Breaking News

Daily Archives: April 8, 2017

గర్భిణీలకు వ్యాధి నిరోధక టీకాలు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం లింగాపూర్‌ గ్రామ పంచాయతీ శివారులోని కల్కి నగర్‌లో శనివారం ఏఎన్‌ఎంలు గర్భిణీలకు, 0-5 సంవత్సరాల చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ప్రతి నెల రెండో శనివారం ఈ కార్యక్రమం కొనసాగుతుందని, గర్బిణీలు, చిన్నారుల తల్లిదండ్రులు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బాల్‌రాజు, ఉపసర్పంచ్‌ నర్సారెడ్డి, విఆర్వో సాయిలు, ఏఎన్‌ఎం హాసియా సుల్తానా, అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Read More »

ట్రస్మా విద్యాసదస్సుకు తరలిన ప్రతినిధులు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు పాఠశాలల యాజమాన్యల సంఘం ట్రస్మా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన విద్యాసదస్సుకు కామారెడ్డి జిల్లా ట్రస్మా ప్రతినిధులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఆనంద్‌రావు మాట్లాడుతూ సదస్సులో రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నికలతో పాటు ప్రయివేటు యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో తమదైన పాత్ర పోషించిన ప్రయివేటు విద్యాసంస్థలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయని, వీటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ప్రతినిధులు రాజశేఖర్‌రెడ్డి, రమేశ్‌, నరేశ్‌, …

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 24వ వార్డు హౌజింగ్‌ బోర్డు కాలనీలో శనివారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 3 లక్షలతో రోడ్డు పనులు చేపట్టినట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ రేణుక చంద్రశేఖర్‌, వార్డు వాసులు మంచు రవి, విఠల్‌, కిరణ్‌, రషీద్‌ ఖాన్‌, అంజయ్య, వసంత, తదితరులు పాల్గొన్నారు.

Read More »

పిఆర్‌టియు ఆధ్వర్యంలో ర్యాలీ

  నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మాగి గ్రామంలో పిఆర్‌టియు ఆధ్వర్యంలో బడిబాటలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాగి ప్రాథమికోన్నత పాఠశాలను దత్తత తీసుకొని పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని పిఆర్‌టియు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భాస్కర్‌గౌడ్‌, సంతోస్‌కుమార్‌ తెలిపారు. పాఠశాలలో ఫర్నీచర్‌ ఏర్పాటు, విద్యార్థులకు స్వచ్చమైన తాగునీరు, తదితర సౌకర్యాలు కల్పించడం, బడి బయట పిల్లలను బడుల్లో చేర్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఇవో బలిరాం రాతోడ్‌, ప్రధానోపాధ్యాయులు అమర్‌సింగ్‌, సురేందర్‌, …

Read More »

వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలు, కూలీలు వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని, ఈ మేరకు అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. శనివారం తహసీల్దార్లు, ఎంపిడివోలు, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయాధికారులు, సర్పంచ్‌లు, ఉపాధి సిబ్బందితో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అందరికి అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. జలనిధి ఏర్పాటు, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ పథకం, పాఠశాలల్లో మూత్రశాలల ఏర్పాటు, గ్రామాల్లో వైకుంఠ ధామాల …

Read More »

పేదలకు దుస్తులు, బియ్యం వితరణ

  కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాసవీ క్లబ్‌, వాసవీక్లబ్‌ వనిత కామారెడ్డి ఆధ్వర్యంలో శనివారం పేదలకు బియ్యం, దుస్తులు, చీరలు, లుంగీలు, పంపిణీ చేశారు. సుమారు 50 మందికి వీటిని వితరణ చేశారు. ఈ సందర్భంగా జోన్‌ ఛైర్మన్‌ ఎర్రం శ్రీనివాస్‌ మాట్లాడుతూ వాసవీ క్లబ్‌ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా నిరుపేదలకు నిత్యవసర సామగ్రితోపాటు దుస్తులు అందజేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షుడు ఆకుల నారాయణ, ప్రతినిధులు శ్రీనివాస్‌, సూర్యనారాయణ, మాధవి, …

Read More »

ఫిజియోథెరఫి శిబిరం

  నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా పాఠశాలల్లో చదువుతున్న వికలాంగ విద్యార్తులకు మండల వైద్యశాఖ కార్యాలయంలో ఫిజియో థెరఫి చికిత్స నిర్వహించారు. 16 మంది దివ్యాంగులకు వైద్యురాలు ప్రణీత చికిత్స చేసి, ఇంటి వద్ద చేయాల్సిన వ్యాయామం గురించి తల్లిదండ్రులకు వివరించారు. వ్యాయామం వల్ల వైకల్యం కొంత వరకు తగ్గించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఇవో బలిరాం రాథోడ్‌, ఐఆర్‌టిలు సునీల్‌, సాయిలు ఉన్నారు.

Read More »

వ్యక్తి అదృశ్యంపై ఫిర్యాదు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం గూడెం గ్రామానికి చెందిన తెడ్డు బాల్‌రాజు (45) అనే వ్యక్తి కనిపించడం లేదని కుటుంబీకులు ఫిర్యాదు చేసినట్టు దేవునిపల్లి ఎస్‌ఐ సంతోష్‌ తెలిపారు. బాల్‌రాజు ఈనెల 2వ తేదీన ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదని కుటుంబీకులు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు.

Read More »

ఆకట్టుకున్న కుస్తీ పోటీలు

  నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నర్వా గ్రామంలో శనివారం కుస్తీ పోటీలు ఘనంగా జరిగాయి. గ్రామంలోని మత్తడి పోచమ్మ జాతరలో భాగంగా నిర్వహించిన కుస్తీ పోటీల్లో కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలి వచ్చారు. ఉదయం 10 రూపాయలతో మొదలైన పోటీ రాత్రి వరకు కొనసాగింది. చివరకు పోటీలో గెలుపొందిన వారికి రూ. 1500 నగదు బహుకరించారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు నర్సింలు, సుదర్శన్‌ రావు, ప్రభాకర్‌, తదితరులున్నారు.

Read More »

ప్రజల దాహార్తి తీరుస్తున్న బాబు

  నందిపేట, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లక్షలు, కోట్ల రూపాయలు లేకున్నా ఉన్నంతలో ఎదుటివారికి సహాయం చేస్తేనే మానవ జన్మకు సార్థకమని నమ్మిన బాబు గత ఐదేళ్ళుగా వేసవిలో చలివేంద్రం ఏర్పాటు చేసి మండల ప్రజల దాహార్తి తీరుస్తున్నాడు. నందిపేటకు చెందిన షేక్‌బాబు తన సంపాదనలో కొంతమేర ప్రజాసేవకు కేటాయిస్తున్నాడు. తన తండ్రి వాహెద్‌ అలీ జ్ఞాపకార్థం చలివేంద్రంఏర్పాటు చేసి గత ఐదుసంవత్సరాలుగా బాటసారులు, ప్రయాణీకుల దాహార్తి తీరుస్తున్న బాబును పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రతి యేడు వేసవిలో చలివేంద్రం …

Read More »