Breaking News

Daily Archives: April 13, 2017

రైతులకు అండగా నిలిచి వ్యవసాయాన్ని ప్రోత్సహించేతెలంగాణ తొలి ముఖ్యమంత్రి

  రైతులకు అండగా నిలిచి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రకటీంచిన చారిత్రాత్మక వ్యవసాయ విధానాల పట్ల తెలంగాణ జాగృతి అనుబంధ విభాగం రైతు జాగృతి హర్షం వ్యక్తం చేసింది. దశాబ్దాల తరబడి కునారిల్లిన తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి గారి నిర్ణయం పెద్ద ఊరటనిచ్చిందని, భవిష్యత్తుపై ఆశలు చిగురింప చేసిందని తెలంగాణ జాగృతి రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ కే.ఎల్.ఎన్ రావు, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి ఊపాధ్యక్షులు మేడె రాజీవ్ …

Read More »

పెండింగ్‌లోవున్న సాదాబైనామాలపై మరోసారి విచారణ

  గాంధారి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కుటుంబంలో గొడవలవల్ల, రికార్డులు సరిగాలేని కారణంగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామాల దరఖాస్తులను మరోసారివిచారణ చేయనున్నట్టు ఎల్లారెడ్డి ఆర్డీవో దేవేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం గాంధారి మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సాదాబైనామా దరఖాస్తుల విచారణ దాదాపు పూర్తయిందన్నారు. కొన్ని కారణాల వల్ల తక్కువ సంఖ్యలో పెండింగ్‌లో వున్నాయని తెలిపారు. కుటుంబంలోని గొడవలవల్ల నిలిచిపోయిన దరఖాస్తులను ఇరువర్గాల వారిని పిలిచి సామరస్యంగా రాజీ కుదిర్చి వాటిని కూడా పూర్తిచేస్తామన్నారు. రెవెన్యూ రికార్డులలో …

Read More »

మహిళ అదృశ్యం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన చింతల భాగ్య (26) కనిపించడం లేదని ఆమె కుటుంబీకులు ఫిర్యాదు చేసినట్టు పట్టణ ఎస్‌ఐ శోబన్‌బాబు తెలిపారు. ఈనెల 9వ తేదీ నుంచి ఆమె కనిపించడం లేదని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి విచారిస్తున్నట్టు తెలిపారు.

Read More »

సైన్యసేన ఆద్వర్యంలో రూ. 10 లకే భోజనం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సైన్యసేన ఆద్వర్యంలో రూ. 10 కేభోజనం అందిస్తున్నారు. ఈ సందర్భంగా సేన ప్రతినిధులు కోనేరు ప్రశాంత్‌ మాట్లాడుతూ నిరుపేదలు, ఆసుపత్రికి వచ్చే రోగుల కుటుంబీకుల కోసం రూ. 10 కే ప్రతిరోజు భోజనం అందిస్తున్నట్టు తెలిపారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు భోజనం అందిస్తామని ఈసేవలను నిరుపేదలు వినియోగించుకోవాలని సూచించారు.

Read More »

కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉచితంగా రైతులకు ఎరువులు సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్‌ గురువారం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తు కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెరాస నాయకులు కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇదివరకే రైతు రుణమాఫీ చేసిన కెసిఆర్‌ గురువారం జరిగిన జనహిత కార్యక్రమంలో రైతులకు ఉచితంగా ఎరువుల సరఫరాతోపాటు వచ్చే ఆర్థిక ఎడాది నుంచి 24 లక్షల నుంచి 26 లక్షల టన్నుల వరకు రైతులకు …

Read More »

గాంధారిలో గంజాయి పట్టివేత

    గాంధారి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలో గురువారం ఉదయం గంజాయిని కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు గంజాయి నిందితులను, కారును పోలీసులు విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. సదాశివనగర్‌ సిఐ శ్రీశైలం కథనం ప్రకారం… బుధవారం రాత్రి గాంధారి ఎస్‌ఐ రాజేశ్‌ పోలీసులతో కలిసి మండల కేంద్రంలో పెట్రోలింగ్‌ నిర్వహించారు. గురువారం వేకువజామున 5 గంటలకు హైస్కూల్‌ ఎదుట చద్మల్‌ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇండికా కారు ఎపి 25 …

Read More »

హోటళ్లపై ఎన్‌ఫోర్సుమెంట్‌ దాడులు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లపై గురువారం ఎన్‌ఫోర్సుమెంట్‌ శాఖాధికారులు ఆకస్మిక దాడులు చేశారు.హోటళ్లలో నిబంధనలకు వ్యతిరేకంగా గృహ వినియోగ సిలిండర్లను వాడుతున్నారనే సమాచారంతో దాడులు చేశారు. ఈ సందర్భంగా 5 హోటళ్లపై కేసులు నమోదు చేసి నిబందనలకు విరుద్దంగా వినియోగిస్తున్న 11గృహ వినియోగ గ్యాస్‌సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.

Read More »

జాతీయపక్షి అధికారులకు అప్పగింత

  కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా అడ్లూర్‌ శివారులో నీటికోసం గ్రామంలోకి వచ్చిన జాతీయపక్షి నెమలిని గ్రామస్తులు గమనించి అధికారులకు అప్పగించారు. గురువారం అడ్లూర్‌ శివారులోని పౌల్ట్రీఫాంలోకి నీటికోసం నెమలి వచ్చింది. గమనించిన గ్రామస్తులు దాన్ని పట్టుకొని సురక్షితంగా అటవీశాకాధికారులకు అప్పగించారు.

Read More »

పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించాలి

  – వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్‌ డాక్టర్‌ వాకటి కరుణ కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది సేవలందించాలని వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్‌ డాక్టర్‌ వాకటి కరుణ అన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో గురువారం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా ఆసుపత్రిల వారిగా పిహెచ్‌సి, సబ్‌సెంటర్ల పనితీరు విధానాన్ని ప్రస్తావించారు. పనివిధానం మెరుగుపరుచుకునేందుకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర …

Read More »

ధాన్యం దళారుల పాలు చేయొద్దు

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరుగాలం కష్టించిన రైతు ధాన్యాన్ని దళారుల పాలు చేసి నష్టపోకూడదని బీర్కూర్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పెరిక శ్రీనివాస్‌ అన్నారు. మండల కేంద్రంలోని బీర్కూర్‌ మార్కెట్‌ కమిటీలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీవో రాజేశ్వర్‌ ఆధ్వర్యంలో ప్రారంభించారు. వరి ధాన్యానికి ప్రభుత్వం సరైన మద్దతు ధర అందిస్తుందని, దళారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోవద్దని ఆర్డీవో అన్నారు. సన్నరకం ధాన్యానికి రూ. 1470, దొడ్డు రకం ధాన్యానికి రూ. 1510 …

Read More »