Breaking News

మహిళపై లైంగికదాడి చేయబోయాడు..చివరికి దొరికిపోయి

దుబాయ్: నేపాల్‌కు చెందిన ఒక మహిళ(42) ఇటీవల దుబాయ్ వెళ్లింది. అక్కడ ఒక భారతీయుడి ఇంట్లో పనిమనిషిగా చేరింది. తన భర్త కూడా అక్కడికి దగ్గర్లోనే పనిచేస్తుంటాడు. వారికి ఆ భారతీయ యజమాని తన ఇంట్లోనే వారుండేందుకు ఒక గది కూడా ఇచ్చాడు. భర్త స్నేహితుడు అప్పుడప్పుడూ వారింటికి వచ్చి వెళ్లేవాడు. అతడు కూడా ఆ భారతీయ యజమాని ఆఫీసులో డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. అతడు కూడా నేపాల్‌కే చెందిన వ్యక్తి(29) కావడంతో అతడికి ఆమెతో పరిచయం ఏర్పడింది. యజమానిని ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అతడు రోజు ఇంటికి వచ్చేవాడు. భర్తకు కూడా అతడు బాగా తెలిసిన వ్యక్తి అయినందున ఆమె అతడితో మాట్లాడేది. అయితే ఆ చనువునే అతడు తప్పుగా అర్థం చేసుకున్నాడని ఆమె అంటోంది. ఒకరోజు ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో అతడు ఆమెకు ఫోన్ చేశాడు. ఇంటికి వస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు రావద్దని ఆమె అతడితో  చెప్పింది. కారు కడగాలని యజమాని తనతో చెప్పాడని, అందుకే వస్తున్నట్లు అతడు, ఆమెతో అన్నాడు. యజమాని కూడా ఇంట్లో లేరని పొద్దునే రమ్మని ఆమె అతడితో చెప్పింది.

కానీ, అతడు ఆమె మాటలను పట్టించుకోకుండా ఇంటికి వచ్చాడు. తర్వాత జరిగిన విషయాన్ని ఆమె పోలీసులకు వివరించింది. అతడు నేరుగా ఆమె గదిలోకి వచ్చాడని, అప్పటికే రాత్రి గం.11-30 అయిందని ఆమె తెలిపింది. రాగానే డోర్ లాక్ చేశాడని, తనపై లైంగిక దాడి చేయబోయాడని, తాను గట్టిగా అరవడంతో యజమాని కొడుకు, తన అరుపులు విని అక్కడికి వచ్చాడని చెప్పింది. వెంటనే ఆ వ్యక్తి అక్కడినుంచి పారిపోయాడంది. యజమాని కొడుకు తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడని తెలిపింది. యజమాని కొడుకు సహయంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పింది. సంఘటన జరిగిన రెండు రోజులకు పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, కోర్టులో హజరుపరిచారు. నేరం రుజువైనందున, కోర్టు అతడికి రెండురోజుల్లో శిక్ష ఖరారు చేయనుంది.

Check Also

రెండు ల‌క్షల‌ ఎకరాల‌కు సాగునీరు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్యాకేజీ 20 – 21 ద్వారా నాలుగు నియోజకవర్గాల‌లోని ...

Comment on the article