Breaking News

చలివేంద్రం ప్రారంభం

 

కామారెడ్డి, ఏప్రిల్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని డెయిలీ మార్కెట్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య గురువారం ప్రారంభించారు. జెమిని టి, శ్రీరామ స్టోర్స్‌ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గత 16 సంవత్సరాలుగా వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ వేసవి కాలంలో డెయిలీ మార్కెట్‌కు వచ్చే ప్రజలతో పాటు స్థానికులకు చల్లటి తాగునీరు అందించేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, తహసీల్దార్‌ అనిల్‌కుమార్‌, కాంశెట్టి, సుకుమార్‌గౌడ్‌, మధు, రాజిరెడ్డి, శ్రీనివాస్‌, సుధీర్‌, రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

భోజన వసతి కల్పించాలి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చదువుకుంటున్న నిరుద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *