Breaking News

ధాన్యం దళారుల పాలు చేయొద్దు

 

బీర్కూర్‌, ఏప్రిల్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం దళారుల పాలు చేసి రైతులు మోసపోవద్దని బీర్కూర్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పెరిక శ్రీనివాస్‌ అన్నారు. బీర్కూర్‌ మండలంలోని కిష్టాపూర్‌ గ్రామంలో, నసురుల్లాబాద్‌ మండలంలోని అంకోల్‌, బొమ్మన్‌దేవుపల్లి గ్రామాల్లో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టించిన రైతు దళారుల మాయమాటలు నమ్మి తక్కువ ధరకు ధాన్యం విక్రయించొద్దని సూచించారు. బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో ప్రతిగ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రభుత్వం గిట్టుబాటు ధర అందిస్తుందని స్పస్టం చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో దాన్యం విక్రయించిన రైతులకు 24 గంటల్లో నగదు జమచేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల పెద్దలు పాల్గొన్నారు.

Check Also

పూరి వర్గాన్నే టార్గెట్ చేశారా?

హైదరాబాద్: సినిమా ఇండ్రస్టీ అంటేనే ఓ మాయా జగత్తు. సింగిల్ నైట్లో స్టార్స్ అయిపోవచ్చు. సింగిల్ డేలో రోడ్డుపైకి వచ్చేయచ్చు. ఒక్క …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *