ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

 

కామారెడ్డి, ఏప్రిల్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు 67వ జన్మదిన వేడుకలను గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిడిపి శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఉస్మాన్‌ కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి హోదాలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి గుండెల్లో బాబు చెరగని ముద్రవేశారన్నారు. జాతీయ స్తాయిలో ప్రజలకు ఆయన సేవలు అవసరమని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నజీరుద్దీన్‌, కామారెడ్డి, మాచారెడ్డి మండల అధ్యక్షులు భూమయ్య, రాజిరెడ్డి, నాయకులు జావెద్‌,రాజయ్య, బాలసాయిలు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Check Also

చిత్రపురి పిల్మ్‌ఫెస్టివల్‌ అవార్డు గ్రహీతకు సన్మానం

  కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిత్రపురి పిల్మ్‌ఫెస్టివల్‌ 2017లో రాణించిన నరేశ్‌ను బుధవారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *