సారారహిత జిల్లాగా మారుస్తాం

 

గాంధారి, ఏప్రిల్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :వంద శాతం నాటుసారా రహిత జిల్లాగా కామారెడ్డిని తెలంగాణలోనే మొదటి స్థానంలో నిలుపుతామని జిల్లా ఇఎస్‌ చంద్రశేఖర్‌ అన్నారు. గురువారం మండలంలోని దుర్గం గ్రామ పంచాయతీ పరిధిలోని తాండాల్లో పర్యటించి నాటుసారా తయారుచేయవద్దని తాండా వాసులకు అవగాహన కల్పించారు. తాండా వాసులతో నాటుసారా తయారు చేయకుండా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2వ తేదీ నాటికి కామారెడ్డి జిల్లాలో ఎక్కడా నాటుసారా తయారుచేయకుండా చేస్తామన్నారు. ఇప్పటికే దాదాపు 98 శాతం నాటుసారా తయారుచేయకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

గతంలో ఒకసారి వందశాతం నాటుసారా రహిత జిల్లాగా ప్రకటించుకున్నప్పటికి అక్కడక్కడా ఒకటిరెండు శాతం సారా తయారు చేస్తున్న విషయాన్ని గుర్తించామన్నారు. మిగతా రెండు శాతాన్ని సైతం జూన్‌ 2వ తేదీ నాటికి పూర్తి చేసి తెలంగాణలోని కామారెడ్డి జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతామన్నారు. అకుల్‌ సబర్వాల్‌ ఆదేశాలకనుగుణంగా చిన్న గ్రామాలు, తాండాల్లో ఎక్సైజ్‌ శాఖాధికారులు వెళ్ళి నాటుసారా తయారుచేయడం వల్ల కలిగే నష్టాలను వివరించి ప్రజలకు అవగాహన కల్పించనున్నట్టు ఆయన తెలిపారు. ఎవరైనా నాటుసారా తయారు చేస్తున్నట్టు గమనిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు. కేసులతో జీవితాలు నాశనం చేసుకోవద్దని నాటుసారా తయారుచేయడం మానేసి స్వంతంగా ఏదైనా పనిచేసుకుని జీవితంలో స్థిరపడాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో గాంధారి సర్పంచ్‌ సత్యం, డిటిఎఫ్‌ సిఐ పీర్‌సింగ్‌, ఎల్లారెడ్డి సిఐ ఎఎల్‌ఎన్‌స్వామి, ఎస్‌ఐలు సృజనాకుమారి, నాగభూషణం, సిబ్బంది తదితరులున్నారు.

Check Also

నెలాఖరులోగా పత్తిరైతులకు గుర్తింపు కార్డులు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెలాఖరులోగా పత్తి రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్టు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *