Breaking News

Daily Archives: April 10, 2017

బహిరంగ మలవిసర్జన రహిత వార్డుగా 28వ వార్డు ఎంపిక

  కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 28వ వార్డును బహిరంగ మలవిసర్జన రహిత వార్డుగా ఎంపిక చేసినట్టు కామారెడ్డి ఆర్డీవో, మునిసిపల్‌ ప్రత్యేక అధికారి శ్రీనివాస్‌ చెప్పారు. కామారెడ్డి ఎన్జీవోస్‌ కాలనీలోని సిఆర్‌సి భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 28వ వార్డును బహిరంగ మలవిసర్జన రహిత వార్డుగా ఎంపిక చేసి వార్డు కౌన్సిలర్‌ ప్రభాకర్‌కు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని 33 వార్డులను బహిరంగ మలవిసర్జన రహిత …

Read More »

గుడుంబా కేసు బాధితులకు ఆర్థిక సాయం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గతంలో గుడుంబా తయారుచేసి అరెస్టయి తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేయబడిన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వ్యక్తులకు ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం 01.01.2015 నుంచి 30.09.2016 లోగా కేసు రిజిస్ట్రేషన్‌ చేయబడి 01.10.2016 నుంచి ఎలాంటి కేసులు లేకుండా ఉన్న వ్యక్తులకు వందశాతం సబ్సిడీతో ఆర్థిక సాయం అందించనున్నట్టు కామారెడ్డి సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య అన్నారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం గుడుంబా కేసులో అరెస్టయిన కుటుంబసభ్యుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా …

Read More »

ఎవరెస్టు బృందంలో గాంధారి గురుకుల విద్యార్థి

  గాంధారి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే బృందంలో గాందారి గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థి ఎంపికయ్యాడు. స్థానికగిరిజన గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న నరేశ్‌ ఈయేడు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే బృందానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈనెల 13వ తేదీ నుండి డార్జిలింగ్‌లో జరిగే శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నట్టు పాఠశాల యాజమాన్యం తెలిపారు. మాలావత్‌ పూర్ణను ఆదర్శంగా తీసుకొని గాంధారి విద్యార్థి ఎన్నోరోజులుగా కఠోర సాదన చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈసంవత్సరం ఎవరెస్టు శిఖరం …

Read More »

ప్రజావాణిలో 55 ఫిర్యాదులు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాకలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 55 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించి ప్రజలు సమస్యల పరిస్కారం కోసం ఫిర్యాదులు చేసినట్టు పేర్కొన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన పిర్యాదులను సంబంధిత అధికారులకు జేసి సత్తయ్య వాటిని బదిలీ చేశారు. పిర్యాదులు పరిశీలించి సమస్యలు వెంటనే పరిష్కరించడం కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్వో మణిమాల ఆయా శాఖల అధికారులున్నారు.

Read More »

17 నుంచి తెలంగాణ స్టేట్‌ ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ స్టేట్‌ ఓపెన్‌ స్కూల్‌ ద్వారా నిర్వహించే 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ థియరీ పబ్లిక్‌ పరీక్షలను ఈనెల 17వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి మదన్‌మోహన్‌ తెలిపారు. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లు కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డిల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో ఉదయం 8.30 గంటల నుంచి 11.30 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఇంటర్‌ సైన్స్‌ విద్యార్తులకు మే 8వ తేదీ …

Read More »

డయల్‌ యువర్‌ ఎస్పీలో 6 ఫిర్యాదులు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఎస్పీలో 6 ఫిర్యాదులు అందినట్టు జిల్లా పోలీసుశాఖ సిబ్బంది తెలిపారు. కామారెడ్డి -2, తాడ్వాయి -2, రామారెడ్డి-2 ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి సంబంధిత ఎస్‌హెచ్‌వోలకు ఫిర్యాదులు వెంటనే పరిస్కరించాలని ఆదేశించినట్టు తెలిపారు.

Read More »

ప్రజావాణికి 2 ఫిర్యాదులు

  గాంధారి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి రెండు ఫిర్యాదులు వచ్చాయి. గ్రామానికి చెందిన ఇద్దరుతమకు సంబంధించిన భూముల సమస్యలను పరిష్కరించాలని ప్రజావాణిలో తహసీల్దార్‌ ఎస్‌.వి.లక్ష్మణ్‌కు ఫిర్యాదు చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ప్రజావాణిని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎండివో సాయాగౌడ్‌, ఏపివో నరేందర్‌, విద్యుత్‌ ఎ.ఇ. రవి, ఎపిఎం గంగరాజు, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారి అమూల్య తదితరులు పాల్గొన్నారు.

Read More »

విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ

  బీర్కూర్‌ ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని దుర్కి గ్రామంలో గల ఉన్నత పాఠశాలలో సర్పంచ్‌ ఏడే మోహన్‌ ఆధ్వర్యంలో సోమవారం ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాద్యాయుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తుందని, సోమవారం విద్యార్థులకు అందజేయడం జరిగిందని తెలిపారు. బడిబాట కార్యక్రమాన్ని గ్రామంలో సమర్థవంతంగా నిర్వహించామని, 9 మంది విద్యార్థులనుపాఠశాలల్లో చేర్పించినట్టు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

గాంధారిలో ఎస్సీ కమ్యూనిటీ భవనం ప్రారంభం

  గాంధారి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో సోమవారం ఎస్సీ కమ్యూనిటీ భవనాన్ని స్థానిక సర్పంచ్‌ సత్యం ప్రారంభించారు. స్థానిక హరిజన కాలనీలోని సంఘ సభ్యులు స్వంత నిధులతో కమ్యూనిటీ భవనం నిర్మించుకున్నారు. సంగంగా ఏర్పడి నెలనెల కొంత డబ్బు జమచేసి నిధిగా ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఆ నిధులతో స్వయంగా తామే కమ్యూనిటీ హాలును నిర్మించుకోగా దానిని సర్పంచ్‌ సత్యం గుమ్మడికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం సర్పంచ్‌ను సంఘ సభ్యులు సన్మానించారు.

Read More »

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

  గాంధారి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విపలమైందని ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి నల్లమడుగు సురేందర్‌ అన్నారు. సోమవారం గాంధారి మండలంలో తీవ్ర ఎండలతో ఎండిపోయిన మొక్కజొన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వేసవి కాలంలో బోరుబావులు ఎండిపోయి ఎండ తీవ్రతకు దెబ్బతిన్న పంటలను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎండిపోయిన పంటలకు గాను …

Read More »