Breaking News

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

 

నందిపేట, ఏప్రిల్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రవిందర్‌ రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని ఐలాపూర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్‌ ఉమాకాంత్‌, సొసైటీ ఛైర్మన్‌ లక్ష్మినారాయణతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారుల బెడద నుంచి కాపాడేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఏగ్రేడ్‌ ధాన్యానికి రూ. 1510, బిగ్రేడ్‌ ధాన్యానికి రూ. 1470 మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Check Also

బాసరకు పాదయాత్ర

  బీర్కూర్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసంత పంచమి సరస్వతిదేవి జన్మదినాన్ని పురస్కరించుకొని బీర్కూర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *