అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

 

పోలీసుల అదుపులో ఇద్దరు

కామారెడ్డి, ఏప్రిల్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు, సదాశివనగర్‌ మండలాల్లో ఎల్‌అండ్‌బి కేబుల్‌ వైర్ల చోరీకి పాల్పడిన అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం రాత్రి పోలీసులు గస్తీ తిరుగుతుండగా అనుమానం వచ్చిన ఇద్దరిని పట్టుకొని విచారించగా చోరీ విషయం బయటపడినట్టు ఎస్‌పి శ్వేతారెడ్డి తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హర్యానా, రాజస్తాన్‌లకు చెందిన జాన్‌ మహ్మద్‌, మహ్మద్‌ సల్మాన్‌ఖాన్‌లు చత్తీస్‌గడ్‌నుంచి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న విద్యుత్‌ సరపరా టవర్ల వద్ద ఎల్‌అండ్‌టి వైర్లను గతంలో దొంగిలించినట్టు తెలిపారు. దొంగిలించిన వాటిని డిల్లీకి చెందిన హరీష్‌ ద్వారా రాజ్‌వీర్‌ దాబాష్‌కు అమ్ముతున్నట్టు తెలిపారు.

ఢిల్లీలో లారీ కిరాయి తీసుకొని 9 మంది బృందంగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. వీరిలో ఇద్దరిని అరెస్టుచేశామని, మిగతా ఏడుగురిని త్వరలో పట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. వారినుంచి రూ. 60 లక్షల విలువగల అల్యుమినియం తీగలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. భిక్కనూరు మండలంలో 40 లక్షల విలువైన అల్యుమినియం, సదాశివనగర్‌లో 5 లక్షల విలువగల అల్యుమినియం, ఇతరచోట్ల 15 లక్షల విలువగల అల్యుమినియం తీగలను దొంగిలించారని, వాటిని స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. భిక్కనూరు, సదాశివనగర్‌ పోలీసులు గస్తీలో దొంగలను పట్టుకున్నట్టు తెలిపారు.సమావేశంలో డిఎస్పీ ప్రసన్నకుమారి, సిఐ శ్రీధర్‌కుమార్‌, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Check Also

చిత్రపురి పిల్మ్‌ఫెస్టివల్‌ అవార్డు గ్రహీతకు సన్మానం

  కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిత్రపురి పిల్మ్‌ఫెస్టివల్‌ 2017లో రాణించిన నరేశ్‌ను బుధవారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *