ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు

 

గాంధారి, ఏప్రిల్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : .గాంధారి మండలంలో గురువారం నాటికి అగ్నిమాపక వారోత్సవాలు ముగిశాయి. గత వారం రోజులుగా మండలంలోని వివిధ గ్రామాల్లో అగ్ని మాపక సిబ్బంది అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే 101 నెంబరుకు సమాచారం అందించాలని సూచించారు. మండల కేంద్రంలో ఫైరింజన్‌తో అగ్నిమాపక సిబ్బంది విన్యాసాలు నిర్వహించారు. వారోత్సవాల చివరిరోజు స్థానిక జడ్పిటిసి తానాజీరావు పాల్గొన్నారు. విపత్కర పరిస్థితిలో అగ్ని మాపక సిబ్బంది ధైర్య సాహసాలను కొనియాడారు. కార్యక్రమంలో ఎండివో సాయాగౌడ్‌, సిబ్బంది ఉన్నారు.

Check Also

నెలాఖరులోగా పత్తిరైతులకు గుర్తింపు కార్డులు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెలాఖరులోగా పత్తి రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్టు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *