Breaking News

Daily Archives: April 9, 2017

మత్స్య కార్మికుల వాహనాలు దళారుల పాలు…

  నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం మత్స్య కార్మికుల కోసం ఎంతో కృషి చేస్తుంది. కానీ మత్స్యకార్మికుల కోసం కేటాయించిన సబ్సిడీ వాహనాలు దళారుల వద్ద ఉండిపోవడంతో కార్మికులు ఎక్కడికైనా వెళ్లి చేపలు క్రయ, విక్రయాలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మత్స్యకార్మికులకు కేటాయించినవాహనాలు దళారుల వద్ద ఉండిపోవడంతో వారి స్వంత అవసరాలకు వాడుకుంటున్నారని అంటున్నారు. ప్రతిగ్రామంలో దళారులను నమ్మి మత్స్యకార్మికులుక మోసపోతున్నారు. అలాగే గ్రామాల్లోని చెరువులు, కుంటల్లోని చేపలను ఐదు సంవత్సరాల వరకు తమకే …

Read More »

కిరాణా వర్తక సంఘం కార్యదర్శికి సన్మానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కిరాణ వర్తక సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సుకుమార్‌ గౌడ్‌ను ఆదివారం కౌండిన్య సంక్షేమ సంఘం ప్రతినిదులు సన్మానించారు. సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ కౌండిన్య సంక్షేమ సంఘం సభ్యుడిగా ఉన్న సుకుమార్‌గౌడ్‌ కామారెడ్డి కిరాణ వర్తక, జనరల్‌మర్చంట్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు లక్ష్మినర్సాగౌడ్‌, సభ్యులు పాల్గొన్నారు.

Read More »

కామారెడ్డిలో చిన్నిచిన్ని ఆశలు సినీ హీరో సందడి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని దర్శన్‌ థియేటర్‌లో ఆదివారం చిన్నిచిన్ని ఆశలు నాలో రేగెనే… ప్రీమియం షో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రనటుడు చాక్లెట్‌ స్టార్‌ పవన్‌  కుటుంబసమేతంగా చిత్రాన్ని వీక్షించారు. ఆయనతోపాటు అభిమానులు, చిన్నారులు చిత్రాన్ని చూశారు. ఈ సందర్భంగా హీరోపవన్‌ మాట్లాడుతూ తాను కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందినవాడినన్నారు. సినిమా చాలా బాగా వచ్చిందని, తదుపరి సినిమా కూడా అభిమానులు ఇలాగే ఆదరించాలని అన్నారు.

Read More »

మైసమ్మ ఆలయంలో అన్నదానం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 5వ వార్డులోని మైసమ్మ ఆలయంలో ఆదివారం వార్డు కౌన్సిలర్‌ పద్మ రాంకుమార్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ మాట్లాడుతూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తుల కోసం అన్నదానకార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

Read More »

చేతివృత్తుల వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. కామరెడ్డి పట్టణంలో స్వర్ణ కాంప్లెక్స్‌ పై అంతస్తునుఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కుల వృత్తులపై ఆధారపడి బతుకుతున్న వారి కోసం ప్రభుత్వం మునుపెన్నడూ లేనివిధంగా తొలిసారి బడ్జెట్‌లో ప్రత్యేక నిదులు కేటాయించిందని తెలిపారు. గొల్ల, కురుమలు, యాదవులు, చేనేత కార్మికులు, ముదిరాజ్‌లు,గౌడ కులస్తులు …

Read More »

ఎన్‌ఎస్‌యుఐ ఆద్వర్యంలో అంబలి కేంద్రం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్‌ఎస్‌యుఐ ఆద్వర్యంలో ఆదివారం కామారెడ్డి పట్టణంలో అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలోని నిజాంసాగర్‌ రోడ్డుతోపాటు రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో అంబలి కేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు అంబలిని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో ప్రజలకు ఎండనుండి ఉపశమనం కల్పించేందుకు వారికి పోషకాహారాన్ని అందించడంలో భాగంగా అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేసి పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ఐరేని సందీప్‌, ప్రతినిదులు పాల్గొన్నారు.

Read More »

తిమ్మాపూర్‌ ప్రధానోపాద్యాయుడిపై డిఇవోకు ఫిర్యాదు

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన ప్రధానోపాధ్యాయుడు శంకర్‌పై జిల్లా విద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేసినట్టు ఎస్‌ఎంసి ఛైర్మన్‌ రాజుబాయి, కమిటీ సభ్యులు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభుత్వ గ్రాంట్ల దుర్వినియోగానికి పాల్పడ్డాడని, ఉత్తమ పాఠశాలను అధోగతి పాలు చేశాడని గత సోమవారం డిఇవోకు ఫిర్యాదు చేశారు. ఇంత వరకు ఎటువంటి స్పందన లేకపోవడంతో సోమవారం జిల్లా కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.

Read More »

బాధిత కుటుంబాలను పరామర్శించిన తెరాస నాయకులు

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పాలెం గ్రామానికిచెందిన గజ్జల కిషోర్‌, పెర్కి గంగారాం కుటుంబాలను తెరాస రాష్ట్ర నాయకుడు ముత్యాల సునీల్‌కుమార్‌ రెడ్డి ఆదివారం పరామర్శించారు. దళిత కుటుంబానికి కిషోర్‌ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన భార్యకు రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేశారు. పెర్కిట్‌ గంగారాం అనే రైతు మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు గంగారెడ్డి, లింగారెడ్డిలను పరామర్శించారు. ఆయన వెంట సంగం అనిల్‌, లింబాద్రి, సలీం, ఏనుగు సంతోష్‌, రాజన్న, దేవయ్య, …

Read More »

కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేద, ధనిక వర్గం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు కస్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని బాన్సువాడ ఆర్డీవో సోమ రాజేశ్వర్‌, సర్పంచ్‌ భూమేశ్వర్‌, ఎంపిటిసి పులి లత, రాజేశ్వర్‌, సీనియర్‌ సిటిజన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లయ్య అన్నారు. ఆదివారం మండలంలోని తిమ్మాపూర్‌ వెంకటేశ్వర ఆలయంపక్కనగల మండపంలో బాన్సువాడ ఆర్డీవో సోమ రాజేశ్వర్‌కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్వగ్రామానికి చెందిన రాజేశ్వర్‌ అంచెలంచెలుగా ఆర్డీవో స్థాయికి ఎదిగారని, మరిన్ని …

Read More »

అడుగంటిన నిజాంసాగర్‌

  నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగి పంటల కోసం నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ఐదు విడతలుగా నీటిని విడుదల చేస్తునే ఉన్నారు. యాసంగి పంటల సాగుకోసం అప్పట్లో నీటిని విడుదల చేశారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 1405 అడుగులు కాగా, డిసెంబరు 2016 నాటికి 1404.65 అడుగులు, 17.29 టిఎంసిల నీరు నిలువ ఉండడంతో డిసెంబరు 14వ తేదీ నుంచి మొదటి విడత అలా నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు నుంచి 2 లక్షల 8 …

Read More »