Daily Archives: April 12, 2017

ధర్మయుద్దం గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల 18న విద్యార్థి సంఘాల జేఏసి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్మయుద్దం కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను బుధవారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈసందర్బంగా విద్యార్థి జేఏసి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యావ్యతిరేక విధానాలు, దానికి వ్యతిరేకంగా పోరాటం, ఉద్యోగాలు తదితర అంశాలపై దర్మయుద్దం సభలో చర్చిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో పేర్కొన్న విధంగా ఉద్యోగాలను భర్తీచేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జేఏసి ప్రతినిదులు బాలు, సందీప్‌, భాను, లక్ష్మణ్‌, …

Read More »

ఘనంగా గజ్జలమ్మ జాతర

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో బుధవారం గ్రామ సర్పంచ్‌ నర్సయ్య ఆద్వర్యంలో గజ్జలమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. బుధవారం ఎడ్లబండ్ల ఊరేగింపు, రథోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. గురువారం కుస్తీ పోటీలు ఏర్పాటుచేసినట్టు గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు.

Read More »

సైకిల్‌యాత్రికునికి ఎంపి ప్రశంసా

  కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు సైకిల్‌ యాత్ర చేస్తున్న రవికిరణ్‌ను బుధవారం జహీరాబాద్‌ ఎంపి బి.బి.పాటిల్‌ అభినందించారు. నిజామాబాద్‌ జిల్లా వర్నికి చెందిన బడ్డోల రవికిరణ్‌ జనవరి 6వ తేదీ నుంచి కన్యాకుమార్‌ నుంచి కాశ్మీర్‌ వరకు సైకిల్‌ యాత్ర చేపట్టాడు. రైడ్‌ ఫర్‌ గ్రీన్‌ పేరిట సైకిల్‌ యాత్ర చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్బంగా ఎంపిని కలిసిన రవికిరణ్‌ను అభినందించారు. పచ్చదనం కోసం రవికిరణ్‌ చేపడుతున్న యాత్ర ప్రశంసనీయమని …

Read More »

ఎండదెబ్బతో ఉపాధి కూలీ మృతి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమారిపేట గ్రామంలో బుధవారం ఎండదెబ్బతో ఉపాధి కూలీ మృతి చెందాడు. గ్రామంలో ఉపాధి హామీ కూలీపనిచేస్తుండగా వడదెబ్బ తగిలి రాపర్తి నారాయణ (60) మృతి చెందాడు. పనుల వద్ద టెంట్లు ఏర్పాటు చేయకపోవడం, తాగునీటి వసతి లేకపోవడంతో నారాయణ మృతి చెందినట్టు ఉపాధి కూలీలు ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే నారాయణ మృతి చెందాడని ఆరోపించారు. ఉపాధి కూలీలకు సరైనవసతులు కల్పించకపోవడం అన్యాయమని ఆగ్రహం …

Read More »

బడిపిల్లలకు నోటుపుస్తకాల పంపిణీ

  గాంధారి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడిబాట ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన పిల్లలకు నోటుపుస్తకాలను గాంధారి ఎంఇవో సేవ్లానాయక్‌ అందజేశారు. బుధవారం మండలంలోని తిప్పారం గ్రామంలో బడిబాట నిర్వహించారు. ఈ సందర్బంగా బడిబయట పిల్లలు పాఠశాలల్లో చేరితే వారికి ఉచితంగా పుస్తకాలతోపాటు నోటుపుస్తకాలు అందజేస్తామని పాఠశాల ఉపాధ్యాయులు ముందుకువచ్చారు. దీంతో గ్రామంలోని బడిబయట పిల్లలు చాలామంది ప్రభుత్వ పాఠశాలలో చేరారు. దీంతో బడిలో చేరిన పిల్లలకు నోటుపుస్తకాలు అందజేశారు. బడిబయట పిల్లలను బడుల్లో చేర్పించడానికి పాఠశాల ఉపాధ్యాయులు …

Read More »

ఉపాధి హామీ పనుల పరిశీలన

  గాంధారి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను కామారెడ్డి జిల్లా డ్వామా పిడి చంద్రమోహన్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని తిమ్మాపూర్‌లో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. ఎండాకాలం సందర్భంగా ఉదయమే పనులు చేయాలని, మధ్యాహ్న సమయంలో పనులు చేయకూడదని సూచించారు. ప్రతి జాబ్‌కార్డు దారునికి పని కల్పించడం జరుగుతుందన్నారు. కూలీలు జాగ్రత్తగా వుండాలన్నారు. వేసవి కాలం సందర్భంగా కూలీలకు టెంట్‌లను అందిస్తామన్నారు. కూలీలకు తాగునీటి వసతి కల్పించాలని అధికారులకు …

Read More »

నీటిని పొదుపుగా వాడుకోవాలి

  గాంధారి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి కాలంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని గ్రామస్తులకు కళాజాత ద్వారా వివరిస్తున్నారు. జలనిధి పేరుతో గాంధారి మండలంలోని గౌరారం, ముదెల్లి, వెంకటాపూర్‌ తదితర గ్రామాల్లో బుధవారం కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నీటిని ఏవిధంగా వాడుకోవాలో ప్రజలకు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వివరించారు. నీటిని ఎంత పొదుపుగా వాడుకుంటే వేసవి కాలంలో నీటి సమస్య వుండదన్నారు. కార్యక్రమంలో ఎపివో నరేందర్‌, కళాకారులు రాము, మహేందర్‌, కాశీరాం, నర్సయ్య, సవిత, గ్రామస్తులు …

Read More »

వేసవికాలం నీటిఎద్దడిపై దృష్టిసారించాలి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి కాలం దృష్ట్యా కామారెడ్డి పట్టణంలో ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని జిల్లాకలెక్టర్‌ సత్యనారాయణ మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో మునిసిపల్‌ కమీషనర్‌, అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో అవసరమైన చోట్ల మునిసిపల్‌ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. అన్ని వార్డుల్లో ప్రతినిత్యం చెత్తను ఎత్తి చెత్త రహితంగా తీర్చిదిద్దాలన్నారు. ఆన్‌లైన్‌లో భవన నిర్మాణం కోసం …

Read More »

జయంతికి ముస్తాబైన అంబేడ్కర్‌ విగ్రహం

  నందిపేట, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఏప్రిల్‌ 14న జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి నందిపేట మాలసంఘం సభ్యులు పరిసరాలను శుభ్రం చేసి ముస్తాబు చేశారు. కులసంఘ సభ్యులు ఇంటికొక్కరు చొప్పున వచ్చి మండుటెండల్లో శ్రమదానం చేసి అంబేడ్కర్‌ విగ్రహ పరిసరాలను శుభ్రం చేశారు. పిచ్చిమొక్కలను తొలగించారు. చెత్త, చెదారం ఊడ్చేసి ట్రాక్టర్‌ ద్వారా మట్టి నింపి చదునుచేశారు. విగ్రహ ప్రాంతం చుట్టు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. …

Read More »

గల్ప్‌లో గుండెపోటుతో తొర్తివాసి మృతి

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తొర్తి గ్రామానికి చెందిన మారోర నర్సయ్య అనే వ్యక్తి గత వారంరోజుల క్రితం గల్ప్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. అక్కడి స్నేహితులు, బంధువుల సహకారంతో నర్సయ్య మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరుకుంది. కాగా అంత్యక్రియలు నిర్వహించారు. గత ఆరునెలలుగా మస్కట్‌లో నర్సయ్య పనిచేస్తున్న కంపెనీ యజమాని వేతనాలు అందించకపోవడంతో ఆందోళనకు గురై గుండెపోటుతో మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. కాగా నర్సయ్య రెండేళ్ళ క్రితం మస్కట్‌కు బతుకుదెరువు కోసం వెళ్లాడు. …

Read More »