Breaking News

Daily Archives: April 11, 2017

డిజిటల్‌ లావాదేవీలు ప్రోత్సహించాలి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్యాంకర్లు డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేవిధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో డిజిటల్‌లావాదేవీలపై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 14న అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని ప్రతి బ్యాంకర్‌ తమ శాఖ తరఫున కనీసం 10 మంది వ్యాపార వేత్తలకు ఆన్‌లైన్‌ లావాదేవీలు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్యాంకర్లు ఆధార్‌, బ్యాంకు అకౌంట్‌ ఫీడింగ్‌ జరిగేవిధంగా చర్యలు …

Read More »

భక్తిశ్రద్దలతో హనుమాన్‌ జయంతి వేడుకలు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో మంగళవారం హనుమాన్‌ జయంతి వేడుకలను ప్రజలు భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కోడూరు హనుమాన్‌ ఆలయం, ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం, సాయిబాబా ఆలయంతోపాటు ఆయా ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. సింధూరంతో ఆంజనేయస్వామిని అలంకరించారు. హనుమాన్‌ మాలధారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయాల వద్ద మహా అన్నదానం ఏర్పాటు చేశారు.

Read More »

హనుమాన్‌ జయంతి సందర్భంగా మజ్జిగ పంపిణీ

  కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో మంగళవారం హనుమాన్‌ జయంతి సందర్భంగా శోభాయాత్ర నిర్వహిస్తున్న నేపథ్యంలో పట్టణంలోని పలుచోట్ల మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పలువురు కౌన్సిలర్లు, నాయకులు వీటిని ఏర్పాటు చేసి బక్తులకు, ప్రజలకు, బైక్‌ ర్యాలీలో పాల్గొన్నవారికి పంపిణీ చేశారు.

Read More »

అట్టహాసంగా హనుమాన్‌ జయంతి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో మంగళవారం హనుమాన్‌ జయంతి వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. బిజెపి, విహెచ్‌పి, భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు. హనుమాన్‌, శ్రీరాముని భారీ విగ్రహాలను అందంగా అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథాలపై ఊరేగించారు. జైశ్రీరాం, జైహనుమాన్‌ నినాదాలతో పట్టణం మారుమోగింది. ఈ సందర్బంగా ప్రజలు మంగళహారతులు, పూలతో రథానికి స్వాగతం పలికారు. కోడూరు హనుమాన్‌ ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల గుండా …

Read More »

బతకాలని ఉంది… బతికించరూ…

  – కిడ్నీ బాధితుని మొర కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాకు బతకాలని ఉంది… బతికించండి అంటూ రెండు కిడ్నీలు విఫలమైన ఓ బాధితుడు కన్నీటి గాథ ఇది. మంచి విద్యనభ్యసించి కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలవాల్సిన ఆ యువకుడు విధి ఆడిన వింత నాటకంలో బలైపోయాడు. రెండు కిడ్నీలు చెడిపోవడంతో చిన్న వయసులోనే మంచానికి పరిమితమయ్యాడు. కుటుంబానికి పెద్ద దిక్కు అనుకున్న యువకుడు మంచాన పడడంతో ఆ కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. కామారెడ్డి జిల్లా …

Read More »

మళ్ళీ ఏర్పడ్డ నోట్ల కొరత

  నందిపేట, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నోట్లను రద్దుచేస్తు, నగదు చెల్లింపులపై ఆంక్షలు విధిస్తు కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాదాపు ఆరునెలలు గడుస్తున్నా ప్రజలు నోటు కష్టాలు తీరడం లేదు. బ్యాంకుల్లో నగదు దొరకదు, ఎటిఎంలో నోట్లు ఉండవు అన్నచందంగా తయారైంది పరిస్థితి. బ్యాంకుల్లో 10 నుంచి 20 వేలకు మించి డబ్బులు ఇవ్వడం లేదు. ఎటిఎంలో కనీస స్థాయిలో నగదు ఉంచడం లేదు. ఉంచినా కొద్దిసేపట్లోనే ఖాళీ అవుతుంది. నందిపేట మండలంలోని ఖుదావన్‌పూర్‌, డొంకేశ్వర్‌, నూత్‌పల్లి, ఆంధ్రానగర్‌, …

Read More »

కదనభేరి గోడప్రతుల ఆవిష్కరణ

  గాంధారి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తు నిర్వహించతలపెట్టిన కామారెడ్డి కదనభేరి గోడప్రతులను మంగళవారం గాంధారి మండల కేంద్రంలో ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సిపిఎస్‌ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన కామారెడ్డిలో కదనభేరి పేరుతో మహాసభ నిర్వహించనున్నారు. నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దుచేసి పాత పెన్సన్‌ విధానాన్నే కొనసాగించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం చేపడుతున్నారు. కదనభేరి కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల్లోని 2004 తర్వాత నియమితులైన …

Read More »

పలు గ్రామాల్లో జలనిధిపై కళాజాత

  గాంధారి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాందారి మండలంలో మంగళవారం జలనిధిపై కళాజాత కార్యక్రమం ఎండివో సాయాగౌడ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలంలోని నేరల్‌, నాగులూర్‌, చెద్మల్‌, దుర్గం గ్రామాల్లో జిల్లా కేంద్రం నుంచి వచ్చిన కళాకారులు జలనిధిపై కళాజాత నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. మొదటగా నేరల్‌ గ్రామానికి చేరుకున్న జలనిధి రథం గ్రామంలోని ప్రధాన కూడలిలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. కళాకారులు నీటిని ఏవిధంగా వాడుకోవాలో నాటక ప్రదర్శన రూపంలో ప్రజలకు వివరించారు. కళాజాత కార్యక్రమం …

Read More »

పందుల స్వైర విహారం అరికట్టండి

  నందిపేట, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో పందుల సంతతి రోజురోజు కు పెరిగిపోతుందని దాన్ని నివారించాలని ప్రజలు కోరుతున్నారు. చెత్త, చెదారం, మురికి నీరు ఉన్నచోట పందులు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామంలోని ప్రధాన కూడళ్ళలో చెత్త కుప్పలు రోజులతరబడి ఉండడంతో పందులు అక్కడ స్వైర విహారం చేస్తున్నాయి. దాంతో ఆ ప్రాంతంలో తీవ్ర దుర్గంధం వస్తుంది. పందులను అరికట్టాలని గ్రామ పాలకవర్గానికి, ప్రజావాణిలో అధికారులకు పలుమార్లు ప్రజలు విన్నవించినా సమస్య పరిష్కారం కావడం …

Read More »

బడిబాటలో బూర్గుల్‌ పాఠశాల సక్సెస్‌

  గాంధారి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడిబాట కార్యక్రమంలో బడి బయట పిల్లలు పాఠశాలలో చేర్పించే విధంగా బూర్గుల్‌ పాఠశాల ఉపాధ్యాయులు విజయవంతమయ్యారు. మండలంలోని బూర్గుల్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణారావ్‌, ఉపాధ్యాయులు బూర్గుల్‌ గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో గత వారంరోజులుగా బడిబాట కార్యక్రమం చేపడుతున్నారు. ఇంటింటికి వెళ్ళి బడిబయట పిల్లల తల్లిదండ్రులకు చదువుకుంటే కలిగే లాభాల గురించి వివరించారు. బడి ఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. వీరి కృషి వల్ల పాఠశాల …

Read More »