Breaking News

Daily Archives: April 5, 2017

జాగృతి ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహించారు. శ్రీరాంనగర్‌ కాలనీ హనుమాన్‌ ఆలయంలో జాగృతి జిల్లా కన్వీనర్‌ అనంతరాములు ఆద్వర్యంలో వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా భక్తులకు శ్రీరామనవమి విశిష్టతను గురించి వివరించారు. అందరికి శ్రీరాముడు ఆదర్శప్రాయుడని, యువకులు రాముని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం జాగృతి ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర ప్రసాదం వితరణ చేశారు. కార్యక్రమంలో జాగృతి ప్రతినిధులు వంశీకృష్ణ, చాట్లవేణుగోపాల్‌, నవీన్‌, …

Read More »

టోల్‌గేట్‌లోకి దూసుకొచ్చి బోల్తాపడిన లారీ

  – ఇద్దరికి గాయాలు కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్‌ గేటులోకి బుధవారం లారీ అదుపుతప్పి దూసుకొచ్చి బోల్తాపడింది. ఈ సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బుధవారం మధ్యాహ్నం టోల్‌గేటు వద్ద సిబ్బంది విధుల్లో భాగంగా వాహనాలు ఆపి టోల్‌ వసూలు చేస్తున్న సమయంలో ఓ లారీ అతివేగంగా రావడంతో అదుపు తప్పింది. డివైడర్‌లను, టోల్‌ గేటును ఢీకొంటూ టోల్‌గేటులోపలికి దూసుకొచ్చి బోల్తాపడింది. దీంతో అక్కడున్న సిబ్బంది, …

Read More »

ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శ్రీరామనవమి వేడుకలను వైభవంగా నిర్వహించారు.పట్టణంలోని ఆయా ఆలయాల్లో శ్రీరామనవమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని రామాలయం, రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళ్యాణోత్సవం, శ్రీసీతారామ ప్రసన్నాంజనేయస్వామి ఆలయాల్లో సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చక స్వాముల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. గంజ్‌ రామాలయ పూజల్లో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తోపాటు మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ …

Read More »

మనసు షార్ట్‌ ఫిల్మ్‌ షూటింగ్‌ ప్రారంభం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం మనసు షార్ట్‌ ఫిల్మ్‌ సన్నివేశం చిత్రీకరించారు. చిత్రబృందం సాందీపని జూనియర్‌, డిగ్రీ కళాశాలలో, శ్రీచండీమాత ఆలయం, ప్రియానంద ఆశ్రమం తదితర ప్రాంతాల్లో షూటింగ్‌ నిర్వహించారు. బృందావనం సమర్పణలో మనసు షార్ట్‌ ఫిల్మ్‌ నిర్వహిస్తున్నట్టు డైరెక్టర్‌ కొండల్‌రావు, ప్రొడ్యూసర్‌ తిరునగరి బ్రదర్స్‌ తెలిపారు. ప్రేమ పేరుతో యువత తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఈ నేపథ్యంలో షార్ట్‌ ఫిల్మ్‌ రూపొందిస్తున్నట్టు తెలిపారు.

Read More »

అంబలి కేంద్రం ప్రారంభం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో వినాయక్‌నగర్‌ ఆర్యవైశ్య సంఘం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలికేంద్రాన్ని ఆర్డీవో శ్రీనివాస్‌ బుధవారం ప్రారంభించారు. ప్రతియేడు వేసవి కాలంలో తమ సంఘం ఆధ్వర్యంలో అంబలి కేంద్రం నిర్వహిస్తున్నట్టు సంఘం అధ్యక్షుడు పాత దిగంబర్‌ తెలిపారు. డెయిలీ మార్కెట్‌కు వచ్చే వారి కోసం స్వచ్చందంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈయేడు సైతం అంబలి కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిదులు కైలాష్‌ శ్రీనివాస్‌రావు, లక్ష్మణ్‌రావు, కౌన్సిలర్లు నిమ్మ దామోదర్‌ …

Read More »

ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ప్రారంభం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వ్యవస్థను బుధవారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ప్రారంభించారు. పట్టణంలోని నిజాంసాగర్‌ చౌరస్తా, కొత్త బస్టాండ్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కామరెడ్డి జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో పట్టణాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ట్రాఫిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో రద్దీగా ఉండే కూడళ్లలో వీటిని …

Read More »

సీతారామలక్ష్మణుల విగ్రహాల ఊరేగింపు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిపట్టణంతోపాటు మండలంలో హనుమాన్‌ దీక్షా స్వాములు బుధవారం శ్రీరామ నవమిని పురస్కరించుకొని సీతారామలక్ష్మణ, ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలను అందంగా ముస్తాబుచేసి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు శోభాయాత్రను తిలకించేందుకు భారీగా తరలివచ్చారు. ఉత్సవ మూర్తులకు ప్రత్యేక హారతులిచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయాలకు తీసుకెళ్లి సీతారామ కళ్యాణోత్సవం నిర్వహించారు.

Read More »

ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

  బాన్సువాడ, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని బాన్సువాడ ప్రాంతంలో శ్రీరామ ఆలయాల్లో భక్తులు భక్తిశ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాన్సువాడలోని చారిత్రక ప్రధానమైన రామాలయంలో పెద్ద ఎత్తుననవమి వేడుకలునిర్వహించారు. ఈ సందర్బంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. హనుమాన్‌దీక్షా స్వాములు, భజరంగ్‌దళ్‌, ఇతర సంఘాల ఆద్వర్యంలో పట్టణంలో భారీ శోభాయాత్ర నిర్వహించారు. యువకులు విల్లంబులు, కత్తులు ధరించి నినాదాలు చేస్తు నృత్యాలు చేయడం అందరిని ఆకట్టుకుంది. రాముడు, హనుమంతుడు వేషధారణతో ఊరేగింపులో పాల్గొన్నారు. ప్రధాన రామాలయంతోపాటు …

Read More »

ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేస్తాం

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఇంటికి ట్యాంకర్‌ ద్వారా నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఏర్గట్ల సర్పంచ్‌ శ్రీవైష్ణవి అన్నారు. బుధవారం ఏర్గట్ల కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద నూతన ట్యాంకర్‌, ట్రాక్టర్‌ ట్రాలీకి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగా గ్రామపంచాయతీ తీర్మానం మేరకు ట్రాక్టర్‌ కొనుగోలు చేసి తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఉదయం, సాయంత్రం వెళల్లో నల్లాల …

Read More »

ఘనంగా జగ్జీవన్‌రామ్‌ జయంతి

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌లో బుధవారం బాబు జగ్జీవన్‌రాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మోర్తాడ్‌లో జగ్జీవన్‌రాం విగ్రహానికి సర్పంచ్‌, ఎంపిటిసిలు, అంబేడ్కర్‌ సంఘ సభ్యులు, దళిత సంఘ నాయకులు, ఆయాపార్టీల నాయకులు పూలమాలలువేసి నివాళులు అర్పించారు.

Read More »