రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి

 

కామారెడ్డి, ఏప్రిల్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : .రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కామారెడ్డి జిల్లాకలెక్టర్‌ సత్యనారాయణ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా ఏరియా ఆసుపత్రిలో గురువారం ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ, కర్షక్‌ బిఇడి కళాశాల సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో కలెక్టర్‌ రక్తదానం చేశారు. అలాగే రాష్ట్ర ఫుడ్‌ కంట్రోల్‌ కమీషన్‌ ఛైర్మన్‌ తిరుమల్‌రెడ్డి రక్తదానం చేశారు. అనంతరం జిల్లాకలెక్టర్‌ మాట్లాడుతూ రక్తదానం మహోన్నతమైందని, ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం తిరుమల్‌రెడ్డి మాట్లాడుతూ రక్తదానం నిరంతర ప్రక్రియగా కొనసాగాలని, ఈరోజు మనం చేసిన రక్తదానం రేపు ఆపదలో ఉన్న ప్రాణిని కాపాడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ రషీద్‌, డైరెక్టర్‌ ప్రతాప్‌రెడ్డి, డిఎం అండ్‌ హెచ్‌వోచంద్రశేఖర్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అజయ్‌కుమార్‌, ఐఆర్‌సిఎస్‌ ప్రధాన కార్యదర్శి రాజన్న, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నెలాఖరులోగా పత్తిరైతులకు గుర్తింపు కార్డులు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెలాఖరులోగా పత్తి రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్టు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *