Breaking News

Daily Archives: April 14, 2017

అర్హులైన దళితులందరికి భూపంపిణీ

  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో అర్హులైన దళితులందరికి మూడెకరాల చొప్పున భూపంపిణీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో భూమి కేటాయించిన లబ్దిదారులకు భూపంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన దళితులందరికి భూపంపిణీ చేస్తున్నామన్నారు. స్థలాన్ని గుర్తించి, కొనుగోలు చేసి విడతల వారిగా అర్హులందరికి భూపంపినీ చేస్తామని పేర్కొన్నారు. …

Read More »

అంబేడ్కర్‌ చూపిన బాటలో నడవాలి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని వక్తలు పేర్కొన్నారు. అంబేడ్కర్‌ 126వ జయంతి వేడుకలను కలెక్టరేట్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. అంతకుముందు రైల్వే కమాన్‌ వద్దగల అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్‌, జహీరాబాద్‌ ఎంపి బి.బి.పాటిల్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌, ఎస్‌పి శ్వేతారెడ్డి, ఐడిసిఎంఎస్‌ ఛైర్మన్‌ ముజీబుద్దీన్‌ తదితరులు …

Read More »

ఘనంగా అంబేడ్కర్‌ జయంతి వేడుకలు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శుక్రవారం రాజ్యాంగ నిర్మాత, డాక్టర్‌ అంబేడ్కర్‌ 126వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రజాసంఘాలు, విద్యార్థి, ఉపాధ్యాయ, కుల సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా అంబేడ్కర్‌ చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. రాజ్యాంగంలో బడుగు, బలహీన వర్గాల కోసం రిజర్వేషన్లు తెచ్చి వారికి హక్కులు కల్పించారన్నారు. తద్వారా రిజర్వేషన్లు పొందగలుగుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నేతలు, కుల …

Read More »

20 నుంచి కామారెడ్డి క్రికెట్‌ టోర్నీ

  కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని టిటిడి కళ్యాణ మండపం సమీపంలోగల మైదానంలో ఈనెల 20వ తేదీ నుంచి పాషా అండ్‌ బ్రదర్స్‌ క్రికెట్‌ టోర్ని నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు షేక్‌ ఫిర్దోస్‌, మహ్మద్‌ సలీం, పాషా లు మాట్లాడుతూ ఈనెల 19వ తేదీలోగా టోర్నిలో పాల్గొనదలిచే జట్లు తమపేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. విజేతకు 4 వేల నగదు, జ్ఞాపిక, రన్నర్‌గా నిలిచిన వారికి రూ. 2 వేల నగదు, …

Read More »

గాంధారిలో అంబేడ్కర్‌ జయంతి వేడుకలు

  గాంధారి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో భారతరత్న బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని తిప్పారం, బూర్గుల్‌, గండివేట్‌, గౌరారం, ముదెల్లి, సర్వాపూర్‌, పోతంగల్‌, పెట్‌సంగం, మాతుసంగం, గుర్జాల్‌ తదితర గ్రామాల్లో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. మండల కేంద్రంలో అంబేడ్కర్‌ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మండల కేంద్రంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్‌ …

Read More »

అంబేడ్కర్‌ జయంతిలో పంచాయతీ పాలకవర్గం

  గాంధారి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి గ్రామ పంచాయతీ పాలకవర్గం అంబేడ్కర్‌ జయంతి వేడుకలను జరుపుకున్నారు. గాంధారి పాలకవర్గం సభ్యులు గత వారంరోజుల క్రితం విహార యాత్రకు వెళ్లారు. ఈ సందర్భంగా విహార యాత్రలో ఉండగా శుక్రవారం అంబేడ్కర్‌ జయంతి రావడంతో మార్గమధ్యంలో అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. షాద్‌నగర్‌ వద్ద బాబాసాహెబ్‌ డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి గాందారి సర్పంచ్‌ సత్యం, ఉపసర్పంచ్‌ ఆకుల శ్రీదర్‌లు పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా సర్పంచ్‌ సత్యం మాట్లాడారు. దళితుల …

Read More »

పెళ్లికి చేయూత అందించిన ఎమ్మెల్యే

  నందిపేట, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దత్తాపూర్‌ గ్రామానికి చెందిన్‌ బాల్‌రాజ్‌ కూతురు వివాహం కోసం ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి 30 వేల నగదు అందజేశారు. శుక్రవారం పెళ్లి కూతురు ఇంటికెళ్లి ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లను పేద కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.

Read More »

తెలంగాణ సర్కార్‌ రైతు ప్రభుత్వం

  నందిపేట, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. మండలంలో శుక్రవారం పర్యటించిన ఎమ్మెల్యే డొంకేశ్వర్‌ గ్రామంలోని ఆంజనేయస్వామి, లక్ష్మినర్సింహస్వామి ఆలయాలను ప్రారంభోత్సవం చేశారు. అనంతరం పిఏసిఎస్‌ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీలో గ్రామీణ అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జలనిధి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. పారిశుద్యం, పరిశుభ్రత కొరకు వ్యక్తిగత …

Read More »

అంబేడ్కర్‌ ఆశయాలను కొనసాగించాలి

  – ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నందిపేట, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌అంబేడ్కర్‌ ఆశయాలను కొనసాగించాలని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం మండల కేంద్రంలోగల అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు వర్గాల ప్రజలకు అంబేడ్కర్‌ ఎంతో కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. అలాగే నందిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో అంబేడ్కర్‌ …

Read More »

ఘనంగా అంబేడ్కర్‌ జయంతి

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ జయంతిని బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లోని ఆయా గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఆయా గ్రామాల్లోని అంబేడ్కర్‌ విగ్రహాలకు దళిత సంఘాలు, యువజన సంఘాలు, ఆయా పార్టీల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేడ్కర్‌ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. మిర్జాపూర్‌లో ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అలాగే కస్తూర్బా పాఠశాలల్లో తహసీల్దార్‌ కృష్ణానాయక్‌ …

Read More »