Breaking News

Daily Archives: April 20, 2017

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మండవ వెంకటేశ్వర్‌రావు

  నందిపేట, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : .మండలంలోని బాద్గుణ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ గంగాధర్‌ ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ గురువారం మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. గంగాధర్‌ 2006-2011లో సర్పంచ్‌గా పనిచేశాడు. వారితోపాటు జితేందర్‌రెడ్డి, మాజీ జడ్పిటిసి గోపాల్‌శర్మ, నర్సింహారెడ్డి, ఆనంద్‌, చిన్నయ్య, నాగరాజు, జ్యోతి నారాయణ, గంగాగౌడ్‌, గంగారెడ్డి, సాగర్‌, తదితరులున్నారు.

Read More »

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు 67వ జన్మదిన వేడుకలను గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిడిపి శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఉస్మాన్‌ కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి హోదాలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి గుండెల్లో బాబు చెరగని ముద్రవేశారన్నారు. జాతీయ …

Read More »

జెమిని టీ ఆధ్వర్యంలో చలివేంద్రం

  నందిపేట, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని గుడ్స్‌ క్యారియర్‌ పార్కింగ్‌ వద్ద జెమిని టీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సర్పంచ్‌ షాకీర్‌ హుస్సేన్‌ గురువారం ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృస్టిలో ఉంచుకొని గ్రామస్తుల, బాటసారుల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ప్రారంభించినట్టు డీలర్‌ శ్రీను తెలిపారు. జెమినిటీ కంపెనీ అధికారులు ఏడుకొండలు, వర్తక సంఘం సభ్యులు ప్రదీప్‌, కిషన్‌, లవణ్‌, రాజ్‌కుమార్‌, గంగాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

చలివేంద్రం ప్రారంభం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని డెయిలీ మార్కెట్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య గురువారం ప్రారంభించారు. జెమిని టి, శ్రీరామ స్టోర్స్‌ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గత 16 సంవత్సరాలుగా వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ వేసవి కాలంలో డెయిలీ మార్కెట్‌కు వచ్చే ప్రజలతో పాటు స్థానికులకు చల్లటి తాగునీరు అందించేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ …

Read More »

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో 65 మంది ఎంపిక

  కామారెడ్డి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : .కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్‌ఆర్‌కె డిగ్రీ, పిజి కళాశాలలో గురువారం టాస్క్‌ ఆద్వర్యంలో అపోలో మెడ్‌స్కిల్స్‌ సహకారంతో నిర్వహించిన క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ రిక్రూట్‌ డ్రైవ్‌లో 65 మంది ఎంపికైనట్టు కళాశాల కరస్పాండెంట్‌ జైపాల్‌ తెలిపారు. డిగ్రీ స్థాయిలో లైఫ్‌ సైన్స్‌ కలిగిన 150మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. ఎంపికైన విద్యార్థుల్లో 45 మంది ఎస్‌ఆర్‌కె విద్యార్థులు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టాస్క్‌ క్లస్టర్‌ మేనేజర్‌ బాలు, ప్రిన్సిపాల్‌ …

Read More »

మతపరమైన రిజర్వేషన్లు గర్హణీయం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం మతపరమైన రిజర్వేషన్లు కల్పించాలని చూడడం గర్హణీయమని, అది చారిత్రాత్మక తప్పిదమని బిజెపి నాయకులు అన్నారు. దీన్ని ప్రభుత్వం విరమించుకోవాలని గురువారం కామారెడ్డి ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముస్లింలకు మతం పేరుతో 12 శాతం రిజర్వేసన్లు కల్పించారని, తెరాస ప్రబుత్వం నిర్ణయించడం ఇతరులకు ద్రోహం చేయడమేనన్నారు. మత రిజర్వేషన్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమని, న్యాయస్థానాల తీర్పులకు వ్యతిరేకమన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ ప్రబుత్వం కల్పించిన …

Read More »

రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : .రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కామారెడ్డి జిల్లాకలెక్టర్‌ సత్యనారాయణ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా ఏరియా ఆసుపత్రిలో గురువారం ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ, కర్షక్‌ బిఇడి కళాశాల సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో కలెక్టర్‌ రక్తదానం చేశారు. అలాగే రాష్ట్ర ఫుడ్‌ కంట్రోల్‌ కమీషన్‌ ఛైర్మన్‌ తిరుమల్‌రెడ్డి రక్తదానం చేశారు. అనంతరం జిల్లాకలెక్టర్‌ మాట్లాడుతూ రక్తదానం మహోన్నతమైందని, ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం …

Read More »

సారారహిత జిల్లాగా మారుస్తాం

  గాంధారి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :వంద శాతం నాటుసారా రహిత జిల్లాగా కామారెడ్డిని తెలంగాణలోనే మొదటి స్థానంలో నిలుపుతామని జిల్లా ఇఎస్‌ చంద్రశేఖర్‌ అన్నారు. గురువారం మండలంలోని దుర్గం గ్రామ పంచాయతీ పరిధిలోని తాండాల్లో పర్యటించి నాటుసారా తయారుచేయవద్దని తాండా వాసులకు అవగాహన కల్పించారు. తాండా వాసులతో నాటుసారా తయారు చేయకుండా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2వ తేదీ …

Read More »

స్థానిక సమస్యలు పరిష్కరించాలి

  గాంధారి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : .మండలంలోని స్థానిక సమస్యలను పరిష్కరించాలని సిపిఐ (ఎం) నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం స్తానిక గిర్దావర్‌ శ్రీనివాస్‌ రావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మట్లాడుతూ మండలంలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తాండాల్లో మంచినీళ్లతో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. నర్సాపూర్‌ లాంటి గ్రామాలకు రోడ్లు లేవని అనేక సార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. పోడుభూమి సాగుదార్లపై ఫారెస్టు అధికారులు వేదింపులు ఆగడం లేదన్నారు. పంటలు పండినా ఫలితం …

Read More »

ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు

  గాంధారి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : .గాంధారి మండలంలో గురువారం నాటికి అగ్నిమాపక వారోత్సవాలు ముగిశాయి. గత వారం రోజులుగా మండలంలోని వివిధ గ్రామాల్లో అగ్ని మాపక సిబ్బంది అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే 101 నెంబరుకు సమాచారం అందించాలని సూచించారు. మండల కేంద్రంలో ఫైరింజన్‌తో అగ్నిమాపక సిబ్బంది విన్యాసాలు నిర్వహించారు. వారోత్సవాల చివరిరోజు స్థానిక జడ్పిటిసి తానాజీరావు పాల్గొన్నారు. విపత్కర పరిస్థితిలో అగ్ని మాపక సిబ్బంది …

Read More »