Breaking News

Daily Archives: April 15, 2017

మండలంలో గ్రామసభలు

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాకలెక్టర్‌ ఆదేశాల మేరకు మండలంలోని మోర్తాడ్‌, ధర్మోరా, ఏర్గట్ల పలు గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామసభలు శనివారం నిర్వహించారు. ఇందులో గ్రామాల్లో చేపట్టిన పనులను, చేయబోయే పనులను కార్యదర్శులు చదివి వినిపించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు మాట్లాడుతూ ఇజిఎస్‌ కింద మరుగుదొడ్లు, అంగన్‌వాడి భవనాలు, సిసి రోడ్లు, జిపి భవనాలు నిర్మించుకోవాలని, అందుకు ఎమ్మెల్యే కూడా సిద్దంగా ఉన్నారని వారు తెలిపారు. ఉపాధి హామీలో కూలీల సంఖ్య పెంచి …

Read More »

అంబలి కేంద్రం ప్రారంభం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ శివారులోని సిరిసిల్లా రోడ్డులో శనివారం అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. బాలయ్య రైస్‌మిల్‌ వద్ద బాలయ్య తండ్రి జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన అంబలి కేంద్రాన్ని మాజీ మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ కైలాష్‌ శ్రీనివాస్‌రావు ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆర్యవైశ్య ప్రతినిదులు మాట్లాడుతూత వేసవి నేపథ్యంలో ప్రయాణీకుల దప్పిక తీర్చేందుకు ప్రతియేడు అంబలి కేంద్రం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ఛైర్మన్‌ గౌరీశంకర్‌, మాజీ కౌన్సిలర్‌ హరిధర్‌, ఆర్యవైశ్య ప్రతినిధులు పాల్గొన్నారు.

Read More »

ఆదివారం పట్టణ పద్మశాలి సర్వసభ్య సమావేశం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్టు సంఘం ప్రతినిధులు తెలిపారు. పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటున్న నేపథ్యంలో సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సమావేశంలో నూతన కార్యవర్గంలో పదవుల సంఖ్య, పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర విషయాలపై చర్చిస్తామని తెలిపారు. పద్మశాలీ సభ్యులు సమావేశానికి హాజరుకావాలని కోరారు.

Read More »

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

  పోలీసుల అదుపులో ఇద్దరు కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు, సదాశివనగర్‌ మండలాల్లో ఎల్‌అండ్‌బి కేబుల్‌ వైర్ల చోరీకి పాల్పడిన అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం రాత్రి పోలీసులు గస్తీ తిరుగుతుండగా అనుమానం వచ్చిన ఇద్దరిని పట్టుకొని విచారించగా చోరీ విషయం బయటపడినట్టు ఎస్‌పి శ్వేతారెడ్డి తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హర్యానా, రాజస్తాన్‌లకు చెందిన జాన్‌ మహ్మద్‌, మహ్మద్‌ సల్మాన్‌ఖాన్‌లు చత్తీస్‌గడ్‌నుంచి తెలంగాణ రాష్ట్రానికి …

Read More »

20న ఉచిత మెగా వైద్య శిబిరం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో ఈనెల 20వ తేదీన ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు ప్రతినిదులు తెలిపారు. మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సౌజన్యంతో కామరెడ్డి మున్నూరు కాపు సంఘం ఆద్వర్యంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు వైద్య శిబిరం జరుగుతుందన్నారు. బిపి, జిఆర్‌డిఎస్‌, ఇసిజి, గుండె సంబంధిత చికిత్సలు ఉచితంగా చేస్తారన్నారు. ఉచిత …

Read More »

రైల్వేస్టేషన్‌ వద్ద అన్నదానం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రైల్వేస్టేసన్‌ ప్రాంగణంలో నెలకొల్పిన శ్రీసీతారామ మంటపం వద్ద శనివారం బక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీరామనవమి పురస్కరించుకొని ప్రతియేటా రైల్వేస్టేసన్‌ ప్రాంగణంలో 9 రోజుల పాటు శ్రీసీతారామ విగ్రహాలు ఏర్పాటు చేసి మండపం ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అన్నదానం చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.

Read More »

కల్తీ వంటనూనెతో 13 మందికి అస్వస్థత

  కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని జయశంకర్‌ కాలనీలో నివాసముంటున్న వలస కూలీలు కల్తీ వంటనూనె వాడడంతో శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మిషన్‌ భగీరథ పథకంలో పనిచేసేందుకు కర్ణాటకరాష్ట్రంలోని జైపూర్‌ గ్రామం నుంచి వలస కూలీలు కామారెడ్డి శివారులోని జయశంకర్‌ కాలనీలో నివాసముంటు కూలీ పనిచేసుకుంటున్నారు. వీరు పట్టణంలోని ఓ సూపర్‌మార్కెట్‌ నుంచి మంచినూనె కొనుగోలు చేశారు. శనివారం వాటితో వంటచేసుకొని తినడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఇద్దరు గర్బిణీలతో పాటు చిన్నారులు …

Read More »

నిరసనల మధ్య విధులు నిర్వర్తించిన రెవెన్యూ అధికారులు

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌, డిప్యూటి తహసీల్దార్‌ జనార్ధన్‌, మండల అసిస్టెంట్‌ రెవెన్యూ అధికారి మంజుల రాణి, ఆర్‌ఐ రమేశ్‌బాబు, జూనియర్‌ అసిస్టెంట్‌ షబ్బీర్‌, ఏఎస్‌వో శ్యాం, మండల విఆర్వోలు, కంప్యూటర్‌ ఆపరేటర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి శనివారం విధులు నిర్వర్తించినట్టు తహసీల్దార్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలో విదులు నిర్వహిస్తున్న దళిత డిప్యూటి తహసీల్దార్‌ను అకారణంగా ఓ కార్పొరేటర్‌ అసభ్యంగా ప్రవర్తించడం పట్ల నిరసనగా నల్లబ్యాడ్జీలు దరించి విధులు నిర్వహిస్తున్నట్టు …

Read More »

గ్రామాభివృద్దికి ప్రతి ఒక్కరు సహకరించాలి

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏర్గట్ల గ్రామాభివృద్దికి ప్రతి ఒక్కరు సహకరించాలని సర్పంచ్‌ శ్రీవైష్ణవి అన్నారు. శనివారం ఏర్గట్ల గ్రామపంచాయతీలో సర్పంచ్‌ అధ్యక్షతన గ్రామసభ జరిగింది. ఇందులో గ్రామంలో చేపట్టిన అభివృద్ది పనులను కార్యదర్శి గంగాదాస్‌ చదివి వినిపించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన గ్రామాభివృద్ది కమిటీ సభ్యులను సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ కొలిప్యాక్‌ ఉపేంద్ర, పాలకవర్గ సభ్యులు, ఎంపిటిసిలు అంజయ్య, జక్కని సంధ్యారాణిలు, కార్యదర్శి సన్మానించారు. గ్రామంలో గత 30 రోజులుగా పారిశుద్యం పనులు చేపడుతున్నామని, శనివారం దోమల …

Read More »

తడపాకల్‌లో పారిశుద్య పనులు

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తడపాకల్‌ గ్రామంలో ప్రజల సంక్షేమాన్ని దృస్టిలో పెట్టుకొని పారిశుద్యం పనులు చేపట్టినట్టు స్థానిక సర్పంచ్‌ లోలం లావణ్య, చిన్నారెడ్డిలు అన్నారు. శనివారం తడపాకల్‌లో గ్రామసభ సర్పంచ్‌ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కార్యదర్శి గంగాదాసు చేపట్టిన అభివృద్ది పనులను, చేపట్టే పనుల తీర్మానాలను సభలో చదివి వినిపించారు. ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొచ్చి గ్రామంలోని అన్ని వీదుల్లోగల మురికి కాలువల్లో చెత్త, చెదారం తొలగించి, ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు …

Read More »