క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో 65 మంది ఎంపిక

 

కామారెడ్డి, ఏప్రిల్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : .కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్‌ఆర్‌కె డిగ్రీ, పిజి కళాశాలలో గురువారం టాస్క్‌ ఆద్వర్యంలో అపోలో మెడ్‌స్కిల్స్‌ సహకారంతో నిర్వహించిన క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ రిక్రూట్‌ డ్రైవ్‌లో 65 మంది ఎంపికైనట్టు కళాశాల కరస్పాండెంట్‌ జైపాల్‌ తెలిపారు. డిగ్రీ స్థాయిలో లైఫ్‌ సైన్స్‌ కలిగిన 150మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. ఎంపికైన విద్యార్థుల్లో 45 మంది ఎస్‌ఆర్‌కె విద్యార్థులు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టాస్క్‌ క్లస్టర్‌ మేనేజర్‌ బాలు, ప్రిన్సిపాల్‌ గురువేందర్‌రెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ దత్తాద్రి, ప్రతినిధులు సుధాకర్‌, సందీప్‌, దత్తు, సంతోష్‌రెడ్డి, కపిల్‌, లింగం, మహేశ్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Check Also

నెలాఖరులోగా పత్తిరైతులకు గుర్తింపు కార్డులు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెలాఖరులోగా పత్తి రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్టు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *