మతపరమైన రిజర్వేషన్లు గర్హణీయం

 

కామారెడ్డి, ఏప్రిల్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం మతపరమైన రిజర్వేషన్లు కల్పించాలని చూడడం గర్హణీయమని, అది చారిత్రాత్మక తప్పిదమని బిజెపి నాయకులు అన్నారు. దీన్ని ప్రభుత్వం విరమించుకోవాలని గురువారం కామారెడ్డి ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముస్లింలకు మతం పేరుతో 12 శాతం రిజర్వేసన్లు కల్పించారని, తెరాస ప్రబుత్వం నిర్ణయించడం ఇతరులకు ద్రోహం చేయడమేనన్నారు. మత రిజర్వేషన్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమని, న్యాయస్థానాల తీర్పులకు వ్యతిరేకమన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ ప్రబుత్వం కల్పించిన 4 శాతం మతరిజర్వేషన్ల వ్యవహారం ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్తానం పరిశీలనలో ఉండగా తిరిగి తెరాస ప్రబుత్వం 12 శాతం రిజర్వేసన్లు కల్పిస్తూ బిల్లును శాసనసబలో ఆమోదించడం సమంజసం కాదన్నారు. దీన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు చింతల రమేశ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుమోతె కృష్ణాగౌడ్‌, జిల్లా ఉపాద్యక్షుడు రమేశ్‌, ప్రధాన కార్యదర్శి నీలం చిన్నరాజులు, నాయకులు నరేశ్‌, బాలాజీ, రాము, సతీష్‌, తదితరులున్నారు.

Check Also

నెలాఖరులోగా పత్తిరైతులకు గుర్తింపు కార్డులు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెలాఖరులోగా పత్తి రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్టు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *