Breaking News

Daily Archives: April 6, 2017

గాంధారి కెజిబివిలో సమ్మర్‌ క్యాంపు

  గాంధారి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలకేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో గురువారం సమ్మర్‌క్యాంప్‌ ప్రారంభించారు. స్థానిక ఎంఇవో సేవ్లానాయక్‌, ఎండివో సాయాగౌడ్‌లు క్యాంపును ప్రారంభించారు. 21 రోజులపాటు క్యాంప్‌ కొనసాగుతుందని, బాలికలకు వివిద రకాల వస్తువుల తయారీ గురించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లా విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్‌ ఆద్వర్యంలో నిర్వహించే ఈ సమ్మర్‌ క్యాంప్‌లో బాలికలకు చదువుతోపాటు కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, శక్తి సామర్థ్యాల పెంపు, తదితర విషయాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో …

Read More »

ఒడ్డేపల్లిలో బడిబాట ర్యాలీ

  నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఒడ్డేపల్లి గ్రామంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లకార్డులు చేబూని బడి ఈడు పిల్లలను బడుల్లో చేర్పించాలని నినాదాలు చేస్తుర్యాలీ నిర్వహించారు. గ్రామాల్లోని 14 సంవత్సరాలలోపు పిల్లలు బడి బయట ఉండకుండా చూడాలని ఎంఇవో బలిరాం రాథోడ్‌ అన్నారు. బడి ఈడు పిల్లలను బడుల్లో చేర్పించేందుకు తెలంగాణ ప్రబుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. మూడు సంవత్సరాలు నిండిన చిన్నారులను అంగన్‌వాడి కేంద్రాల్లో చేర్పించుట, 5-6 సంవత్సరాలలోపు …

Read More »

ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవం

  గాంధారి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని నెహ్రూ చౌరస్తా వద్ద బిజెపి జెండా ఎగురవేశారు. బిజెపి ఏర్పడి 37 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మండల వ్యాప్తంగా పార్టీజెండాను బిజెపి నాయకులు ఆవిష్కరించారు. అనంతరంనాయకులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్రమోడి నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపడుతుందన్నారు. నల్లధనం వెలికి తీయడమే లక్ష్యంగా మోడి పనిచేస్తున్నారన్నారు. అనంతరం పేదలకు పండ్లు …

Read More »

తెరాసవైపు ప్రజల చూపు

  నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గ్రామాల్లోని ప్రజలు తెరాసవైపు చూస్తున్నారని తెరాస మండల అధ్యక్షుడు గైని విఠల్‌ అన్నారు. గ్రామాల్లో తెరాస కార్యవర్గం ఎన్నిక పూర్తిచేశారు. అనంతరంగ్రామ తెరాస పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో కమిటీలు వేసినట్టు తెలిపారు. గున్కుల్‌ అధ్యక్షునిగా చింతకింది కాశయ్య, నర్సింగ్‌రావుపల్లి – సుబ్బురి దేవయ్య, కోమలంచ – విఠల్‌, మాగి …

Read More »

పదవి కోసం పాకులాట

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండల స్థానిక తెరాస ప్రభుత్వం చేపడుతున్న గ్రామ కమిటీ ఎన్నికల్లో పార్టీ శ్రేణుల్లో పదవికోసం పాకులాట మొదలైంది. దీంతో గ్రామ కమిటీ ఎన్నిక వాయిదా తెరాస పార్టీ కార్యకర్తల్లో కలవరం రేపింది. మండల కేంద్రంలోని రైస్‌మిల్‌లో జరిగిన పార్టీ సమావేశం రసాభాసగా సాగింది. గురువారం నసురుల్లాబాద్‌ గ్రామ తెరాస పార్టీ ఒకదశలోరెండుగా చీలే స్థాయికి చేరుకుంది. పార్టీలోనే కొనసాగుతున్న అధ్యక్షుడే కావాలంటూ ఓ వర్గం తేల్చిచెప్పగా, మరో వర్గం కొత్తవారికి …

Read More »

సంగంలో బైండోవర్‌ కేసు నమోదు

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం గ్రామానికి చెందిన ఇస్లావత్‌సవితపై గురువారం తహసీల్‌ కార్యాలయంలో బైండోవర్‌ కేసు నమోదు చేసినట్టు ఎక్సైజ్‌ ఎస్‌ఐ నరేంద్రనాథ్‌ తెలిపారు. 2015 నుంచి సారాయి కాస్తున్న గిరిజన మహిళపై గతంలో కేసు నమోదుతో ఎక్సైజ్‌ కార్యాలయానికి తరలించారు.

Read More »

పాఠశాల తనిఖీ చేసిన ఎంఇవో

  నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మాగి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలను గురువారం ఎంఇవో బలిరాం రాథోడ్‌తనిఖీ చేశారు. పాఠశాలకు చెందిన 13 మంది విద్యార్థులు ఆదర్శపాఠశాలలో 6వ తరగతి ప్రవేశానికి పరీక్షలు రాస్తే 10 మంది ఎంపిక కావడంతో వారికి అభినందనలు తెలిపారు. అలాగే పాఠశాలలో వండిన ఆహారపదార్థాలను పరిశీలించారు. మెను ప్రకారం భోజనం, గుడ్లను అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

Read More »

అంగన్‌వాడి కేంద్రాల తనిఖీ

    నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కొనతాండా,నడిమి తాండా అంగన్‌వాడి కేంద్రాలను సూపర్‌వైజర్‌ శ్రీలత గురువారం తనిఖీ చేశారు. కేంద్రాల్లో టీచర్లు సమయ పాలన పాటించాలన్నారు. అనంతరం రిజిష్టర్లను పరిశీలించారు. చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని ప్రత్యక్షంగా తిని చూశారు.

Read More »