలిగే లాభాలను యోగ గురూజీ రగ్జువీర్‌ గ్రామస్తులకు వివరించారు. ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా యోగా చేయాలన్నారు. ఈ సందర్భంగా మొదటిరోజు మంగళవారం సాయంత్రం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో ప్రాతకాలీన యోగా శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More »

చదువుతోనే సమాజంలో గౌరవం

  గాంధారి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చదువుకుంటేనే సమాజంలో గౌరవం ఉంటుందని గాంధారి జడ్పిటిసి తానాజీరావు అన్నారు. మంగళవారం గాంధారి మండల కేంద్రంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో స్వయంగా పాల్గొని బడి బయట పిల్లల తల్లిదండ్రులకు చదువు గురించి అవగాహన కల్పించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి ఉపాధ్యాయులతో వెళ్ళి చదువుపట్ల విద్యార్థులకు ఉన్న శ్రద్ద గురించి తల్లిదండ్రులకు వివరించి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా చూడాలన్నారు. హోటళ్ళు, వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న బాలకార్మికుల వివరాలు తెలుసుకుని వారిని …

Read More »