స్థానిక సమస్యలు పరిష్కరించాలి

 

గాంధారి, ఏప్రిల్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : .మండలంలోని స్థానిక సమస్యలను పరిష్కరించాలని సిపిఐ (ఎం) నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం స్తానిక గిర్దావర్‌ శ్రీనివాస్‌ రావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మట్లాడుతూ మండలంలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తాండాల్లో మంచినీళ్లతో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. నర్సాపూర్‌ లాంటి గ్రామాలకు రోడ్లు లేవని అనేక సార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. పోడుభూమి సాగుదార్లపై ఫారెస్టు అధికారులు వేదింపులు ఆగడం లేదన్నారు. పంటలు పండినా ఫలితం లేదన్నారు. కేసులు పెట్టి హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్‌ బెడ్‌రూం ఊసెత్తడం లేదని వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. గాంధారి మండలంలో దళితులకు ఒక సెంటు భూమి కూడా ఇవ్వలేదన్నారు. అర్హులైన వారిని గుర్తించి మూడెకరాల భూమిని పంపిణీ చేయాలని కోరారు. మండలంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వినతి పత్రంలో కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు మోతిరాం నాయక్‌, కమ్మరి సాయిలు, కామెల్లి రాములు, బి.సాయిలు, దేవిసింగ్‌, రాధ, బుచ్చన్న, సీతారామ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నెలాఖరులోగా పత్తిరైతులకు గుర్తింపు కార్డులు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెలాఖరులోగా పత్తి రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్టు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *