Breaking News

Daily Archives: April 7, 2017

మంచి అలవాట్లతో మానసిక కుంగుపాటు దూరం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంచి అలవాట్లను ఆచరిస్తే కుంగుబాటును దరిచేరనీయకుండా ప్రశాంత జీవనాన్ని కొనసాగించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వద్దనుంచి ఆయన ర్యాలీ ప్రారంభించారు. అనంతరం జరిగిన రోటరీ క్లబ్‌ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. కుంగుబాటును తగ్గించుకోవడం, సంతోషంగా ఉండడం గురించి కొన్ని విషయాలు వివరించారు. నేటి ఆధునికజీవన శైలిలో పెద్దల నుంచి పిల్లల వరకు కుంగుబాటుకు గురవుతున్నారని, తల్లిదండ్రులు, సమాజం …

Read More »

ఆశా వర్కర్లకు ప్రభుత్వం భృతి ప్రకటించడం హర్షణీయం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆశా వర్కర్లకు ప్రభుత్వం జీవనభృతి ప్రకటించడం పట్ల తెరాస కెవి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి అన్నారు. కామారెడ్డిజిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి ఆశావర్కర్ల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వాలు ఎన్ని ఆందోళనలు చేసినా ఆశా వర్కర్లను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఎన్నికల్లో పేర్కొన్నట్టుగా కెసిఆర్‌ అధికారంలోకి రాగానే ఆశా వర్కర్లకు భృతి కల్పించడం, ఆశా కార్యకర్తల్లో ఆనందాన్ని నింపిందన్నారు. అనంతరం జిల్లా కమిటీని …

Read More »

కామారెడ్డి జిల్లా ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రమాణస్వీకారం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ప్రబుత్వ వైద్యుల సంఘాన్ని ఇటీవల ఎన్నుకున్నారు. శుక్రవారం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన కమిటీ ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్షునిగా డాక్టర్‌ ఎన్‌.శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శిగా ఎ.వి. శ్రీనివాస్‌, కోశాధికారిగా రాజుగౌడ్‌, గౌరవాధ్యక్షునిగా శ్రీనివాస్‌ ప్రసాద్‌, విజయలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షులుగా రవిందర్‌గౌడ్‌, పుట్ట మల్లికార్జున్‌, సుజాత, జిసి సభ్యులుగా శివకుమార్‌, రవిందర్‌రెడ్డి, మౌనిక, సిఇసి సభ్యులుగా కిసోర్‌గౌడ్‌, సంయుక్తకార్యదర్శులుగా వెంకటేశ్వర్లు, …

Read More »

తెలంగాణ అంబేడ్కర్‌ సంఘం కార్యవర్గం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అంబేడ్కర్‌ యువజన సంఘం కామారెడ్డి పట్టణ కమిటీనిశుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా సంగి శ్రీనివాస్‌, ఉపాధ్యక్షునిగా సంగి శ్యాం, సాయి, సునీల్‌, ప్రధాన కార్యదర్శిగా కొత్తపల్లి శ్యాం, కోశాధికారులుగా శ్రావణ్‌,కిసోర్‌, సంయుక్త కార్యదర్శులుగా భానుచందర్‌, నర్సింలు, రాజు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా అశ్వంత్‌, నవీన్‌, విజయ్‌, తదితరులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రతినిదులు ఆకుల బాబు, కొత్తపల్లి మల్లయ్య, సంగి రాజలింగం, సంగి మోహన్‌,తదితరులు పాల్గొన్నారు.

Read More »

పెరుగుతున్న ఎండలు – అడుగంటుతున్న భూగర్భజలాలు

  – ఎండుతున్న నువ్వుపంట మోర్తాడ్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవిలో ఎండలు తీవ్రం కావడంతో భూగర్భజలాలు అడుగంటిపోయి బోర్లు ఎత్తిపోతు పంటలు ఎండిపోతున్నాయని మండలంలోని ఆయా గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రబీ సీజన్‌లో రైతులు బోరుబావులపై ఆధారపడి వరిపంట, నువ్వు పంట, ఇతర పంటలు సాగుచేసుకున్నామని రైతులు పేర్కొన్నారు. కాగా ఎండలు ఈసారి తీవ్రం కావడంతో బోర్లు ఎత్తిపోయి నువ్వు పంట ఎండిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read More »

తాళ్లరాంపూర్‌ తెరాస గ్రామ కమిటీ

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాళ్లరాంపూర్‌ గ్రామంలో శుక్రవారం తెరాస గ్రామ కమిటీని ఎన్నుకున్నట్టు జిల్లా తెరాస ఉపాద్యక్షుడు రాజా పూర్ణానందం, అంజిరెడ్డి తెలిపారు. అధ్యక్షునిగా భువనగిరి రమేశ్‌, ఉపాధ్యక్షునిగా గంగాధర్‌లను అందరి అభిప్రాయం మేరకు నియామక పత్రాలు అందజేసినట్టు వారు తెలిపారు. నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులు పార్టీ పటిష్టతకు కృసి చేయాలని సూచించారు.

Read More »

దుర్గంధంగా బస్‌డిపో స్థలం

  నందిపేట, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఆర్టీసి బస్‌డిపో స్థలం దుర్గందం వెదజల్లుతోంది. 20 సంవత్సరాల క్రితం బస్‌డిపో కోసం మండలంలోని అన్నిగ్రామాల ప్రజలు రేషన్‌ కార్డుల ప్రకారం విరాళాలు వసూలు చేసి భూమికొనుగోలు చేసి ఆర్టీసి అధికారులకు అప్పగించారు. ఆర్టీసివారు స్థలం చుట్టు ప్రహరీ నిర్మించి అప్పటి నుండి అలాగే వదిలేశారు. ఇప్పటివరకు డిపో ప్రారంభం కాకపోవడంతో భూమి వాడుకలో లేక దుర్గంధమయంగా మారింది. వ్యాపారులు అక్కడే చెత్త, చెదారం వేయడంతో డంపింగ్‌యార్డును తలపిస్తుంది. …

Read More »

పాఠశాల దత్తత తీసుకున్న పిఆర్‌టియు

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో పంచాయతీ రాజ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ తెలంగాణ ఆధ్వర్యంలో బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండల కమిటీలు ఆయా మండలాల్లో పాఠశాలను దత్తత తీసుకున్నారు. బీర్కూర్‌ మండలంలోని యుపిఎస్‌ బాలికల పాఠశాలను, నసురుల్లాబాద్‌ మండలంలోని మైలారం ప్రాథమిక పాఠశాలను దత్త త తీసుకున్నట్టు ఎంఇవో గోపాల్‌రావు తెలిపారు. ఆయా మండలాల్లో ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు పిఆర్‌టియు సంకల్పించిందని ఆయన అన్నారు. కార్యక్రమంలో మండల అభివృద్ది అధికారి భరత్‌కుమార్‌, పిఆర్‌టియు మండల అధ్యక్షుడు …

Read More »

రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామ శివారులోని దేవి విహార్‌ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. కామారెడ్డి మండలం అడ్లూర్‌ గ్రామానికి చెందిన నరేశ్‌ (25) అనే యువకుడు బైక్‌పై వెళుతుండగా దేవి విహార్‌ మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న టాటాఏస్‌ వాహనాన్ని ఢీకొన్నాడు. తీవ్ర గాయాలపాలైన నరేశ్‌ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తుజరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

Read More »

కోమలంచ గ్రామంలో బోనాల ప్రదర్శన

  నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఎల్లమ్మతల్లి బోనాల ప్రదర్శన అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ శివారులోగల ఎల్లమ్మతల్లి ఆలయం వద్దకు నిజాంసాగర్‌ మండల కేంద్రం నుంచి బ్యాండు మేళాలతో తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకున్నారు.

Read More »