Breaking News

జెమిని టీ ఆధ్వర్యంలో చలివేంద్రం

 

నందిపేట, ఏప్రిల్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని గుడ్స్‌ క్యారియర్‌ పార్కింగ్‌ వద్ద జెమిని టీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సర్పంచ్‌ షాకీర్‌ హుస్సేన్‌ గురువారం ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృస్టిలో ఉంచుకొని గ్రామస్తుల, బాటసారుల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ప్రారంభించినట్టు డీలర్‌ శ్రీను తెలిపారు. జెమినిటీ కంపెనీ అధికారులు ఏడుకొండలు, వర్తక సంఘం సభ్యులు ప్రదీప్‌, కిషన్‌, లవణ్‌, రాజ్‌కుమార్‌, గంగాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెలంగాణ తిరుమల ఆలయ హుండీ లెక్కింపు

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ శివారులోగల తెలంగాణ తిరుమల ఆలయంలో సోమవారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *