కొనసాగుతున్న గ్రామసభలు

 

నందిపేట, ఏప్రిల్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బజార్‌కొత్తూరు, సి.హెచ్‌.కొండూరు, తొండాకూర్‌, ఖుదావన్‌పూర్‌, వన్నెల్‌.కె. సిద్దాపూర్‌ గ్రామాల్లో బుధవారం గ్రామసర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. ఖుదావన్‌పూర్‌ గ్రామసభలో మండల అభివృద్ది అధికారి నాగవర్దన్‌ మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలేవైనా ఉంటే గ్రామసభల ద్వారా అదికారుల దృస్టికితీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. అదేవిదంగా రానున్న రోజుల్లో మొక్కలు విరివిగా నాటి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు వందశాతం నిర్మించుకోవాలని అన్నారు. నీటిని పొదుపుగా వాడుకొని భూగర్భజలాల వృద్దికొరకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.పంటలు ఎండబెట్టుకోవడానికి ప్లాట్‌ఫాం నిర్మించుకోవడానికి ప్రభుత్వంఉపాధి హామీ కింద నిధులు మంజూరు చేయనుందని, ఇందుకోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆయనతోపాటు మండల తహసీల్దార్‌ ఉమాకాంత్‌, సర్పంచ్‌లు దర్మన్న, కళావతి సాయాగౌడ్‌, దేవిదాస్‌, లింబాగౌడ్‌, ఉపసర్పంచ్‌ బాబురావు, ఎంపిటిసి సురేశ్‌గౌడ్‌, బండి నర్సాగౌడ్‌,తదితరులు పాల్గొన్నారు.

Check Also

నెలాఖరులోగా పత్తిరైతులకు గుర్తింపు కార్డులు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెలాఖరులోగా పత్తి రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్టు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *