Breaking News

Daily Archives: April 19, 2017

గురువారం ఉచిత వైద్య శిబిరం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిపట్టణంలోని వీక్లిమార్కెట్‌లో గల మున్నూరు కాపు సంఘం భవనంలో గురువారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. మల్లారెడ్డి, నారాయణ ఆసుపత్రి సౌజన్యంతో మున్నూరు కాపు సంఘం ఆద్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇందులో ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులు సైతం ఉచితంగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. వివరాలకు 94402 15865 నెంబర్లో సంప్రదించాలని కోరారు.

Read More »

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

  నందిపేట, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రవిందర్‌ రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని ఐలాపూర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్‌ ఉమాకాంత్‌, సొసైటీ ఛైర్మన్‌ లక్ష్మినారాయణతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారుల బెడద నుంచి కాపాడేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఏగ్రేడ్‌ ధాన్యానికి రూ. …

Read More »

గురువారం రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌

  కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని ఎస్‌ఆర్‌కె డిగ్రీ, పిజి కళాశాలలో గురువారం అపోలో మెడ్‌ప్లస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్టు కళాశాల కరస్పాండెంట్‌ జైపాల్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ గురువేందర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో రిక్రూట్‌మెంట్‌పై విద్యార్థులకు, అభ్యర్థులకు బుధవారం అవగాహన కల్పించామని చెప్పారు. గురువారం ఇంటర్వ్యూలో పాల్గొనే అభ్యర్థులు తమ సర్టిపికెట్లు, రెస్యుమ్‌ వెంట తెచ్చుకోవాలని సూచించారు.

Read More »

కొనసాగుతున్న గ్రామసభలు

  నందిపేట, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బజార్‌కొత్తూరు, సి.హెచ్‌.కొండూరు, తొండాకూర్‌, ఖుదావన్‌పూర్‌, వన్నెల్‌.కె. సిద్దాపూర్‌ గ్రామాల్లో బుధవారం గ్రామసర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. ఖుదావన్‌పూర్‌ గ్రామసభలో మండల అభివృద్ది అధికారి నాగవర్దన్‌ మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలేవైనా ఉంటే గ్రామసభల ద్వారా అదికారుల దృస్టికితీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. అదేవిదంగా రానున్న రోజుల్లో మొక్కలు విరివిగా నాటి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు వందశాతం నిర్మించుకోవాలని అన్నారు. నీటిని పొదుపుగా వాడుకొని భూగర్భజలాల వృద్దికొరకు ఇంకుడు …

Read More »

ధాన్యం దళారుల పాలు చేయొద్దు

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం దళారుల పాలు చేసి రైతులు మోసపోవద్దని బీర్కూర్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పెరిక శ్రీనివాస్‌ అన్నారు. బీర్కూర్‌ మండలంలోని కిష్టాపూర్‌ గ్రామంలో, నసురుల్లాబాద్‌ మండలంలోని అంకోల్‌, బొమ్మన్‌దేవుపల్లి గ్రామాల్లో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టించిన రైతు దళారుల మాయమాటలు నమ్మి తక్కువ ధరకు ధాన్యం విక్రయించొద్దని సూచించారు. బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో ప్రతిగ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు …

Read More »

వడగండ్ల వాన బాధితులకు ఎకరానికి రూ. 10 వేలు పరిహారం అందించాలని తీర్మానం

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొన్నిరోజుల క్రితం వడగండ్ల వాన వల్ల బీర్కూర్‌ మండలంలో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేల నష్టపరిహారం చెల్లించాలని గ్రామసభలో తీర్మానించారు. బీర్కూర్‌ మండల కేంద్రంలో బుధవారం గ్రామ సర్పంచ్‌నర్సయ్య ఆద్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి యాదగిరి గత మూడునెలల పంచాయతీ ఆదాయ, వ్యయాలను చదివి వినిపించారు. రానున్న వేసవి దృష్ట్యా మండల కేంద్రంలో మంచినీటి సదుపాయం కల్పించాలని సూచించారు. వడగండ్ల వాన వల్లనష్టపోయిన …

Read More »

ఘనంగా కుస్తీ పోటీలు

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బరంగెడ్గి గ్రామంలో బుధవారం గ్రామ పంచాయతీ ఆద్వర్యంలో ఘనంగా కుస్తీ పోటీలు నిర్వహించారు. పోటీలకు మల్లయోధులు మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చివరి కుస్తీ గెలిచిన అభ్యర్థికి పంచాయతీ ఆద్వర్యంలో నగదు, శాలువా, జ్ఞాపిక అందజేశారు. కుస్తీ పోటీలు తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా విచ్చేశారు. గ్రామపెద్దలు పాల్గొన్నారు.

Read More »

ప్రతిష్టకు సిద్దమైన ఆంజనేయ ఆలయం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్‌బి నగర్‌ హనుమాన్‌ కాలనీలో ఇష్టకార్యసిద్ధి ఆంజనేయస్వామి క్షేత్రంలో గురువారం స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. పునరుద్దరణలో భాగంగా భక్తుల విరాళాలు సేకరించి ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఇందులో భాగంగా ఈనెల 20, 21,22 తేదీల్లో ప్రత్యేక పూజలు, ప్రతిష్ట, యజ్ఞ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో ప్రముఖ పండితులు గంగవరం నారాయణ శర్మతోపాటు 21 మంది రుత్విక్కులు పాల్గొననున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయకమిటీ ప్రతినిదులు సత్యనారాయణగౌడ్‌, నిత్యానందం, బాల్‌కిషన్‌లు …

Read More »

రక్తదానం చేసిన వైస్‌ఛైర్మన్‌

  కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ బుధవారం రక్తదానం చేశారు. ఆపదలో ఉండి ఓవ్యక్తికి రక్తం అవసరం కాగా మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌తోపాటు తెరాస నాయకులు రక్తదానం చేశారు.

Read More »

సులభ్‌ కాంప్లెక్సు పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 12వ వార్డులో మహిళ సులభ్‌ కాంప్లెక్సు నిర్మాణ పనులను కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో సులభ్‌ కాంప్లెక్సులు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీటిని గుర్తించి అవసరమైన చోట సులభ్‌ కాంప్లెక్సులు నిర్మిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా 12వ వార్డులో సులభ్‌ కాంప్లెక్సు నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో తెరాస నాయకులు దాత్రిక సత్యం, వార్డు వాసులు పాల్గొన్నారు.

Read More »