Breaking News

Daily Archives: April 16, 2017

చలివేంద్రం ప్రారంభం

  గాంధారి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం గుర్జాల్‌ గ్రామంలో ఆదివారం చలివేంద్రం ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామస్తుల, బాటసారుల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ప్రారంభించినట్టు గ్రామస్తులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ప్రహ్లాద్‌, ఎంపిటిసి లక్‌పతి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

రైతు బాంధవుడు కెసిఆర్‌

  గాంధారి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను రైతు బాంధవుడిగా కొలుస్తున్నారు. కెసిఆర్‌కు రుణపడి వుంటామని గ్రామ గ్రామాన పాలాభిషేకం చేస్తున్నారు. ఆదివారం గాంధారి మండలం గండివేట్‌ గ్రామంలో రైతులు, నాయకులు కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతులకు 100 శాతం రుణమాపీ చేయడమే గాకుండా, రైతులు వ్యవసాయంలో పడే బాధలను చూసి ఉచితంగా ఎరువులను అందిస్తామని ప్రకటించారు. ఎకరానికి 4 వేల రూపాయలు ఎరువులు ఉచితంగా అందజేస్తున్న కెసిఆర్‌కు రైతులు నీరాజనాలు …

Read More »

మొక్కజొన్న పంట దగ్దం

  గాంధారి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల పోతంగల్‌ కలాన్‌లో ఆదివారం మొక్కజొన్న పంట దగ్దమైంది. గ్రామానికి చెందిన మామిడి సాయిలుకు చెందిన మొక్కజొన్న పంటకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. దీంతో ఒక్కసారిగా పంట మొత్తం కాలి బూడిదైంది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, ఫైరింజన్‌ వచ్చి మంటలను ఆర్పింది. ఈ ప్రమాదంలో 50 వేల పంట నష్టం సంభవించినట్టు సమాచారం. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు సాయిలు వేడుకుంటున్నాడు.

Read More »

రిజర్వేషన్ల అమలుపై గిరిజనుల హర్షం

  గాంధారి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంపై గాంధారి మండల గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో గిరిజనులు సంబరాలు జరుపుకున్నారు. టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం స్థానిక నెహ్రూ చౌరస్తా వద్ద కెసిఆర్‌ భారీ చిత్రపటానికి 100 లీటర్లతో పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూబడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి కెసిఆర్‌ వెంట రాష్ట్రంలోని గిరిజనులంతా వున్నారన్నారు. …

Read More »

బల్దియా కార్మికుల నిర్లక్ష్యంతో అగ్నిప్రమాదం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బల్దియా కార్మికుల నిర్లక్ష్యంతో కామరెడ్డి పట్టణంలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని జాతీయ రహదారిపై పాత చెక్‌పోస్టు వద్ద పారిశుద్య కార్మికులు చెత్తకు నిప్పుపెట్టి వెళ్లిపోయారు. అనంతరం మంటలు వ్యాపించడంతోపక్కనే ఉన్న కార్లషెడ్‌లో నిప్పంటుకుంది. దీంతో రెండు కార్లు కాలిబూడిదయ్యాయి. రెండు లక్షలకు పైగా ఆస్తినష్టం సంభవించినట్టు దుకాణదారుడు వాపోయాడు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Read More »

పుస్తె, మెట్టెల వితరణ

  కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పేద వధూవరులకు పుస్తె, మెట్టెలను అందజేశారు. మున్నూరుకాపు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆకుల శ్రీనివాస్‌, ఆయన తండ్రి రాములు జ్జాపకార్థం రామారెడ్డి మండల కేంద్రంలోని చిన్న లింబయ్య, లక్ష్మిల కూతురు నవ్య వివాహానికి వెళ్లి పుస్తె, మెట్టెలు అందజేశారు. అనంతరం మున్నూరు కాపు జిల్లా అద్యక్షుడు మామిండ్ల అంజయ్య ఆధ్వర్యంలో మున్నూరు కాపు జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో కామరెడ్డి మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు పెద్ద …

Read More »

ఎండిపోతున్న పంటలు – ఆందోళనలో రైతులు

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత దశాబ్ద కాలంగా సరైన వర్షాలు కురియకపోవడం, గత వర్షాకాలం ఓ మోస్తరు భారీ వర్షాలు కురియడంతో గ్రామాల్లోని చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో రైతులు చక్కగా పంటలు సాగుచేశారు. రబీ సీజన్‌లో సైతం పుష్కలంగా నీరు ఉంటుందన్న ఆశతో వివిధ పంటలు సాగుచేశారు. వేసవిలో ఎండలు తీవ్రం కావడంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. చెరువులు, కుంటల్లో సైతం నీరు ఇంకిపోవడంతో పంట చేతికొచ్చే సమయంలో బోర్లు ఎత్తిపోవడంతో రైతులు ఆందోళన …

Read More »

బిజెపి నాయకుల అరెస్టు

  నందిపేట, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ఉదయం రాష్ట్ర శాసనసభలో రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి, బిజెవైఎం కార్యకర్తలు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తు తెలంగాణవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన నందిపేట పోలీసులు ఎస్‌ఐ జాన్‌రెడ్డి ఆధ్వర్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బిజెపి మండల అధ్యక్షుడు రాజుతోపాటు పలువురు నేతలను ఆదివారం ఉదయంముందస్తుగా అరెస్టు చేసి పోలీసు స్టేసన్‌కు తరలించారు.

Read More »

వైద్యుల ఆందోళనకు మద్దతునివ్వం

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైద్యుల ఆందోళనకు మోర్తాడ్‌ ప్రభుత్వ వైద్యులు మద్దతు ప్రకటించడం లేదని ఇన్‌చార్జి వైద్యులు మోహన్‌బాబు ఆదివారం తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఓ సంఘానికి చెందిన వైద్యులు ఆందోళనతో తమకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తాము ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుబడి యధావిధిగా విధులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వైద్యులు రవిందర్‌, లక్ష్మి, రాధిక, సూపర్‌వైజర్లు భాగ్యలక్ష్మి, సౌజన్య ఉన్నారు.

Read More »

అనాథ శరణాలయానికి వితరణ

  కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన శ్రీనివాస్‌ తన కుమార్తె తేజస్విని జన్మదిన వేడుకలను దోమకొండ మండల కేంద్రంలోని అనాథ ఆశ్రమంలో జరుపుకున్నారు. ఈ సందర్బంగా తేజస్విని అనాథ పిల్లల మధ్య కేక్‌ కట్‌చేసి అనంతరం ఆశ్రమానికి రూ. 7 వేలు విరాళంగా అందజేశారు.

Read More »